6, జూన్ 2010, ఆదివారం

ఒక చక్కటి శీర్షిక

చందమామలో మొట్టమొదటి సారి ఫోటో వ్యాఖ్య కు పాఠకుల నుండి వ్యాఖ్యలు కోరుతూ ఆగష్టు 1952 లో వేయబడిన ప్రకటన
తెలుగు చందమామ మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా స్థాన చలనం తప్ప మరే విధమైన మార్పులు జరగని శీర్షిక "ఫోటో వ్యాఖ్య" . అప్పట్లో వచ్చిన పత్రికలలో ఫోటో వ్యాఖ్య అని మొదలు పెట్టినది చందమామలోనే, మరే పత్రికా ఇలాంటి విన్నూత్న ప్రయోగం చెయ్యలేదు.

చందమామలో వచ్చిన ఫోటో వ్యాఖ్య శీర్షిక ప్రత్యేకత ఏమంటే, చక్కటి ఫోటోగ్రఫీ ప్రావీణ్యం చూపిస్తూ తీసిన రెండుఫోటోలు ప్రచురించేవారు. రెండు ఫోటోలూ కూడ వేరు వేరు ఫోటో గ్రాఫర్లు తీసినవి అయ్యి ఉండేవి. అయినప్పటికీ, ఫోటోల మధ్య కొంతలో కొంత సామ్యం ఉన్న ఫోటోలనే ఎన్నుకుని, ఫోటోలకు చక్కగా అంత్య ప్రాస కుదరటమే కాక, ఒక చక్కటి అర్ధం వచ్చెట్టుగా వ్యాఖ్యలు పంపమని పాఠకులకు కోరేవారు. వచ్చిన వ్యాఖ్యలలో అన్నిటికన్నా బాగున్నవ్యాఖ్యలకు పారితోషికం ఇచ్చి పంపిన వారి పేరు వేసేవారు.

మరొక చమక్కు ఏమంటే, నెల వ్యాఖ్యలు వేయమని కోరుతూ ఉన్న ఫోటోలు చాలా చిన్నవిగా ప్రచురించేవారు. కాని అవే ఫోటోలను వ్యాఖ్యలతో , తరువాతి నెల పెద్దవిగా ప్రచురించి, చక్కగా నప్పే వ్యాఖ్యలు పంపినవారి పేరుతొ పాటుగా ప్రచురించేవారు.

శీర్షిక మొదలు పెట్టిన రోజులలో ఫొటోకు ఫొటోకు పెద్దగా పొంతన ఉన్నట్టుగా కనపడదు. మొట్టమొదటి చందమామ, జులై 1947 సంచికలో వేసిన ఫోటో వ్యాఖ్యకు సంబంధించిన కింద ఇవ్వబడినది.

ఇష్టమైన బరువు ఎంత మోసినా కష్టమనిపించదు కొంచెం ఆగండి మీకు జవాబు చెబుతాను

మొట్టమొదటి ఫోటో వ్యాఖ్యల శీర్షికకు ప్రచురించబడ్డ, ఫోటోల మధ్య కాని, వ్యాఖ్యల మధ్యకాని ఏమాత్రం పొంతనలేదు. కాని ఫోటోలు మాత్రం చక్కగా తీయబడినాయి. రెండు ఫోటోలు కూడ ఎన్ రామకృష్ణ గారు తీసినవి.

అదే సంవత్సరం అంటే 1947 డిసెంబరు సంచికలో మార్కస్ బార్ట్లే తీసిన కింది ప్రచురించబడింది.

ఫోటో తీసిన మార్కస్ బార్ట్లే మరియు ప్రముఖ సినీ ఛాయాగ్రాహకులు బార్ట్లే ఒకరేనా? తెలియదు. ఒక్కరే అయిఉండవచ్చు. ఎందుకు అంటే, చక్రపాణిగారికి సినిమాలలో కూడ ప్రవేశం ఉన్నది కాబట్టి బార్ట్లే కూడ కెమెరామాన్అందుకని పరిచయం దృష్ట్యా ఆయన తీసిన ఫోటో వేసి ఉండవచ్చు.

