6, జూన్ 2010, ఆదివారం

చందమామ శీర్షిక-ఫోటో వ్యాఖ్య

చందమామలో మొట్టమొదటి సారి ఫోటో వ్యాఖ్య కు పాఠకుల నుండి వ్యాఖ్యలు కోరుతూ ఆగష్టు 1952 లో వేయబడిన ప్రకటన
తెలుగు చందమామ మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా స్థాన చలనం తప్ప మరే విధమైన మార్పులు జరగని శీర్షిక "ఫోటో వ్యాఖ్య" . అప్పట్లో వచ్చిన పత్రికలలో ఫోటో వ్యాఖ్య అని మొదలు పెట్టినది చందమామలోనే, మరే పత్రికా ఇలాంటి విన్నూత్న ప్రయోగం చెయ్యలేదు.

చందమామలో వచ్చిన ఫోటో వ్యాఖ్య శీర్షిక ప్రత్యేకత ఏమంటే, చక్కటి ఫోటోగ్రఫీ ప్రావీణ్యం చూపిస్తూ తీసిన రెండుఫోటోలు ప్రచురించేవారు. రెండు ఫోటోలూ కూడ వేరు వేరు ఫోటో గ్రాఫర్లు తీసినవి అయ్యి ఉండేవి. అయినప్పటికీ, ఫోటోల మధ్య కొంతలో కొంత సామ్యం ఉన్న ఫోటోలనే ఎన్నుకుని, ఫోటోలకు చక్కగా అంత్య ప్రాస కుదరటమే కాక, ఒక చక్కటి అర్ధం వచ్చెట్టుగా వ్యాఖ్యలు పంపమని పాఠకులకు కోరేవారు. వచ్చిన వ్యాఖ్యలలో అన్నిటికన్నా బాగున్నవ్యాఖ్యలకు పారితోషికం ఇచ్చి పంపిన వారి పేరు వేసేవారు.

మరొక చమక్కు ఏమంటే, నెల వ్యాఖ్యలు వేయమని కోరుతూ ఉన్న ఫోటోలు చాలా చిన్నవిగా ప్రచురించేవారు. కాని అవే ఫోటోలను వ్యాఖ్యలతో , తరువాతి నెల పెద్దవిగా ప్రచురించి, చక్కగా నప్పే వ్యాఖ్యలు పంపినవారి పేరుతొ పాటుగా ప్రచురించేవారు.

శీర్షిక మొదలు పెట్టిన రోజులలో ఫొటోకు ఫొటోకు పెద్దగా పొంతన ఉన్నట్టుగా కనపడదు. మొట్టమొదటి చందమామ, జులై 1947 సంచికలో వేసిన ఫోటో వ్యాఖ్యకు సంబంధించిన కింద ఇవ్వబడినది.

ఇష్టమైన బరువు ఎంత మోసినా కష్టమనిపించదు కొంచెం ఆగండి మీకు జవాబు చెబుతాను

మొట్టమొదటి ఫోటో వ్యాఖ్యల శీర్షికకు ప్రచురించబడ్డ, ఫోటోల మధ్య కాని, వ్యాఖ్యల మధ్యకాని ఏమాత్రం పొంతనలేదు. కాని ఫోటోలు మాత్రం చక్కగా తీయబడినాయి. రెండు ఫోటోలు కూడ ఎన్ రామకృష్ణ గారు తీసినవి.

అదే సంవత్సరం అంటే 1947 డిసెంబరు సంచికలో మార్కస్ బార్ట్లే తీసిన కింది ప్రచురించబడింది.

ఫోటో తీసిన మార్కస్ బార్ట్లే మరియు ప్రముఖ సినీ ఛాయాగ్రాహకులు బార్ట్లే ఒకరేనా? తెలియదు. ఒక్కరే అయిఉండవచ్చు. ఎందుకు అంటే, చక్రపాణిగారికి సినిమాలలో కూడ ప్రవేశం ఉన్నది కాబట్టి బార్ట్లే కూడ కెమెరామాన్అందుకని పరిచయం దృష్ట్యా ఆయన తీసిన ఫోటో వేసి ఉండవచ్చు.

