ఆ విధంగా వచ్చిన ఒక హిందీ పాట, తెలుగు పాటల సాహిత్యం కింద ఇస్తున్నాను. తెలుగులో మదన కామరాజు కథ సినిమాలోది, హిందీలో చౌద్వీ కా చాంద్ సినిమాలోది. తెలుగులో పాడిన గాయకుడు శ్రీ ప్రతివాద భయంకర శ్రీనివాస్ ( పి బి శ్రీనివాస్), హిందీలో పాడిన గాయకుడు శ్రీ మొహమ్మద్ రఫీ.
మదన కామరాజు కథ | చౌద్వీ కా చాంద్ |
నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో నీలి మేఘమాలవో నీ మోములోన జాబిలి దోబూచులాడెనే నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో నీలి మేఘమాలవో నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే నీ వలపు తీరని మధురాల రావమే నిలచేవదేల నా పిలుపు ఆలకించవో నీలి మేఘమాలవో రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే రాగాల తెలిపోదమే జాగేల చాలునే రావో యుగాల ప్రేయసీ నన్నాదరించవో నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదినే దోచిపోదువో నీలి మేఘమాలవో |
चौदवीं का चाँद हो , या आफताब हो
|
హిందీలో పాట రచన శ్రీ షకీల్ బదాయుని. తెలుగు సినిమాకు రచించినది శ్రీ పింగళి నాగేంద్రరావు.
ఎంతో శ్రమకోర్చి, ప్రత్యెక సాంకేతిక పరిజ్ఞానం కాని, సామగ్రి కాని లేకుండా, కంప్యూటర్ సాయంతో, మామూలు సాఫ్ట్వేర్లతో ఈ రెండు పాటలనూ ఎక్కడా ఎక్కువ తక్కువలు కాకుండా చక్కగా కలిపిన కప్పగంతు రాధాకృష్ణకు అభినందనలు .
.
.
baagundandi.. manchi paatalu, manchi saahityam, manchi saapatyam... :)
రిప్లయితొలగించండిGood audio mixing Radhakrishna. May we expect more such audio magic from you!
రిప్లయితొలగించండిChala bavundi
రిప్లయితొలగించండిధన్యవాదములు నారాయణ రావు గారు. శివగారి సహకారంతొ మరిన్ని చెయ్యటానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిరాధక్రిష్ణ.
హిందీ పాట అంటే నాకు ఇష్టంకంటే ప్రాణం. తెలుగులో సినిమాచూడకుండా పాట వినడమే మేలు అనిపిస్తుంది. నటీనటులు ఇద్దరూ బాగా చేయలేదు. న్యాయం చేకూర్చలేదు అనిపించింది.
రిప్లయితొలగించండిరెండు పాటలు ఒకదగ్గర పెట్టి అందించినందుకు ధన్యవాదాలు..