20, ఆగస్టు 2010, శుక్రవారం

ఒక చక్కటి బ్లాగ్

మనకు తెలుగులో అనేకానేక బ్లాగులు కనపడుతూ ఉంటాయి. సామాన్యంగా బ్లాగులో ఎవరి అభిరుచినిబట్టి వారు వ్రాస్తూ ఉంటారు. అన్ని బ్లాగుల్లోనూ తప్పనిసరిగా ఉండేవి, ఆయా బ్లాగు యజమానుల గురించిన వివరాలు, మెయిలు వగైరా. కాని ఈరోజున ఒక తెలుగు పాట సాహిత్యం వెతుకుతూ ఉంటే ఒక మంచి తెలుగు బ్లాగు కనపడింది.

ఎక్కడా ఏవిధమైన ఆర్భాటం, సొంత డబ్బా లేకుండా శ్రీ చింతలపాటి శ్రీధర్ గారు తెలుగులో ఉన్న అపురూపమైన పాటల సాహిత్యాన్ని అందిస్తున్నారు. మొత్తం మీద నాలుగైదు పాటలకి మాత్రమె అటువంటి సాహిత్యాన్ని అందించినా, నాకు ఈ బ్లాగు చాలా నచ్చింది. పాట సాహిత్యం ఎవరు వ్రాశారు, సంగీతం ఎవరు సమకూర్చారు, సినిమాలోది, పాడిన గాయనీ గాయకులూ వంటి పూర్తి వివరాలను అందించారు.

ఇంత చక్కటి బ్లాగు నిర్వహిస్తున్న శ్రీధర్ గారిని వ్యక్తిగతంగా మెయిలు పంపి అభినందిద్దామని ప్రయత్నిస్తే, బ్లాగులో అవకాశం లేదు. ఒక కామెంటు వ్రాయటానికి కూడా ఆప్షన్ ఏర్పరచలేదు.

శ్రీధర్ గారూ మీ బ్లాగ్ అద్భుతంగా ఉన్నది . మీకివే నా అభినందనలు కృతజ్ఞతలు

శ్రీధర్ గారూ, మే నెల తరువాత మీరు మళ్ళి పాట గురించి వ్రాయలేదు. మీరు చేస్తున్న చక్కటి పని దయచేసి కొనసాగించగలరు.

చక్కటి బ్లాగును కింది లింకు నొక్కి చూడవచ్చు.

తెలుగు పాటల సాహిత్యం


ఇలా మనకు తెలుగులో ఉన్న చిత్ర గీతాలు, లలిత గీతాలు అన్నిటికి మించి కర్నాటక సంగీతం గురించిన వివరాలు అందించటానికి అభిరుచి కలిగిన ఐదారుగురు కలిసి ఒక బ్లాగులో వ్రాయటం మొదలుపెడితే, చక్కటి తెలుగు పాటల "భాడారం" తయారవుతుంది.

ఇలా తెలుగు పాటల సాహిత్యం సేకరించి ఒక చక్కటి బ్లాగు రూపొందించి, అందులో కనీసం వారానికి రెండు పాటలు అందిస్తే చాలు సంవత్సరానికి నూట నాలుగు పాటలు అవుతాయి. బృందంలో ఉండే సభ్యుల సంఖ్య అంతకంటే సభ్యుల హుషారును బట్టి పాటల ఖజానా పెరుతుగుంది.

అటువంటి అవకాశం ఉందంటారా!!

చూచెదము గాక.





6 కామెంట్‌లు:

  1. sir,

    I have been following these blogs for quite a long time..
    (Telugu Patala Samaharaniki Swagatham.....)
    http://telugu-pata.blogspot.com/

    there are no posts after sep 2008. but those songs are in English. I tried to convert it to telugu script. see this sample below:

    http://radhemadhavi.blogspot.com/


    telugu movie songs in classical ragas:
    http://www.astrojyoti.com/5_Siva_SNT/Page_1.htm

    checkout this radio on annamacharya keerthanas..
    http://www.samkeertana.info/Blogs/SamkeertanaBlogs/annamAchArya/radio.html


    also this one...
    Annamacharya Samkirtanalu - అన్నమాచార్య సంకీర్తనలు
    http://annamacharya-lyrics.blogspot.com/

    http://www.satyamsivamsundaram.net/

    with best regards,
    radheshyam

    రిప్లయితొలగించండి
  2. ఆ, ఈ రోజుల్లో అటువంటి పాత పాటలని ఎవరు చదువుతారులె అని చాలా రోజులుగా ఆ బ్లాగుని విస్మరించాను - ఈ రోజు మీ బ్లాగు చదివి కొంచెం బుద్ధి తెచ్చుకున్నాను :) ఇక పైన మళ్లీ రెగ్యులర్ గా update చేస్తాను
    - శ్రీధర్

    రిప్లయితొలగించండి
  3. నమస్తే శివ గారు __/\__

    మీ అభిరుచులు చాలా బాగున్నాయి ముఖ్యంగా సంగీతం..అన్నమయ్య కీర్తనలు..సినిమా పాటలు హో....
    ఏది ముట్టుకొంటే అదే బంగారంలా ఉండే మీ సాయిత్య అభిమానానికి ఇవే నా జోహార్లు ..
    మీ బ్లాగులో చూసి నేర్చుకొనేవి...వినేవి..అమ్మో బోలేడు ఉన్నాయి...మీ అభిరుచులు మాతో పంచుకొన్నందుకు కృతజ్ఞలతో

    సుందర్‌ప్రియ

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.