ఈ మధ్యనే హైదరాబాదుకు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళటం జరిగింది. ఉన్నది గట్టిగా 48 గంటలు. ఆకొద్దికాలంలో నాకు అత్యంత ఆనందకరమైన సంఘటనలు మూడు జరిగినాయి. మూడూ అద్భుతాలే.
ఒకటి రేడియో కళాకారుల సన్మాన సంరంభం చూడగలగటం (వినబడే గొంతులు కనబడిన వేళ)
రెండు మాయా బజారు రంగుల డి వి డి దొరకటం (వచ్చేసింది)
మూడు
అంతవరకూ ముఖపరిచయం కూడ లేదు బ్లాగు పరిచయమే! ముగ్గురిని కలసుకుని హాయిగా కొన్ని గంటలు ఇష్టా గోష్టిగా మాట్లాడుకునే ఆవకాశం కలిగింది. ఆ ముగ్గురిలో ఒక్కరితోనే నేను ఫోనులో అయినా మాట్లాడాను. మిగిలిన ఇద్దరూ నాకు వారి వారి బ్లాగుల పరంగానే తెలుసు.
సీనియర్లతో మొదలు పెడితే, "రచన" శాయి గారు. అద్భుతమైన వ్యక్తి. ఒంటి చేత్తో ఒక సాహిత్య పత్రికనునడుపుతున్న ధీరుడు. ఏమాత్రం లాభాపేక్ష లేదు. తనకున్న సాహిత్య అభిరుచి, చక్కటి కథలను, శీర్షికలను పాఠకులకు అందించాలన్న తపన. ఈ మధ్యనే చందమామ జానపద కథా బ్రహ్మ దాసరి సుభ్రహ్మణ్యం గారి గురించి ప్రత్యెక సంచిక వేస్తున్న సందర్భంగా ఆయనతో ఆనందకరమైన పరిచయం. ఆయన ప్రోత్సాహమే, నా చేత రెండు మూడు వ్యాసాలు ఆ ప్రత్యెక సంచికలో వ్రాయటానికి పురికొల్పాయి. నా పేరు నేను మొట్టమొదటిసారి తెలుగులో అచ్చులో చూసుకోవటం జరిగింది రచన పత్రికలోనే అని గర్వంగా చెప్పుకోగలను అంటే "రచన" శాయిగారి ప్రోత్సాహమే. ఆయన్ని కలసి మాట్లాడటం ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నాళ్ళబట్టో పరిచయం ఉన్నట్టుగా, కలసిన మొదలు విడిపోయేవరకు ఎన్నో తెలియని విషయాలు చెప్పి ఆనందింపచేసారు. అన్నట్టు, మొట్టమొదటి అద్భుతం రేడియో కళాకారుల సన్మాన సభగురించి నాకు చెప్పినది రచన శాయిగారే. వారు చెప్పకపోతే, ఒక అద్భుత కార్యక్రమాన్ని చూడలేనందుకు, జీవిత కాలం బాధపడే వాణ్ని
మేము కలసి మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఫోటోలు కొన్ని ఈ కింద ఇస్తున్నాను. అందులో శాయిగారిని గుర్తు పట్టటానికి ప్రయత్నించండి.
ఆతరువాత, నేను బ్లాగు లోకంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతోంది. ఈ చిత్ర విచిత్ర బ్లాగులోకంలో నాకు తారసపడిన మొట్టమొదటి స్నేహితుడు "వేణువు" వేణుగారు. ఫణి కుమార్ గారి "బ్లాగాగ్ని" బ్లాగులో పరిచయం అయ్యి, నేను బ్లాగు మొదలు పెట్టగానే ఎంతగానో ప్రోత్సహించి, నాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచెప్పి, కూడలికి నా బ్లాగును అనుసంధానం చేసేవరకు పోరి, నా బ్లాగుకు గుర్తింపు తీసుకు రావటంలో ఎంతగానో సహకారం అందించారు. నేనెప్పుడు చందమామ గురించి వ్యాసం వ్రాసినా తప్పకుండా వచ్చి అభినందించి ప్రోత్సహిస్తున్నారు. నేను ఆయన "మన తెలుగు చందమామ" బ్లాగులో సహ రచయితలం. అనుకున్న సమయానికి రాలేనని చెప్పినా, పట్టుదలగా మనం కలుసుకోవాలి అని తన ఆఫీసు పని తొందరగా ముగించుకుని వచ్చి మాతో చేరారు.
ఆపైన కలుసుకున్న వ్యక్తి రామూ గారు. ఆంధ్ర ప్రదేశ్ మీడియా కబుర్లు అన్న బ్లాగుతో బ్లాగులోకంలోనే కాదు పూర్తి తెలుగు జర్నలిస్టు లోకానికే సుపరిచితులు. ఈయన బ్లాగులో వ్రాసినాన్ని వ్యాఖ్యలు, అభిప్రాయాలు, నేను మరిక్కడా వ్రాయలేదు. దాదాపు ప్రతిరోజూ చూసే బ్లాగు ఈయనది. సునిశితమైన భాషతో, మంచి విమర్శనాత్మకంగా వ్రాస్తూ ఆకట్టుకుంటున్నారు. నేను వ్రాసిన వ్యాఖ్యలనే తన బ్లాగులో వ్యాసాలుగా ప్రచురించి ప్రోత్సహించారు. మరొకసారి నేను చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ జర్నలిస్టులలో కోపాన్ని ప్రజ్వలింప చేసినప్పుడుకూడ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిస్పక్షపాతంగా వారి వైఖరిని, నా అభిప్రాయాలను ప్రచురించి ఒక మంచి చర్చకు దారి తీశారు. రచన శాయిగారికి వీరికి పరిచయం చేసేభాగ్యం నాకు కలిగింది. వయస్సులో నాకంటే ఒక దశాబ్దంన్నర చిన్న అయినా ముచ్చటగా మాట్లాడుతూ ఎంతో స్నేహానందాన్ని పంచి ఇచ్చారు. వారి ఫోటో బ్లాగులోనే ఉన్నది.