మొదట్లో శీర్షికకు తగిన వ్యాఖ్యలను చందమామ వారే పెట్టేవారు. 1950 లు వచ్చేప్పటికి ఫోటోల మధ్య కొంతపోలిక, వ్యాఖ్యలకు పొంతన వచ్చింది. మచ్చుకి 1952 లో జనవరిలో వేయబడ్డ ఫోటో వ్యాఖ్య శీర్షిక కింద చూడండి.

పాపలు పాపాయిలు

కొంతకాలానికి, బహుశా కొడవటిగంటి కుటుంబరావుగారు సంపాదక బాధ్యతలు చేబట్టిన తరువాత అయి ఉండవచ్చు, ఫోటో వ్యాఖ్యలు చందమామ వారు పెట్టటం మాని, అదొక పోటీ కింద పాఠకులకు వదిలిపెట్టి మంచి వ్యాఖ్యలకు బహుమతి ఇచ్చేవారు. ఫోటో వ్యాఖ్యల పోటీ 1952 జులై నెల నుండి మొదలయ్యింది. శీర్షికను మొదలు పెడుతున్నట్టుగా ప్రకటిస్తూ చందమామ సంపాదకీయంలో ఈకింది విధంగా వ్రాసారు.


పత్రికా ప్రపంచంలో అతి ఎక్కువ సంవత్సరాలనుండి (1947 నుండి పోటీ కాకుండాను, 1952 పోటీగానూ) నడుస్తున్నఒక అరుదైన శీర్షిక మన తెలుగు చందమామలో ఉండటం ఎంతైనా ఆనందించతగ్గ విషయం.

చందమామ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండి, పిల్లలకు, పిల్లలాంటి పెద్దలకు చక్కటి వినోదాన్ని విజ్ఞాన్నిఅందించటమే ధ్యేయంగా ఉండేది. అటువంటి చందమామ కూడ ఫోటో శీర్షిక బహుమతుల విషయంలో 1963 సంవత్సరంలో వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫోటో వ్యాఖ్యలకు బహుమతి నిర్ణయించే విషయంలో ప్రాంతీయ అభిమానాన్నిచూపిస్తూ, తెలంగాణా వారికి బహుమతి ఇవ్వటంలేదని "బహుమతికి నోచుకోని ఒక పాఠకుడు" అన్న పేరుతొ చేయబడిన ఆరోపణకు వివరణను, చందమామ తన డిసెంబరు నెల, 1963 సంపాదకీయంలో ప్రచురించాల్సి వచ్చింది. చందమామ సంపాదక వర్గం ఘాటుగానే స్పందించింది. స్పందన కింద చూడవచ్చు.
ఇటువంటి వివాదం, తాము వివక్షకు లోనవుతున్నామన్న భావన, 1963 లోనే బాలల పత్రికలో జరిగే ఒక చిన్న పోటీవిషయంలో కూడా, ప్రతిఫలించింది అంటే నాటి ఉద్యమానికి నాంది, వేళ్ళు ఏనాడో పడినాయి అనిపిస్తున్నది.

ఫోటో శీర్షికలో వచ్చిన కొన్నిఫొటోలతో కూడిన ఒక స్లైడ్ షో చూడండిఫోటో శీర్షిక చందమామ పత్రికలో ఇంకా కొనసాగుతూ ఉండటం ఒక రికార్డు. శీర్షిక ఇలాగే కొనసాగాలని నాఆకాంక్షే కాదు, చందమామ అభిమానులందరి కోరిక కూడా.

***

5 వ్యాఖ్యలు:

 1. మన చందమామ ఫొటొ వాఖ్యల గురించి జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు.
  ఓ నెల ఫొటొలలో రెండు కాళ్ళ మీద నిలబడి చెట్టు ఆకును అందుకుంటున్న
  మేక ఫొటో రెండో ఫొటోలో ఓ అబ్బాయి మోకాళ్ళపై వంగితే పై నుండి దూకు
  తున్న మరో అబ్బాయి బొమ్మ వేశారు. డానికి ఓ పాఠకుడు పంపిన వాఖ్య
  ఇలా ఉంటుంది.

