26, ఏప్రిల్ 2010, సోమవారం

రచన శాయి గారికి అభినందనలతో

*******************************************************************************************************************************************************
దాసరి వారి మీది వేయబోతున్న ప్రత్యెక సంచిక నుండి కొన్ని పుటలను "టీజర్స్ లాగ" రచన శాయి గారు, "మన తెలుగు చందమామ" రచయితలందరికి పంపారు. అలా పంపటానికి కారణం, మేమందరమూ, ప్రత్యెక సంచికలో కొద్దో గొప్పో మా వంతుగా కొన్ని సమీక్షా వ్యాసాలు వ్రాయటమే. అలా పంపిన "టీజర్" పుటలను చూసి, అందరమూ ఎంతగానో సంతోషించాము. మాలో అందరికన్నా ఎక్కువ సంతోషం చూపటమే కాక, మా అందరి హృదయాలలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని, అభినందనలను రాజశేఖర రాజుగారు అద్భుతంగా వ్యక్తపరిచారు. చదవండి ఆయన మాటలలోనే

*******************************************************************************************************************************************************

డియర్ శ్రీ శాయి గారూ,
మీరు పంపిన, దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన ప్రత్యేక సంచిక -మే, 2010- వివరాల పీడీఎఫ్ ఫైల్అందింది. నిన్న సాయంత్రం నుంచి సిస్టమ్ నాకు అందుబాటులో లేదు. దీంతో వెంటనే మీకు మెయిల్పంపలేకపోయాను. ఇది ప్రశంస అనుకోండి. కృతజ్ఞత అనుకోండి. మీతో కొన్ని మాటలు పంచుకోవాలనిఉంది.

చందమామ కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు జనవరి చివరలో పోయాక ఆయనపై రచనప్రత్యేక సంచిక తీసుకురావాలనే ఆలోచనే మీకు రాకుండా ఉండి ఉంటే.. బాలసాహిత్యానికిసంబంధించినంతవరకూ గొప్ప తెలుగు పుస్తకం చరిత్రలో రికార్డుకు కూడా లేకుండా పోయేది. అందుకుచందమామ అభిమానులందరూ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీ ప్రకటన అందించిన ప్రేరణతో దాసరి గారిఅభిమానులు ఓరకంగా వీరావేశంతోనే పనిచేసి, పోటీలు పడి మరీ ఆయన రచనలపై, జీవితంపై తమకుతెలిసిన సమస్త సమాచారాన్ని ప్రోది చేసి పంపారు.

చందమామ వైభవోజ్వల స్వర్ణయుగానికి కారణభూతులైన మహనీయులలో దాసరి గారు ఒకరు. ఆయననుంచి 1980 వరకు విరామం లేకుండా చందమామ చరిత్రలోనే అజరామరమైన 12 ధారావాహికలను రాశారన్న విషయం కూడా దశాబ్దాల పాటు మరుగునపడింది. పత్రికకు తప్ప సిబ్బందికి, ఇన్ హౌస్ రచయితలకు ప్రాముఖ్యత కల్పించరాదన్న సంప్రదాయం చందమామది. పాలసీచందమామకు మేలు చేసినప్పటికీ చందమామ ధారావాహికల రచయిత ఎవరో ప్రపంచానికి తెలియకుండాచేసింది. కుటుంబరావుగారే చందమామలో పేరులేని ఎడిటర్గా దశాబ్దాలపాటు పనిచేశారనే విషయం చాలాకొద్దిమందికి మాత్రమే తెలుసు. 1954 ‌

ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు, ఇన్ని దశాబ్దాలకు... చందమామలో 54 ఏళ్లపాటు నిరవధికంగా పనిచేసిన గొప్పమనిషి జీవిత, కథాసాహిత్య వివరాలు రచన పత్రిక ద్వారా, కేవలం మీ ద్వారా ప్రపంచం ముందుకువస్తున్నాయి. సమస్త చందమామ అభిమానుల తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలుతెలుపుతున్నాను.

ప్రత్యేక సంచిక నిడివి పెరగడం, ఊహించిన దానికంటే సమాచారం ఎక్కువగా పోగుపడటం వంటి కారణాలతోరచన ఏప్రిల్ సంచిక ముద్రణను పక్కనపెట్టి కూడా మీరు దాసరి గారిపై ప్రత్యేక సంచికకోసం తీవ్ర కృషిచేశారు. ఒక నెల పత్రిక ముద్రణ నిలిచిపోయినా ఫర్వాలేదనే తెగింపే సాహసోపేత నిర్ణయం. 1998లోచందమామ తాత్కాలిక అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు తగిలిన దెబ్బనుంచి చందమామ ఇప్పటికీకోలుకోలేదు.