ముగ్గురు మిత్రుల గురించీ వ్రాశాను. నా ఫోటో ఎలాగో నా బ్లాగులో ఉన్నది. గుర్తుపట్టేస్తారు. రామూ గారి ఫోటో కూడ ఆయన బ్లాగులో ఉన్నది కాని. ఈ ఫోటోలో గుర్తు పట్టటం కష్టమే. ఇక వేణూ గారు, రచన శాయిగారి ఫోటోలు బ్లాగుల్లో ఎక్కడా లేవు. అయినా సరే పైన ఉన్న కొన్ని ఆధారాలతో(Theory of Deuction తో) అందరినీ గుర్తు పట్టిన వారికి ఒక మంచి బహుమతి మెయిల్లో పంపబడుతుంది.
మిత్రులతో కలయిక, మాటా మంచి హైదరాబాదులో ఉన్న మా బాంకు గెస్టుహౌసులో జరిగింది. పోయిన శనివారం అంటే May 22, 2010 నాడు. ఇక ఫోటోలు తీసి పెట్టినది గెస్టుహౌసు కేర్‌టేకర్ శ్రీ సుధాకర్ నాయక్. ఇక ఫోటోలను చూడండి.

this is regarding the last photo:
రిప్లయితొలగించండిfrom the left: Ramu garu,Venu garu,meeru,sayi garu..
రచన శాయి గారిని నేను ఈజీగా గుర్తు పట్టేశానండోయ్... ఎలాగంటారా? మీ ఫోటో మీ బ్లాగులో ఉంది. వేణు గారిని, రాము గారిని ఇదివరకే వ్యక్తిగతంగా కలిశాను. ఇక మిగిలింది రచన శాయి గారే కదా... మీరు హైదరాబాద్ వస్తున్నారని తెలిస్తే నేను కూడా కలవడానికి వచ్చేవాణ్ణి. :-)
రిప్లయితొలగించండిఅయితే బహుమతి నాకే! మధ్యలో ఉన్నది మీరు, మీకు ఎడమవైపు కూచున్నది శ్రీ శాయి గారు,కుడివైపున కూచున్నది వేణు గారు, ఆయన పక్కన ఉన్నది రాము గారు!
రిప్లయితొలగించండిఅయినా మీరు క్లూలు కూడా ఇచ్చేశారండీ!
ఆఖరు ఫోటోలో చూసి గాల్లో రాయేస్తున్నాను.
రిప్లయితొలగించండిఎడమనుండి.. రాముగారు, వేణుగారు, మీరు, శాయిగారు..
రైటేనా??
ఈ ఛాయాచిత్రంలో ఎడమ నుండి కుడి వైపుకు: శ్రీయుతులు రాము, వేణు, శివరామ ప్రసాద్ మరియు శాయి. వీరిలో కొందరిని ఎరుగను. వారి ఛాయాచిత్రం కూడా చూసి ఉండలేదు.
రిప్లయితొలగించండిcbrao
Mountain View, CA.
Siva gaaroo,
రిప్లయితొలగించండిThanks for your kind words. its a memorable meeting. Shortly I'll meet you in Bangalore.
Ramu
apmediakaburlu.blogspot.com
చాలా సంతోషంగా ఉండండి. అక్కడ ఉన్నది రెండు రోజులే అయినా జీవితాంతం గుర్తు ఉంచుకునే సంఘటనలు జరిగాయన్నమాట.
రిప్లయితొలగించండిశివ గారూ !
రిప్లయితొలగించండిమీరు ఎక్కడికి వెళ్ళినా మిత్రుల్ని కలవడం, కలపడం చాలా బావుంది. అందరూ ఇది పాటిస్తే బాగుంటుంది.
బాగుంది. మిత్రసందర్శనం, అదీ అనుకోకుండ జరిగితే చాలా ఆనందం కలిగిస్తుంది.
రిప్లయితొలగించండిరాముగారికి మేకగడ్డం ఉన్నదనుకున్నానే! :)
yahooo... i'm the gift winner ;) ;) :)
రిప్లయితొలగించండిKarthik. What is your E mail. Please let me know to my mail so that I can send the soft gift. Likewise Shri Ravichandra also may inform his E mail enabling me to send his gift (of course soft gift).
రిప్లయితొలగించండిSir,
రిప్లయితొలగించండిIts unfair. You are giving gifts, soft or hard, only to the winners of the photo context. What about those who really took pains to meet you under the scorching sun?
We agree that you have given us memorable gifts by mentioning about us in the posts, but we too deserve soft/hard gifts. Sujaatha gaaroo and others meeremantaaru?
Please convey our wishes to Mr.Sudhkar, who offered us teas and biscuits two times on that day.
Ramu
apmediakaburlu.blogspot.com
sir,
రిప్లయితొలగించండిactually i mailed you earlier regd an article i want to write somehow didnt get a reply.. anyways my mail:karthikeya.iitk@gmail.com
-Karthik