26, అక్టోబర్ 2010, మంగళవారం

ఒక శుభవార్త

వార్త పత్రికలో వేసిన ఒక వార్తా కథనం ప్రకారం, ఆకాశవాణి వారు వారి కార్యక్రమాల్లో కొన్ని, వారి దృష్టిలో సాంస్కృతిక విలువలు ప్రతిబింబించే వాటిని డిజిటైస్ చేసే ప్రక్రియ మొదలు పెట్టినట్టుగా తెలుస్తున్నది. ఎంతో ఎంతో సంతోషించతగ్గ విషయం . వారు డిజిటైస్ చేసిన తరువాయి కార్యక్రమమేమిటో కూడా వార్తా కథనంలో ఉంటే బాగుండేది. వాళ్ళ దగ్గర స్పూల్ టేపుల్లో ఉన్నవి డివిడిలుగా మార్చి దాచుకుంటారా? లేక సంవత్సరాల వారిగా "SALE ON DEMAND" అంటే కావలిసిన వారికి అభిరుచి ఉన్నవారికి వారు అడిగి తగిన వెల చెల్లించిన తరువాత వారికి డి వి డి వ్రాసి అందచేస్తారా? వివరాలు తెలియవలసి ఉన్నది.

ఏది ఏమైనా ఆకాశవాణి వారు ఇంతటి మంచి పని మొదలు పెట్టినందుకు ఆనందంగా ఉన్నది. పై వార్త తేదీ చూస్తె మే 25, 2010 అంటే "వినిపించే కళాకారులు కనపడే వేళ" కార్యక్రమం జరిగిన ఒకటి రెండు రోజుల తరువాతే "మంచి ప్రారంభం" జరిగినట్టుగా తెలుస్తున్నది. విషయం గురించి రోజున కార్యక్రమంలో ప్రకటించి ఉంటే ఎంతైనా బాగుండేది. కాని బ్యూరోక్రాట్ లు బ్యూరోక్రాట్లే వాళ్లకి ప్రతిదీ రహస్యమే.

ఇప్పటికైనా దక్షిణాది ఆర్ఖైవ్స్ వారు డిజిటైజేషన్ కు తీసుకున్న కార్యక్రమ వివరాలను ఆకాశవాణి వారి వెబ్ సైటులో ఉంచితే అందరికీ తెలిసే అవకాశం ఉన్నది (మరీ పేరాశ కదూ!!!)

ఒక 3-4 సంవత్సరాల క్రితం చందమామ పత్రికలన్నిటిని స్కాన్ చేసి వెబ్ లో ఉంచబోతున్నారు అన్న వార్త చదివినప్పుడు కలిగిన "థ్రిల్" గుర్తుకు వస్తున్నది. తిరుపతి తిరుమల దేవస్థానం వారి పుణ్యమా అని పాత చందమామలు అన్నీ కూడా మళ్ళి చూస్తూ చదవగలిగిన అదృష్టం కలిగింది. అలాగే ఆకాశవాణి వారు, వారి పూర్వపు కార్యక్రమాలు మళ్ళి మనింట్లోనే మనకు వీలైనప్పుడు వినగలిగే అవకాశం కలిగిస్తే అంతకంటే కావలసినది ఏమున్నది! అందుకే ఇది శుభవార్త.

వార్త పత్రికలో వచ్చిన కథనం కింది లింకు నొక్కి చదువవచ్చు.


3 కామెంట్‌లు:

  1. ఈ శుభవార్త మాకు చేరవేసినందుకు మీకు కూడా కృతజ్నతలు.

    రిప్లయితొలగించండి
  2. Dear Sir!
    CNN Hero of the Year కు సంబంధించిన ఒక మోటివేషనల్ కధనాన్ని నా బ్లాగులో వ్రాసాను @ http://dare2questionnow.blogspot.com/2010/10/catch-he-brings-hot-meals-to-indias.html. వీలుంటే మీ బ్లాగులో పెట్టండి, లేదా మీ మిత్రులందరికీ మెయిల్ చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  3. కింది వార్త కొసమెరుపులా ఉంది..

    All India Radio , Hyderabad seeks
    material for website archive

    http://www.hindu.com/2010/10/28/stories/2010102861950200.htm

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.