Statue of Liberty తెలుసు అదెక్కడున్నదో కూడ చెప్పవలసిన పని లేదు. Statue of Unity ఎక్కడ ఉన్నదో తెలుసా?
రాబొయ్యే తరాలకు "ఉక్కు మనిషి" సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గురించి తెలియ చెప్పటానికి ప్రపంచంలోనే అతి ఎత్తైన పెద్ద విగ్రహ నిర్మాణం తలబెట్టినట్టుగా గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీ తన బ్లాగులో వివరించారు.
అక్టోబర్ 31వ తేదీ పటేల్ గారి జయంతి. మన దేశంలో సామాన్యంగా గాంధీ జయంతి, నెహ్రూ జయంతి జరిపినట్లుగా ఇతర నాయకులను పట్టించుకోదు ప్రభుత్వం. మాజీ ప్రధాని, అత్యంత నిజాయితీ పరుడిగా పేరొందిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి అక్టోబర్ రెండు అని ఎంతమందికి తెలుసు. ఆరోజున, శాస్త్రి గారిని తలుచుకున్న వాళ్ళు డజన్లలోనే ఉంటారు. పటేల్ గారి విషయంలో కూడ ఇదే వైముఖ్యం ప్రభుత్వం చూపిస్తూ ఉంటుంది. ఇదంతా సెలెక్టివ్ పూజా విధానం. రెండు కుటుంబాలే వాళ్ళకు ప్రధానం. ఆ కుటుంబ నాయకులతో విబేధించిన వారిని దూరంగానే ఉంచుతారు.
పటేల్ గారే కనుక పూనుకుని దేశ సమగ్రత కాపాడకుండా ఉంటే ఇప్పుడు "మనది" అనుకుంటున్న ఈ దేశం, ఏ రూపంలో ఉండేదో మరి. అంతటి మహానాయకుడిని పట్టించుకోకపోవటానికి కారణం ఏమిటి. అతి తెలివికి పోయి కాశ్మీరు సమస్యను నెహ్రూ ఎప్పటికీ ఆరని నిప్పుల కుంపటి చేసిపారేసినా జయంతులు ఘనంగా! అనేకానేక సంస్థానాలను, తన రాజకీయ చతురతతో భారత దేశంలో విలీనానికి ఎనలేని కృషి చేసిన పటేల్ గారికి నిరాదరణ! కలికాలం అంతకటే మరేమీ కాదు.
పటెల్ గారు కాంగ్రేస్‌కు చెందిన నాయకుడైనా, ఆయనకు ఈ నాడు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం నెలకొల్పటానికి పథక రచన చేస్తున్నది భారతీయ జనతా పార్టీకి చెందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేద్ర మోడి. దేశ సమగ్రతకు కృషి చేసిన పటేల్ గారి విగ్రహానికి Statue of Unity గా ఉంచటం ఎంతైనా ముదావహం.
ఈ విగ్రహ వివరాలన్ని కూడ మోడి బ్లాగులో ఉంచారు చూడండి.
సర్దార్ పటేల్ స్మారక మ్యూజియం ప్రారంభ సమావేశంలో శ్రీ నరేద్ర మోడి చేసిన ప్రసంగం ఈ కింది వీడియోలో చూడవచ్చు.
వీడియో కర్టెసీ www.jitegagujarat.com
నిజమే. ఈ విషయంలో నరేంద్ర మోడిని తప్పక అభినందించాలి.శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిగారి గురించి ఒక మంచి విషయం తెలియజేసారు.
రిప్లయితొలగించండి>>
రెండు కుటుంబాలే వాళ్ళకు ప్రధానం. ఆ కుటుంబ నాయకులతో విబేధించిన వారిని దూరంగానే ఉంచుతారు.
>>
రెండు కాదు. ఒక్క నెహ్రు కుటుంబమే. గాంధి గారి వారసులు ఎవరూ అయన తర్వాత రాజకీయాలలోకి రాలేదు(రానివ్వలేదేమో?).
ఇప్పుడు ఉన్న కుటుంబం ఇంటి పేరు మార్చుకుని గాంధి గారి వారసులుగా చెలామణి అవుతుంది. మన దేశంలో ఇప్పటికీ చాల మంది వీరిని గాంధి గారి వారసులుగా అనుకునే ఎన్నికలలో గెలిపిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే నెహ్రు గారిని కూడా ప్రస్తుత ప్రభుత్వం మరచిపోయినట్లే. రూపాయి నోటు మీద గాంధి గారి బొమ్మ ఉంటుంది గాబట్టి ఆ మాత్రమైన తెలుస్తుంది.
అక్టోబరు 2 న మహాత్మా గాంధీ( జయంతి), అక్టోబరు 31 న ఇందిరాగాంధీ(వర్ధంతి) ధర్మమా అని శ్రీ లాల్ బహదూర్, సర్దార్ వల్లభాయ్ ( మన దేశంలో పుట్టిన అతికొద్దిమంది ఆనెస్ట్ నాయకులు) ల గురించి గుర్తు చేసుకోలేకపోతున్నాము.
రిప్లయితొలగించండిబాగా చెప్పారు.
రిప్లయితొలగించండిఅలాగే లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు, మొరార్జీ దేశాయ్ గారు, గుల్జారీలాల్ నందా గారు లాంటి వాళ్ళు అవినీతి పై పోరాడిన తీరు, నీతివంతమైన పాలన అందించిన తీరు మనందరికీ గుర్తుండిపోయేలా ఏదైనా చెయ్యాలి. చూడబోతే రేపటి తరాలకు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది గాంధీ గారు అని చెబితే 'సోనియా గాంధీ' నా అని వారు మనల్ని తిరుగు ప్రశ్నించినా ఆశ్చర్యపోనవసరం లేని స్థితి వస్తుందేమో?
Suniljee and Phanibabu garoo, thank you for your remarks.
రిప్లయితొలగించండిReddy garoo. You made a good point. The present day trend is to erect statues of all tom, dick and harry (capitals not intended for names). Narendra Mode is erecting a statue for a real leader, thats what I liked and hence wrote the small article.
ధన్యవాదాలు. మీకు అభినందనలు. ఈ రాజకీయదుమారంలో కొట్టుకుపోతున్న ఎవరికీ మంచి గుర్తుండదు.
రిప్లయితొలగించండి