వడ్డాది పాపయ్య గారి సొంత ఊరైన శ్రీకాకుళం లో కొత్తవంతెన సమీపాన ఆయన విగ్రహం స్థాపించారని తెలుస్తున్నది . ఆ విషయం కూడా ఘనులైన మన మీడియా వారు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు . ఆయన విగ్రహ చిత్రాన్ని చూడండి .

ఈ విగ్రహ స్థాపన గురించిన వివరాలు SRIKAKULAM EMINENT PERSONS బ్లాగునుండి తీసుకోబడినవి. ఈ కింది లింకు నొక్కి అక్కడ అతి కొద్ది వివరాలు, ముఖ్యంగా వపాగారి విగ్రహం చూడవచ్చు.
ఇది నిజంగా అద్భుతం...!! ధన్యవాదాలు శివరాం గారూ...!
రిప్లయితొలగించండిచందమామ పత్రిక పాత ముఖ చిత్రాలు చూసి చిన్నప్పటి రోజులన్నీ సినిమా రీలులా
రిప్లయితొలగించండిఒక్కసారి మనోఫలకం మీద గిర్రున తిరిగినట్లైంది.అప్పటి అభిమాన పత్రిక చందమామనే
శ్రీ వడ్డాది పాపయ్య (oIo)గారి చిత్రాలు చూసి అంతఃపురాలు,రాకుమారులు,మహారాణులు
రాక్షసులు,దేవతలు ఒకటా,రెండా ఎన్నెన్నో చిత్రాలను చూసి నిజంగా వారు అదేవిధంగా
ఉంటారని అనుకునే వాణ్ని. వారి దుస్తుల్లో,భూషణాలలో చాలా చోట్లలో వారి గుర్తును కలిసి పోయే విధంగా
చిత్రములు వేసేవారు. వారికి తగినంత గుర్తింపు రాలేదన్నది నిజం .వారు ఏ గొప్ప చిత్రకారుల కంటె
తక్కువ వారు కాదుఃవారు నిస్సందేహంగా చిత్రకారుల్లో అగ్రగణ్యుడే .వారికి నా మనఃపూర్వక ప్రణామాలు.
మీ చిత్రాల ద్వారా పాత రోజులు జ్ఞాపకము వచ్చాయి.మీకు ధన్యవాదాలు ,అభినందనలు, నమస్కారాలు.