10, జూన్ 2010, గురువారం

చందమామ అభిమానులకు ఒక మనవి

నిన్ననే ఇదే బ్లాగులో చందమామలో అరవై సంవత్సరాల పైగా కొనసాగుతున్న ఫోటో వ్యాఖ్య పోటీ గురించి ముచ్చటగా వ్రాసి, మన పత్రికా చరిత్రలో ఇదొక అరుదైన శీర్షిక అని ఆనందింటం జరిగింది.

కాని ఈరోజున ఒక దుర్వార్త తెలిసింది. జూన్ నెల 2010 నుండి చక్కటి శీర్షికను ఆపివేస్తున్నారట. ఇంతకంటే దురదృష్టకరమైన విషయం మరొకటి లేదు. చందమామ ప్రస్తుతపు యాజమాన్యానికి చందమామ లో ఉన్న చక్కటి శీర్షికల గురించి పెద్దగా అవగాహన లేనట్టున్నది. పైగా వాళ్లకి తెలుగు కూడా రాదట. మనం వ్రాసే విషయాలు ఏమీ అర్ధం కావు.

చందమామ అభిమానులందరూ విషయం పైన వారి వారి అభిప్రాయాలను ఆంగ్లలో కింద ఇచ్చిన మెయిలు చిరునామాకు పంపగలరు.
editor@chandamama.com

మీరు వ్రాసిన మెయిలు కింద ఇచ్చిన చిరునామాలకు కూడా పంపగలరు

feedback@chandamama.com
abhiprayam@chandamama.com
online@chandamama.com

ఇందులో ఎవరో ఒక్కరు చదివి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశ.

మరవకండి, మీరు పంపాల్సిన మెయిలు ఆంగ్లంలోనే ఉండాలి. ఇప్పటి చందమామ అధిపతులు తెలుగు వారు కాదు.


ఎంతమంది అభిమానులు స్పందించి అన్ని మైళ్ళు చందమామ వారికి పంపితే అంతగా నిర్ణయాన్ని వారు నిలుపుచేసే అవకాశమున్నది. ఇంతకాలం నుండి మనం చూస్తున ఫోటో వ్యాఖ్యల పోటీ శీర్షిక కాపాడుకోవాలిసిన అగత్యం పట్టింది . అదే బాధాకరమైన విషయం.

2 కామెంట్‌లు:

  1. మెయిల్ పంపించానండీ. చాలా బాధాకరమైన విషయం. అయినా ఆ ఒక్క పేజీ శీర్షిక ఏ రకంగా సమస్య అయిందో అర్ధం కాడంలేదు.

    రిప్లయితొలగించండి
  2. చందమామ యాజమాన్యానికి తెలుగు వచ్చునో లేదో నాకు తెలియదు కాని మీరు ఇచ్చిన మెయిల్ చిరునామాలో
    abhiprayam@chandamama.com కి తెలుగులో పంపినా సమాధానం వస్తుంది. నా అనుభవం.
    చందమామ గురించి ఏ విషయం అడగాలన్నా, వివరాలు కావాలన్నా శ్రీ రాజశేఖర రాజు గారికి మెయిల్ చెయ్యవచ్చు. ఆయన చాలా ఓపికగా మన సందేహాలను తీరుస్తారు. ఆయన చందమామకి అసోసియేట్ ఎడిటర్.
    krajasekhara@gmail.com

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.