మొదట్లో శీర్షికకు తగిన వ్యాఖ్యలను చందమామ వారే పెట్టేవారు. 1950 లు వచ్చేప్పటికి ఫోటోల మధ్య కొంతపోలిక, వ్యాఖ్యలకు పొంతన వచ్చింది. మచ్చుకి 1952 లో జనవరిలో వేయబడ్డ ఫోటో వ్యాఖ్య శీర్షిక కింద చూడండి.

పాపలు పాపాయిలు

కొంతకాలానికి, బహుశా కొడవటిగంటి కుటుంబరావుగారు సంపాదక బాధ్యతలు చేబట్టిన తరువాత అయి ఉండవచ్చు, ఫోటో వ్యాఖ్యలు చందమామ వారు పెట్టటం మాని, అదొక పోటీ కింద పాఠకులకు వదిలిపెట్టి మంచి వ్యాఖ్యలకు బహుమతి ఇచ్చేవారు. ఫోటో వ్యాఖ్యల పోటీ 1952 జులై నెల నుండి మొదలయ్యింది. శీర్షికను మొదలు పెడుతున్నట్టుగా ప్రకటిస్తూ చందమామ సంపాదకీయంలో ఈకింది విధంగా వ్రాసారు.


పత్రికా ప్రపంచంలో అతి ఎక్కువ సంవత్సరాలనుండి (1947 నుండి పోటీ కాకుండాను, 1952 పోటీగానూ) నడుస్తున్నఒక అరుదైన శీర్షిక మన తెలుగు చందమామలో ఉండటం ఎంతైనా ఆనందించతగ్గ విషయం.

చందమామ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండి, పిల్లలకు, పిల్లలాంటి పెద్దలకు చక్కటి వినోదాన్ని విజ్ఞాన్నిఅందించటమే ధ్యేయంగా ఉండేది. అటువంటి చందమామ కూడ ఫోటో శీర్షిక బహుమతుల విషయంలో 1963 సంవత్సరంలో వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫోటో వ్యాఖ్యలకు బహుమతి నిర్ణయించే విషయంలో ప్రాంతీయ అభిమానాన్నిచూపిస్తూ, తెలంగాణా వారికి బహుమతి ఇవ్వటంలేదని "బహుమతికి నోచుకోని ఒక పాఠకుడు" అన్న పేరుతొ చేయబడిన ఆరోపణకు వివరణను, చందమామ తన డిసెంబరు నెల, 1963 సంపాదకీయంలో ప్రచురించాల్సి వచ్చింది. చందమామ సంపాదక వర్గం ఘాటుగానే స్పందించింది. స్పందన కింద చూడవచ్చు.
ఇటువంటి వివాదం, తాము వివక్షకు లోనవుతున్నామన్న భావన, 1963 లోనే బాలల పత్రికలో జరిగే ఒక చిన్న పోటీవిషయంలో కూడా, ప్రతిఫలించింది అంటే నాటి ఉద్యమానికి నాంది, వేళ్ళు ఏనాడో పడినాయి అనిపిస్తున్నది.

ఫోటో శీర్షికలో వచ్చిన కొన్నిఫొటోలతో కూడిన ఒక స్లైడ్ షో చూడండిఫోటో శీర్షిక చందమామ పత్రికలో ఇంకా కొనసాగుతూ ఉండటం ఒక రికార్డు. శీర్షిక ఇలాగే కొనసాగాలని నాఆకాంక్షే కాదు, చందమామ అభిమానులందరి కోరిక కూడా.

***

6 వ్యాఖ్యలు:

 1. వ్యాసం ఆసక్తి కరంగా ఉంది. తెలంగాణా అసంతృప్తి కొత్తగా పుట్టుకొచ్చింది కాదని బాగా చెప్పారు. అభినందనలు.


