30, సెప్టెంబర్ 2010, గురువారం

దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల సంపుటి ప్రచురణ చేయ్యబోతున్నారట


పై బొమ్మ సౌజన్యం బొమ్మరిల్లు పత్రిక, సేకరణ వేణువు వేణూగారు



ఇంతకాలం
బొమ్మరిల్లు లో మొట్టమొదటి ధారావాహిక ఎవరు వ్రాశారు అన్న విషయం మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి కాని, నిజం ఇది అని ఇదమిద్ధంగా ఎవరూ గట్టిగా చెప్పలేదు. ఇప్పుడది తెలిసిపోయింది. ఇది వారి 13 వ ధారావాహిక "ట" ఎవరి ధారావాహికా??

మృత్యులోయ ధారావాహికలో కూడ ఇద్దరు హీరోలు, ఒకరు రాజు కొడుకు మరొకరు మంత్రి కొడుకు. ఇద్దరూ వీరులే కాని, సహజంగా మంత్రి కుమారుడు తెలివితేటలతో రాణిస్తే, రాజు కొడుకు, వీరోచిత కార్యాలతోఆకర్షిస్తాడు. కథ మొత్తం ప్రయాణంలోనే నడుస్తుంది.

లక్షణాలన్నీ ఎవరి ధారావాహికలలో ఉంటాయి. మరింకెవరండీ , మన అభిమాన రచయిత శ్రీ దాసరిసుబ్రహ్మణ్యం గారి సీరియల్స్ లోనే కదా. ఇప్పుడు తెలిసిపోయిందా! బొమ్మరిల్లు ప్రారంభ ధారావాహిక ఎవరువ్రాశారో. మరెవరో కాదు దాసరి దాసరి సుబ్రహ్మణ్యం గారే . అప్పటికే ఆయన చందమామలో రాతి రథం వ్రాస్తున్నారు అనుకుంటాను. తానప్పటికే ఒక పత్రికలోవ్రాస్తూ ఉండటం , పైగా ఆపత్రికకు పోటీగా వస్తున్నపత్రికలో వ్రాయటం ఎలా? అందుకని రహస్యంగా వ్రాసారుట.
ఆయన తన ఉద్యోగ ధర్మాన్ని సవ్యంగా పాటించారా లేదా అన్నది కాదు ఇప్పుడు చర్చ. మనకు మరో చక్కటిధారావాహిక అందింది . అదే ఆనందం .

మరొక సంతోషించవలసిన విషయం ఏమంటే, దాసరి వారి మీద ప్రత్యెక సంచిక ప్రచురించిన మన "రచనశాయి" గారే దాసరి వారి కథలు, నవలలు అన్నీ కూడ (చందమామలో వచ్చిన డజను ధారావాహికలుతప్ప) పైన చెప్పిన మృత్యులోయ దారావాహికతో సహా ఒక సంపుటిగా తీసుకురావాలని నిర్ణయించారు. విషయంలో ఆయన దగ్గర నుండి వచ్చిన మెయిలు కింద ఇవ్వటం జరిగింది. దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానం ఉన్న వారందరూ, కార్యక్రమం లో పాలుపంచుకునే అవకాశం ఉన్నది. సంపుటి జనవరిలో ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నారు, పెద్దగాసమయం లేదు. కాబట్టి దాసరి అభిమానులందరూ స్పందిస్తారని ఆశిస్తున్నాము

*********************************************

రచన శాయిగారి దగ్గర నుండి వచ్చిన మెయిల్ యధాతధంగా
Forwarded message -
From: sai yvsrs
Date: 2010/9/26
Subject: Dasari Subrahmanyam works - Publication
To: venu ch
, Sujatha , SIVARAMAPRASAD KAPPAGANTU , Raja Sekhara Raju , Venkata Ramana


Following is the consolidated appeal for possible display in your bolgs or informing other like minded people.

************************************************
Dear Friends:

I am in the process of collecting all stories of Sri Dasari Subrahmanyam garu - to the extent possible - with an optimistic view of getting them printed in a book form with the financial assistance of like minded friends.

So far collected 31 stories.

Apart from the Anthology of Short Stories, it is now contemplated to publish "Agnimaala' (Novel) serialized in Yuva - Telugu Monthly during Jan - Dec, 1975 and his 13th Janapada Novel 'Mrutyuloya' published in Bommarillu also.

The Project is so designed to involve all the admirer's of Sri Dasari garu. Sri Vasireddy Narayana Rao garu volunteered for suitable assistance.

It is proposed to release all the three books on 27th January, 2011 (first anniversary of Sri Dasari) at Hyderabad.

Those who are interested may contribute minimum of Rs.1000/- but not exceeding Rs.3000/- each enabling others to participate in the Project. Cheques/DD's to be made in favour of 'VAHINI BOOK TRUST' payable at 'Hyderabad' and sent to :

Vahini Book Trust
1-9-286/2/P ; Vidyanagar
Hyderabad - 500 044

You may please inform the Project details to like minded people also.

with best wishes

sai

************************************************


--
Y V S R S Talpa Sai
Editor - RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad - 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 - 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net


2 కామెంట్‌లు:

  1. మంచి వార్త చెప్పారు. రచనా సాయి గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. మృత్యులోయ ‘బొమ్మరిల్లు’లో సీరియల్ గా వస్తున్న కాలంలోనే చదివాను. అది ఎంతో నచ్చబట్టే... తర్వాత రెండు భాగాలుగా వచ్చిన పుస్తకాన్ని సేకరించాను. ఆ సీరియల్ దాసరి సుబ్రహ్మణ్యం గారి రచన అని తెలిసి ఎంత ఆనందపడ్డానో చెప్పలేను. ఇన్నేళ్ళ తర్వాత రచయిత పేరుతో ‘మృత్యులోయ’ ప్రచురణ అవుతోందన్న వార్త సంతోషాన్ని కలిగిస్తోంది!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.