2, అక్టోబర్ 2010, శనివారం

మరో మంచి సినిమా


ప్రస్తుతం THE INACCESSIBLE PINNACLE అనే సినిమా చూస్తున్నాను. సినిమా మొత్తాన్నిస్కాట్లాండ్ లోని స్కైయి ద్వీపంలో తీశారు. అక్కడి ప్రకృతి రమణీయతను కెమారాలో బంధించటంలోదర్శకుడు సైమన్ మిల్లర్ కృతకృత్యుడయ్యాడు. సినిమా మొత్తం "గాలిక్" భాషలో ఉన్నది. గాలిక్ భాషలో పూర్తిగా తియ్యబడ్డ మొట్టమొదటి సినిమా. డి వి డి లో ఆంగ్ల సబ్ టైటిళ్ళు సౌకర్యవంతగా ఉన్నాయికాని, నటుల నటన, కథ చెప్పించటంలో దర్శకుని ప్రతిభ, చిత్రగ్రాహకుని నైపుణ్యం, ఆ సబ్ టైటిల్స్ అవసరం పెద్దగా లేవనిపిస్తాయి.

సినిమా అంతా తాతా మనవళ్ళ మధ్యనే తిరుగుతుంది. తాతగారు చెప్పే కథలు ఆయన చూపించే అద్భుతప్రదేశాలు, అంతర్లీనంగా, పిల్లల తల్లి తండ్రుల విషాద మరణానికి సంబంధించిన కథ. మంచి ఎమోషనల్ థ్రిల్లర్ అని నేను అనటమే కాదు అబ్జర్వర్ పత్రికవారు " మానవత్వపు విలువలతో ప్రకాశించిన సినేమా" అని అన్నారు. అలాగే సండే టైంస్ (ఇవన్ని ఆంగ్ల పత్రికలు) "ఒక అద్భుతమైన ఘనత" గా పొగిడింది. బి బి సి వారైతే "ఊపిరిసలపనివ్వని అద్భుత దృశ్య కావ్యం" అని కీర్తించారు. ఇంతేకాక, బాఫ్టా బహుమతి ప్రదానాలకుమూడు కాటగిరీల్లో (ఉత్తమ చిత్రం వర్గం తో పాటుగా) నామినేట్ అయ్యింది.

సినిమాలో సెల్ ఫోన్ తో సామాన్యమైన మానవ సంబంధాలు ఎలా దెబ్బ తింటున్నాయో, వయస్సులోపెద్దవారైన వారికి, సెల్ అంటే కుర్రాళ్ళల్లో ఉన్న పిచ్చి ఎంతటి చీకాకు కలిగిస్తున్నదో చక్కగా చూపించిన దృశ్యం ఒకటి ఉన్నది. తాతగారు మనవడితో కలసి తన పడవలో ప్రయూణిస్తుంటారు. అప్పటికే వారిద్దరి మధ్య కొంత ఉద్రిక్తత నెలకొని ఉంటుంది. అటువంటి సమయంలో మనవడు తన సెల్ తీసి మాట్లాడుతుంటాడు. అప్పుడు తాతగారు ఎలా స్పందిచారో చూడండి.



సినిమా లో నాకు బాగా నచ్చిన సీన్లలో ఇది మొదటిది. ఎదురుకుండా ఉన్న మనిషంటే లెక్కేలేదు ఈరోజున. జేబిలో సెల్ మోగగానే, ప్రాణం పోతున్నట్టుగా, ఎదుటి మనిషితో మాటలు హటాత్తుగా తుంచేసి, ఇక ఆ సెల్ లో ఒకటే వాగుడు. పోనీ అదేమన్న చాలా ముఖ్యమైన విషయమా అంటే, ఉట్టి పోచికోలు కబుర్లు. ఎదురుగుండా ఉండే వాడికి నరకం, ఆపైన కోపకారణం.

కాని, దురదృష్టవశాత్తూ, పై సీన్, అసలు సినిమా నుండి తొలగించారు. నేను కలెక్టర్స్ ఎడిషన్ డి వి డి చూడటం వల్ల "తొలగించిన సీన్లు" శీర్షికన సీన్ చూడగలిగాను. అసలు సినిమాలో ఇంత చక్కటి సీన్నిఎందుకు తొలగించి ఉంటారంటారు? ! ఏమున్నదీ, సినిమా ఫైనాన్సు చేసిన వాళ్ళల్లో ఎవరికో సెల్ ఫోన్లకంపెనీనో, సెల్ కు సంబంధించిన మరే వ్యాపారమో ఉండి ఉంటుంది, ఎప్పటికైనా నిజం కటువుగానే ఉంటుంది కదా! అటువంటి "నిజం" తమ వ్యాపారన్ని దెబ్బ తీస్తుందన్న భయంతో, దర్శకుడు ఎంత బాగాతీసి, నటులెంత బాగా పాత్రలో జీవించినా, ఈ మంచి సీన్ని పీకి పారేశారు.
‌‌ ‌

ఏమైనా ఒక మంచి సినీ సీన్ ఇది. సినిమా హాళ్ళల్లో చూసినవారు మిస్ ఐన సీన్ ఇప్పుడు మీరు చూశారు.






**********************************

1 కామెంట్‌:

  1. well said sir.
    నిజం నిప్పు లాంటిది. కనుకే, నిప్పును పట్టుకోడానికి సాహసించనట్లే కొందరు నిజాలను చూపడానికి కూడా సాహసించరు.
    But, they can never succeed in hiding it for beyond a limited TIME after which it will BANG like a FIRE BALL.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.