  శ్రీనివాస్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చందమామలో చక్కటి శీర్షిక గురించి ఎంతో చక్కగా రాశారు! అభినందనలు. ఈ శీర్షికకు వచ్చిన వ్యాఖ్యల్లో ఎప్పటికీ గుర్తుండేవి చాలా ఉన్నాయి. ‘సరిగమ పదని- సరిగ పదమని’ ఇలాంటిదే!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. తెలంగాణా అసంతృప్తికి చందమామకు పొంతన లేదని గమనించ ప్రార్థన. 1963 నాటి చందమామ సంపాదకీయం చెప్పిన పరిస్థితులు ప్రాంతీయ వివక్షకు అతీతమైన కారణాలనే చూపాయి. అవి ఈనాటికీ వర్తిస్తున్నాయి. సకాలంలో చందమామకు ఫోటో వ్యాఖ్యలు పంపలేకపోయినప్పుడు, అనివార్య కారణాల వల్ల పోస్టులో అందనప్పడు, మరే ఇతర కారణాల వల్లో రచనలు, వ్యాఖ్యలు ఎడిటింగ్ బల్లవద్దకు చేరకపోయినప్పుడు మంచి కథలు, రచనలు, వ్యాఖ్యలు కూడా సంబంధిత నెలలో ప్రచురణ కాకపోయే ప్రమాదం అప్పుడూ, ఇప్పుడూ కూడా ఉంది. దీంట్లో ప్రాంతీయ వివక్షత లేదు. ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో ఒక స్కూలు నుంచి దాదాపు పది మంది పిల్లలు ఫోటో వ్యాఖ్యలు పంపారు. వాళ్లను ప్రోత్సహించడానికయినా ఏదో ఒకటి ఎంచుకుని ఉండవచ్చు. కానీ చివరి క్షణంలో వచ్చిన మరో మంచి వ్యాఖ్యను చూశాక తొలి ఆలోచన పక్కకు పోయి వ్యాఖ్య పరిణితి ముందుపీఠిలోకి వచ్చి దాన్నే ఎంచుకోవలసి వచ్చింది. ఎంచుకున్న వ్యాఖ్య మరో ప్రాంతానికే చెంది ఉండవచ్చు కాని దీంట్లో ప్రాంతీయ వివక్ష లేదనే మేము బలంగా నమ్ముతున్నాము. పిల్లలు, పెద్దలు, రచయితలు, రిటైరయిన వారు కూడా పోటీ పడుతున్న ఫోటో వ్యాఖ్యల పోటీకి పిల్లల వ్యాఖ్యలనే ప్రధానంగా తీసుకొంటున్నప్పటికీ ఇంతవరకూ ప్రాంతీయ వివక్ష కోణం చందమామకు ఎదురు కాలేదనే అనుకుంటున్నాము. పది వ్యాఖ్యలు మంచిగా ఉన్నప్పుడు వాటిలోంచి ఒకటి ఎంచుకునేటప్పుడు తీవ్రంగా గుంజాటన పడడం జరుగుతోంది తప్ప అవి ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి చెందినవి అనే శల్యపరీక్ష ఇంతవరకూ చందమామకు ఎదురుకాలేదు.
  చివరకు ఇప్పుడు ఈ జూన్ నెల నుంచి ఫోటో వ్యాఖ్యలు చందమామలో నిలిచిపోయాయి. ఇదే బాధాకరమైన విషయం... శ్రీనివాస్ గారూ చందమామకు ప్రాంతీయ వివక్షత లేదండీ.. పలు చారిత్రక కారణాల వల్ల చందమామకు ఇప్పటికీ కోస్తా ప్రాంతంనుంచే కథలు ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణా, రాయలసీమ ప్రాంతం నుండి వస్తున్న కథలు తక్కువ. దీనికి కారణాలు ప్రాంతీయత కాకపోవచ్చు..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Rajugaaroo. Thank you very much for your comment. In my article at no place I even hinted in the remotest way that Chandamama had a connection with the Telengana issue.

  While writing about a feature, its necessary that any controversy it had created. While browsing through old issues of Chandamama, I came across the comment which was published in the Chandamaama Editorial itself.

  My comment was the dissatisfaction in the people of Telangana is quite deep rooted whereby even in Children's magazine regarding a small contest, they were feeling that they were disregarded.

