6, ఏప్రిల్ 2010, మంగళవారం

బొమ్మే లేని కార్టూన్లు!!!


చాలా కాలంగా కార్టూన్లలో బొమ్మ ముఖ్యమా, వ్యాఖ్య ముఖ్యమా అన్న మీమాంస జరుగుతూ వచ్చింది., కొందరు బొమ్మంటే మరి కొందరు వ్యాఖ్య అంటారు. కాని, పాఠకుడికి రెండూ ముఖ్యమే. ప్రముఖ కార్టూనిస్టు అబూ అబ్రహం అన్నట్టుగా బొమ్మ బాగుండని కార్టూన్లో వ్యాఖ్య ఎంత బాగున్నా, పాఠకులు అస్సలు చూడకపోయే ప్రమాదమున్నది. చివరకు విజ్ఞులంతా వచ్చిన ఏకాభిప్రాయం ఏమంటే, కార్టూన్లలో, బొమ్మా, వ్యాఖ్యా రెండూ బాగుండాలని.

అప్పుడప్పుడు, కొన్ని నిశ్శబ్ద కార్టూన్లు వస్తూ ఉంటాయి. ఇలాంటివి వెయ్యటంలో జయదేవ్ గారు ఆయన సోదరుడు K చక్కటి ప్రావీణ్యం చూపించారు. జయదేవ్ గారు ఈ నిశ్శబ్ద కార్టూన్లను "ట్యూబ్లైటు" కార్టూన్లు అంటారు. ఈ నిశ్శబ్ద కార్టూన్లలో బొమ్మ ఎంత చక్కగా ఉంటుంది అంటే ఇక వ్యాఖ్య అవసరం ఉండదు.

వ్యాఖ్య లేని కార్టూన్లు చూశాం కాని, బొమ్మే లేని కార్టూన్లు ఎన్నడైనా చూశామా. నేనైతే చూడలేదు. ఈ రోజే ఇంటర్‌నెట్‌లో అలా వెతుకుతూ ఉంటే, ఒక చక్కటి వెబ్ సైటు కనపడింది. ఆ సైటునిండా అనేక తమాషాలు. ఆ తమాషాలలో ముఖమైనవి బొమ్మలు లేని కార్టూన్లు.

ఈ కార్టూన్లలో బొమ్మలే లేవు!!!. మరేమి ఉంటాయి? మూడు నల్లటి చతురాలు ఉంటాయి. అందులో ఇద్దరి సంభాషణలు ఉంటాయి. ఆ సంభాషణలు, కార్టూన్లలో వ్యాఖ్యలు వ్రాసినట్టుగానే, ఒక బెలూన్‌లో ఉంటాయి. సామాన్యంగా మొదట మాట్టాడిన వ్యక్తే చివరకూ మాట్టాడతాడు. మరి మూడేగా చతురాలు!!! ఒక్కోసారి, ఒక చతురంలో ఏమీ ఉండదు, అంటే మొదట మాట్టాడిన వ్యక్తికి రెండో వ్యక్తి సమాధానం ఇవ్వడు లేదా రెండో వ్యక్తి చెప్పిన సమాధానం ఎంత ఘాటుగా ఉంటుందంటే, మొదటి వ్యక్తి కిమ్మనకుండా ఉండిపోతాడు. ఏది ఏమైనా, ఈ కార్టూన్లు చూస్తుంటే, ఇద్దరు వ్యక్తులు చీకట్లో కూచుని మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. వాళ్ళ సంభాషణ మాత్రం, ఘాటుగా, హాస్య ప్రధానంగా జరుగుతూ ఉంటుంది.

ఇంత ఊరిస్తున్నారు, అసలు సరుకేది అంటున్నారా. చూడండి, మచ్చుకి ఒక మూడు బొమ్మలు లేని కార్టూన్లు.



ఇటువంటి బొమ్మలు లేని కార్టూన్ల సృష్టికర్త ఎవరు అని సహజంగానే ఆసక్తి కలుగుతుంది. కార్టూన్లు వేసినాయన పేరు డేవిడ్ గ్లెన్ రైన్హార్ట్ (David Glenn Rinehart). కాని వెబ్ సైటులో తన గురంచి తాను ఈయన చిత్రంగా వ్రాసుకున్నాడు, అతని చిన్నప్పటి ఫోటో కూడ ఉన్నది. తన గురంచి తాను వ్రాసుకున్నది కూడ అయన హాస్య ప్రజ్ఞకు తార్కాణమైన ఒక కథేమో అని నా అనుమానం. చక్కటి వెబ్ సైటు గురించి తెలుసుకోవాలంటే కింది లంకె నొక్కండి.

ఒక మంచి వెబ్ సైటు
మరిన్ని (కొన్ని వందలు ఉన్నాయి) బొమ్మలు లేని కార్టూన్లు చూడాలంటే కింది లంకె నొక్కండి.

బొమ్మలు లేని కార్టూన్లు

చూసి ఆనందించండి.













********************************************************


5 కామెంట్‌లు:

  1. should we call them cartoons??? they are just jokes, presented in a different format. can't call them cartoons.

    రిప్లయితొలగించండి
  2. వావ్!! బొమ్మల్లేని కార్టూన్లు చూసేసరికి నాకు కాప్షన్ రావటంలే..

    రిప్లయితొలగించండి
  3. వీటిని కార్టూన్లనడానికి మనసొప్పడంలేదు గానీ బాపు గారి చక్కటి కార్టూన్ ఒకటుంది బొమ్మల్లేకుండా -
    "ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశారు!"
    "మీరు మాత్రం?"

    రిప్లయితొలగించండి
  4. పేరూ ఊరూ లేకుండా ఎందుకు ఈ వ్యాఖ్యలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.