  మొదటి ఫొటో : అందీ అందని ఆకు

  రెండో ఫొటో : అంటీ అంటని దూకు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Thank you Appaaraavu gaaroo for your comment. Recently I came to know that Chandamama is thinking of removing this good feature. Thats why I wrote this post today.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చందమామ పోటో వ్యాఖ్యలపై ఇంతకంటే సమగ్రమైన వివరణ సాధ్యం కాదేమో. కాని మీరూ, మేమూ ఎంతగా ఆరాటపడినా చందమామ ఫోటో వ్యాఖ్యల ప్రచురణ ఆపివేయడం జరిగిపోయింది. ఇతర భాషల వారినుంచి సకాలంలో పోటో వ్యాఖ్యలను తీసుకోవడంలో వైఫల్యం కారణంగా, చందమామ చిరునామా ముంబైకి మారినందువల్ల ఉత్తర ప్రత్యుత్తరాలు, పాఠకుల స్పందనలు సకాలంలో అందడం సాధ్యం కాని కారణంగా దాదాపు 60 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఫోటో వ్యాఖ్యలు ఈ జూన్ సంచిక నుంచి రావటం నిలిచిపోయింది. ఎవరు ఎంతగా అరచి గీపెట్టుకున్నా ఈ పరిణామం జరిగిపోయింది. చందమామ సుదీర్ఘ సంప్రదాయాల్లో ఒకటి మన ఇష్టాయిష్టాలతో పనిలేకుండా నిలిచిపోయింది. పాఠకులనుంచి తీవ్రమైన స్పందన వస్తే తప్ప ఫోటో వ్యాఖ్యలను పునరుద్ధరించడం ప్రస్తుతానికి సాధ్యం కాని పనే.
  శివరాం గారూ, మీరు మంచి వ్యాసం పొందుపర్చారు. మీకు చెడువార్తను చెబుతున్నాను. అందుకు బాధగా ఉంది. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పేరిట చందమామలో జురుగుతున్న విపరిణామాల్లో ఇదీ ఒకటి. మనసు ఉంటే ఏదయినా చేయవచ్చు. అదే లేదిప్పుడు. ఏది ఉంచాలో, ఏది ఉంచకూడదో తెలియని తనం, సమస్యను తప్పించుకుని పని సులభం చేసుకునే స్థితి.. కారణాలేవయినా కావచ్చు. ఫోటో వ్యాఖ్యలు ఆగిపోయాయి. మీరు తెలుగులో ఎంత చక్కటి వ్యాసాలు ప్రచురించినా, అందవలసిన వారికి, అందవలసిన భాషలో అందకపోతే ఏమీ కాదు. ఏమీ జరగదు కూడా. మీకూ సురేఖ గారికి, చందమామ అభిమానులకు కూడా బాధ కలిగించే విషయమే ఇది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Rajugaaroo. Its really unfortunate that Chandamama decided to shelve this most popular feature in Telugu Chandamama. I have appealed to all Chandamama fans to send mails to the Editor to revise his decision.

  Please do inform your feed back also to the management of Chandamama.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శివరాం గారికి..
  అద్భుతమైన వ్యాసం..చందమామ అబిమానుల్లో అందరూ తప్పకుండా చూసే శీర్షికలలో ఇదొకటని తప్పకుండా చెప్పవచ్చు. కానీ అంతలోనే మీ ఇంకో టపా.. 'ఫోటో వ్యాఖ్యని' ఆపేస్తున్నారని. కానీ మీ బ్లాగ్ లో ఆ రెండు పోస్టులూ కనబడటం లేదు. ఒకసారిచూడగలరు.
  రాజు గారు సరిగ్గా చెప్పారు..మనసుంటే మార్గముంటుంది..!! వాళ్ళ మనసు ఇప్పుడు పని సులువు చేసుకోవడం లో వున్నప్పుడు...పని మానేసి తప్పించుకునే మార్గమే భేషుగ్గా కనిపించినట్టుంది.
  కారణం ఏమైనా ఇలాంటి మంచి శీర్షికలు తీసేస్తూ పోతే చందమామ వన్నె తగ్గిపోతుంది. అలా కాకుండా మళ్ళీ మన చందమామ శుక్లపక్షం లోకి అడుగు పెట్టి మనందరికీ పున్నమి వెలుగులు ప్రసరిస్తుందని ఆశిస్తూ..
  రాధేశ్యాం.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.