  Chandamama in 1963 itself made it very clear that the contest was conducted in a dispassionate and impartial manner.

  However, thank you for your clarification as of now.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శివగారూ, కృతజ్ఞతలు
  ప్రస్తుతం ఉన్న రాజకీయ ఉద్రిక్తతా వాతావరణంలో ఒక పాఠకుడు ఆలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా, అది చందమామపై బలమైన ముద్ర వేసే అవకాశముంది కనుకే 1963 చందమామ సంపాదకీయ పాఠానికి పొడిగింపుగా మరికొంచెం వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది తప్ప మరో ఉద్దేశం లేదు. బాలసాహిత్యం, కథా సాహిత్య కోణంలో చందమామకు చాలా పరిమితులు ఉన్నాయనే మాట అప్పుడూ,ఇప్పుడూ కూడా వాస్తవమే.కానీ పత్రికకు ప్రాంతీయతా పరిమితులు లేవనే మనందరి నమ్మిక.
  చందమామ కథలు ప్రధానంగా మధ్యయుగాల కథలు కాబట్టి వాటికి ప్రాంతీయాతీతమైన సార్వజనీనతే ఉంటుంది. కాకతి రుద్రమదేవి గురించి త్వరలో చందమామలో చిన్ని సీరియల్ వేయాలని ప్లాన్ జరుగుతోంది. రాయగల రచయిత దొరికితే త్వరలో ఈ పని మొదలవుతుంది. అయితే రుద్రమదేవి తెలంగాణా ప్రాంతీయత పరిధిలోకి రాదు కదా. తెలుగు చరిత్రలో మధ్యయుగాల్లో తొలి తెలుగు సామ్రాజ్యానికి చక్రవర్తిని ఆమె. గణపతి దేవుని వారసురాలు. తెలుగు వైభవానికి ప్రతినిధిగానే ఆమెను చూస్తున్నాము కదా..దీన్ని కూడా పాఠకులు ప్రాంతీయ కోణంలోంచి చూడరు గదా..
  మీరు మీ రచనలో చందమామపై వచ్చిన ప్రాంతీయతా అపవాదు గురించి చక్కగానే పొందుపర్చారు. మరోసారి వివరణ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడింది. అందుకు మీకు కృతజ్ఞతలు. మీ వ్యాసంలోని కొన్ని భాగాలను మరొకందుకు నేను చందమామ బ్లాగులో ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. అభ్యంతరం లేదు కదా..
  గత 50 ఏళ్లకు పైగా చందమామకు ఫోటో వ్యాఖ్యలకోసం ఫోటోలు పంపిన శ్రీ కళానికేతన్ బాలు గారు ఇప్పుడే తన ఫోటో పంపించారు. ఈయన చక్రపాణి గారి సమకాలికులు. ఇద్దరికీ భుజంమీద చేయివేసుకుని తిరిగేటంత సాన్నిహిత్యం ఉండేదట. నా బ్లాగులో గతంలోనే "చక్రపాణి ప్రేరణతో రచయితనయ్యా..." పేరిట ఈయనను పరిచయం చేశాను.
  అప్పుడు ఫోటో పంపలేదు. ఇప్పుడు పోటో పంపారు కాబట్టి ఆ పోస్టుకు ఫోటో జతచేయాలని లేదా మళ్లీ కాస్త పరిచయం చేసి కొత్తగా వేయాలని అనుకుంటున్నాను. ఆయన గురించి చెప్పేటప్పడు చందమామ ఫోటో వ్యాఖ్యల గురించి కూడా రాస్తే బాగుటుంది కదా. అందుకే మీ వ్యాసంలోంచి కొన్ని వాక్యాలు తీసి ఉపయోగించుకోవాలని ఉంది. కాదనరు కదా..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Rajugaroo. You are free to use any part of the article in my Blog. I shall be very happy if it is of use to you in the Chandamama magazine.

  Ultimately, I hope and wish that the Photo feature shall not disappear atleast from Telugu Chandamama.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.