అందుకే మీ నిర్ణయం సాహసోపేతమైనది. దశాబ్దాలుగా తెలుగు వారి సాంస్కృతిక రాయబారిగా పనిచేసిన, చేస్తున్నచందమామ పత్రికపై అబిమానం, మమకారం హృదయంలో నిలుపుకున్నారు కాబట్టే మీరు ఇంతతెగింపుకు సిద్ధపడ్డారు. చంపి -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లలో ప్రధమస్థానం మీదే అని గతంలోత్రివిక్రమ్ గారు సందర్బంలో అన్నారు. రకంగా కూడా అది నిజమైంది.

చందమామ చరిత్రకు తన ధారావాహికల ద్వారా మెరుగులు దిద్దిన గొప్ప మనిషికి 'రచన' పత్రిక ప్రత్యేకసంచిక నీరాజనం పలుకుతోంది. బహుశా దాసరి గారికి ఇంతకు మించిన నివాళి మరొకటి ఉంటుందనినేననుకోవడం లేదు. ఇందుకు సంబంధించిన మొత్తం ఘనత మీదే అని మనస్పూర్తిగా చెబుతున్నా.

ఈ హారీ పోటర్లూ, అవతార్‌ల గురించి ప్రపంచానికి తెలీని రోజుల్లో చందమామ ధారావాహికల ద్వారా కోట్లాది మంది భారతీయ పిల్లలను, పెద్దలను జానపద మంత్ర నగరి సరిహద్దుల్లో ఓలలాడించిన గొప్ప కథకులు దాసరిగారు. దశాబ్దాలుగా మరుగున పడిన ఈయన మేటి కృషిని, తెరవెనుక నేపధ్యాన్ని రచన ప్రత్యేక సంచిక -మే,2010- ద్వారా ప్రపంచం తెలుసుకోనుంది.
చందమామ రచయిత రాసిన అన్ని ధారావాహికల పరిచయాలను, ఇతర వివరాలను ఒకే చోట చదివే అవకాశాన్ని చందమామ అభిమానులకు, పాఠకులకు కల్పించడం రచన పత్రిక వల్లే సాధ్యపడింది. 'మాకూ ఓ ప్రపంచ స్థాయి కథా రచయిత ఉన్నాడు' అని జబ్బలు చరిచి మరీ తెలుగువాళ్లు చెప్పుకునేలా సాగించిన ఓ అద్బుత కృషికి గాను మీరు గత రెండు నెలలుగా అలుపెరుగకుండా శ్రమించారు.
మీ సంకల్పబలం విజయవంతం కావాలని, ప్రతి చందమామ అభిమాని, పాఠకులు, జానపద కథల ప్రేమికులు ఈ ప్రత్యేక సంచికను అపురూపంగా దాచుకుంటారని ఆశిస్తున్నాను.

ప్రత్యేక సంచిక పది కాపీలను నేను రిజర్వ్ చేసుకున్నాను. మీకు ఎంఓ కూడా పంపాను. మే 2 ప్రత్యేకసంచిక విడుదలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము.

ప్రపంచంలోని చందమామ ప్రేమికులందరి అభిమానం మీపై కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
రాజశేఖర రాజు

చందమామ

*******************************************************************************************************************************************************

మీరు కూడా ఈ ప్రత్యెక సంచిక ట్రైలర్ చూడదలుచుకున్నారా!
వెంటనే రచన వెబ్ సైటును దర్శించండి
రచన పత్రిక




2 కామెంట్‌లు:

  1. శివరాం గారూ, అభినందనలు. చాలా మంచి పని చేసారు. మే 2వ తేదీన కూడా ఇలాగే దాసరి గారి పై ప్రత్యేక సంచిక గురించి ప్రకటన పోస్ట్ చేయండి. చందమామ అభిమానులకు రచన ప్రత్యేక సంచిక విడుదల రోజును మళ్లీ గుర్తు చేయవలసిన అవసరం ఉంది. మీ పోస్ట్‌లో దాసరి గారి దారావాహికల కాలక్రమణికలో సంవత్సరాలు కాస్త పైకీ కిందికీగా పోస్ట్ అయ్యాయి చూడండి. సరిచేయగలరు.
    మరోసారి అబినందనలు...

    రాజు.
    చందమామ

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ !
    చాలా చాలా ఆనందం కలిగించారు. రచన శాయి గారికి, చందమామ రాజు గారికి, ముఖ్యంగా మంచి సమాచారమిచ్చిన మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.