ముందుగా ఈ కింద ఇచ్చిన ప్లేయర్ నుంచి ఒక వాద్య సంగీతపు తునక వినండి
విన్నారా! మీకీపాటికి గుర్తుకు వచ్చే ఉండాలి ఈ అద్భుతమైన ట్యూన్లు ఎక్కడివో.
గుర్తుకు రాలేదా!!! ఐతే ఇక ముందుకు చదవటం అనవసరం మీకోసం కాదు ఈ వ్యాసం!
*
*
*
*****************************************
*గుర్తుకు రాలేదా!!! ఐతే ఇక ముందుకు చదవటం అనవసరం మీకోసం కాదు ఈ వ్యాసం!
*
*
*
*
*
*
*
*
*
* *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
* **
*
*
*
*
*
*
*****************************************
నేను ఈ మధ్య హైదరాబాదు వెళ్లినందున మూడు అద్భుతాలు జరిగినాయి. ఒకటి ఇంతకు ముందు టపాలో వివరించాను. రెండో అద్భుతం మాయా బజార్ రంగుల డి వి డి దొరకటం అనుకోకుండా జరిగింది.
ఆదివారం రవీద్ర భారతిలో జరిగిన కార్యక్రమం చూసుకుని వెనుతిరిగి వెళ్తుండగా మధ్యలో ఒక సి డి షాపు కనిపించి వెనువెంటనే నన్ను ఆకర్షించింది. వెళ్ళి చూద్దునుకదా మాయా బజార్ సినిమా డి వి డి గురించిన నిలువెత్తు పోస్టర్ దర్శనమిచ్చింది.
ఈ రంగుల డి వి డిని రకరకాలుగా అమ్ముతున్నారు. కాని నాకు నచ్చినది కలెక్టర్స్ ఎడిషన్. దీని ప్రత్యేకత ఏమంటే రంగుల డి వి డితో పాటుగా బ్లాక్ అండ్ వైట్ సినిమా డి వి డి కూడ ఇచ్చారు. రెండూకలిపిన ముచ్చటైన పాక్ ధర అతి స్వల్పం. హాయిగా కొనుక్కుని చూసెయ్యచ్చు.
ఈ డి వి డి లు చేసి అమ్మే వాళ్ళను చూస్తే నాకు ఎంత కోపమైనా ,(చండాలపు క్వాలిటీతో అమ్ముతారని) మాయాబజార్ రంగుల డి వి డి మటుకు పైరేటెడ్ కొనకూడదని ఒట్టేసుకున్నాను. ఎందుకంటే ఇటువంటి చక్కటి ప్రయత్నం చేసిన వాళ్ళను నిరుత్సాహపరచకూడదు కదా.
వాళ్ళూ నన్ను నిరుత్సాహ పరచలేదు, సినిమా మొత్తం చక్కటి క్వాలిటీతో ఎక్కడా గీతాలూ, ఉరుములు, మెరుపులు లేకుండా తయారు చేశారు. మాయా బజార్ సినిమా రంగుల్లో ఆద్యంతం అద్భుతంగా ఉన్నది. రంగులు అద్దటమే కాదు సంగీతాన్ని రీ మిక్సు చేసినట్టున్నారు, పాత పాటలే చక్కగా స్పుటంగా కొత్తగా వినిపుస్తున్నాయి. అక్కడక్కడా, అవసరమైన చోట్ల బాక్ గ్రౌండు శబ్దాలు, మనుషులు నడుస్తున్నప్పుడు బట్టల శబ్దం, రధాలు వెళ్తున్నప్పుడు, గుర్రాల సకిలింపు వగైరా కలిపి అంతకు ముందు లేని ఒక సంపూర్ణత్వాన్ని తెచ్చారు.
ఒక సీను నుండి మరొక సీనుకు మారటం కూడ చక్కగా ఉన్నది. ఒకటి రెండు పాటలు మటుకు లేవు. ఈ సినిమాని ఇప్పటికే ఒక వంద సార్లు చూసి ఔపోసన పట్టినవాళ్ళు తప్పిస్తే ఇతరులు కనిపెట్టలేని లోపాలు మాత్రమే ఉన్నాయి. అంటే కొన్ని సీన్లు లేకపోవటం వంటివి.
కొత్తగా ఎవరైనా ఈ డి వి డిలో సినిమా చూస్తే పూర్తిగా అర్ధమయ్యి హాయిగా ఆనందిస్తారు. ఈ కింద కొన్ని స్క్రీన్ షాట్సు ఇస్తున్నాను. మీరు అసలైన డి వి డి "కొని" చూశే వరకు ఈ బొమ్మలు చూసి ఆనందించండి.
పైన మూడు అద్భుతాలు అని ఒక్కటేమో అప్పుడే చెప్పేశాను అని అన్నారు, రెండోది మాయా బజారు డి వి డి అన్నారు, మరి మూడో అద్భుతం ఏమిటి అనుకుంటున్నారా? అనుకోండి ఆ అద్భుతం గురించి వెంటనే రేపో ఎల్లుండో మీకు తెలుస్తుంది
మీరు వినిపించిన బిట్ చాలా బాగుందండి! డౌన్లోడ్ లంకె ఉంటే ఇస్తారా?
రిప్లయితొలగించండిThank you J B gaaro. you can just click on the player and you shall be redirected to the downloading link. Or use the following link:
రిప్లయితొలగించండిhttp://www.divshare.com/download/11485579-e61
ఔరా! ఏమి నాణ్యత - చాలా బాగా రికార్డు చేసారు.కృతజ్ఞతలండి.
రిప్లయితొలగించండిచాలా చాలా బాగుంది మ్యూజిక్ బిట్టు, స్క్రీన్ షాట్స్ కూడా... మాకు సినిమా చూసే అదృష్టం ఇప్పుడిప్పుడే లేదండీ. ఆగస్టు నెల లోపల ఇండియా వచ్చే వీలు లేదు. కాబట్టి ఈ లోగా పాటలు, ట్రైలర్లు ఎక్కడైనా వెబ్ సైట్స్ లో దొరికితే చూసి సంతోషించడమే.
రిప్లయితొలగించండిజె బి గారూ. అడాసిటీ (Audacity) అని ఒక చక్కటి ఫ్రీ సాఫ్ట్వేర్ ఉన్నది. అది వాడి రికార్డు చేశాను. అదే సాఫ్ట్వేర్ వాడి నా దగ్గర ఉన్న ఎల్ పి రికార్డులు, కాసెట్లు ఎంపి-3 కింద మార్చే బృహత్కార్యక్రమం కొన్ని నెలలుగా ఏకధాటిగా సాగుతోంది.
రిప్లయితొలగించండి