28, అక్టోబర్ 2010, గురువారం

ఎంటీవీ ఆచార్య - చందమామ మొదటి తరం చిత్రకారుడు

చందమామ ముఖ చిత్రం 1948 ఫిబ్రవరి నెల మళ్ళి నాడు అదే చందమామకు అలంకరణ
చందమామ
మేటి చిత్రకారులలో ఒకరైన ఎంటీవీ ఆచార్య గారు 1948 ఫిబ్రవరి సంచికకు వేసిన ఫ్రంట్ కవర్ పేజీని అక్టోబర్ 2010 చందమామకు ముఖచిత్రంగా వేశారు.


పెద్దబ్బాయి తన తమ్ముడిని, చిన్నారి చెల్లెలిని తోపుడు బండిలో కూర్చోబెట్టి మెల్లగా లాగుతున్న దృశ్యం. బండి, పిల్లలు, శుభ్రంగా ఉన్న పల్లెదారి, పచ్చిక, గడ్డిపూలు, నేపధ్యంలో పెద్ద చెట్టు, పక్షులు, ఆకాశంఅన్నీ కొట్టొచ్చేంత స్పష్టంగా ముఖచిత్రం మనకు చూపుతోంది. మానవ శరీర నిర్మాణాన్ని ఔపోశన పట్టి మహాభారతం సీరియల్‌‌లో, తదనంతర కాలంలో ఎంటీవీ ఆచార్య గారు చిత్రించిన అద్భుత చిత్రాలను తలపిస్తూ ఒకనాటి చందమామ చిత్రవైభవానికి చిత్రిక పడుతోందీ చిత్రం.

ఎం.టి.వి. ఆచార్య 1948లో చందమామలో చిత్రకారునిగా చేరారు . చిత్రాగారు చందమామ తొలిచిత్రకారుడు కాగా, ఆచార్య గారు రెండవవారు. 1960 వరకు రెగ్యులర్గా చందమామలో పనిచేసిన ఈయన మహాభారతం అట్టచివరి బొమ్మకూ, అట్టమీది బొమ్మకూ అద్భుతమైన బొమ్మలు గీశారు . ఆయనకు మనుషుల శరీర నిర్మాణం బొమ్మలలో ఎలా గీయాలో క్షుణ్ణంగా తెలుసు. సుమారు 20 ఏళ్ళ పాటు కొనసాగిన మహాభారతం సీరియల్‌కు ఆయన వివిధ పాత్రల ముఖాలు ఏ మాత్రమూ మార్పు లేకుండా చిత్రీకరించారు. అందరూ బుర్రమీసాల మహావీరులే అయినా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ప్రతి ఒక్కరినీ బొమ్మ చూడగానే పోల్చడం వీలయేది. భీష్ముడికి తెల్ల గడ్డమూ, బట్టతలా ఆయనే మొదటగా గీశారు. భీష్మ సినిమాలో ఎన్‌.టి.రామారావు ఆహార్యమంతా చందమామలో ఆయన వేసిన బొమ్మల నుంచి తీసుకున్నదే. తరవాత ఆయన వ్యక్తిగత కారణాలవల్ల బెంగుళూరుకు వెళ్ళిపోయారు.

చందమామ అలనాటి చిత్రకారులకు సంబంధించిన వివరాలు దాదాపుగా దొరుకుతున్నాయి కాని ఆచార్య గారి వివరాలు అస్సలు అందుబాటులోకి రావడం లేదు. రోహిణీ ప్రసాద్ గారు తమ చందమామ జ్ఞాపకాలులో ఆచార్య గారి గురించి రాసిన పై బాగం తప్పితే ఆయన గురించి పెద్దగా వివరాలు తెలీవు.

1995 వరకు జీవించిన ఆచార్య గారు చందమామలో గీసిన ముఖచిత్రాల ఒరిజనల్ ప్రతులను రష్యా తదితర దేశాల్లో ప్రదర్శించి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. చిత్రకారులు అప్పట్లో గీసిన పలు చిత్రాలను అప్పటి యాజమాన్యం ఉదారంగా బయటకు కూడా ఇచ్చేదని తెలుస్తోంది. ఆచార్య గారు కూడా ఇలా తన చిత్రాలను తీసుకెళ్లి ప్రదర్సనశాలల్లో ప్రదర్సించారు. తర్వాత వాటిని తిరిగి ఇవ్వలేకపోవడంతో మహాభారతంకు ఆయన గీసిన ఒరిజినల్ చిత్రాలు ప్రస్తుతం చందమామ వద్ద కూడా లేవు.

కాని ఆయన అప్పట్లో వేసిన కొన్ని చిత్రాలు మాత్రం రిజెక్ట్ కాగా వాటిని ఇప్పటికీ భద్రంగా ఆఫీసులో ఉంచారు. ఇలా ప్రచురణకు తీసుకోకపోవడంలో మిగిలిపోయిన చిత్రాలు వడ్డాది పాపయ్య (వపా) గారి చిత్రాలతో సహా ఇతర చిత్రకారుల చిత్రాలు కూడా చందమామ ఆఫీసులో సురక్షితంగా ఉన్నాయి.

ఆచార్య గారికి కన్నడ సాస్కృతిక కళారంగంలో మంచి పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు మించి వివరాలు తెలీవు.ఎవరికయినా కన్నడిగుడైన ఎంటీవీ ఆచార్య గారి వివరాలు తెలిసే అవకాశమంటే కాస్త చందమామ చెవిన వేయగలరు.



(రాజశేఖర రాజుగారు తమ బ్లాగులో వ్రాసిన వ్యాసం నుండి కొన్ని భాగాలు ఇక్కడ పున:ప్రచురణ)










*

2 కామెంట్‌లు:

  1. MTV Acharya was the (first) editor of Kannada chandamama also.

    After leaving Chandamama group MTV(enkata) Acharya settled down in Bangalore. He ran an art school in Gandhi nagar area. I have seen this art school growing in the 70's( Near Cyndicate office head office. MTV acharya also has a postal art school. Incidentally MTV Acharya's own sister/cousion lived in Swimming pool extension area in Malleswaram. Last time I checked, they still lived there.
    SSJH

    రిప్లయితొలగించండి
  2. @SS,

    Thank you for the information. You seem to be having good information about Shri Acharya. Is it possible that you may be having a photo of Shri Acharya. If so please send it to us for publication in this blog.

    This is a request on behalf of all the Chandamama fans.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.