
ఈ రేడియో నాటిక గురించి ఒక సమీక్ష వ్రాద్దామని ఉన్నది. కాని అందులోని నటీనటులు పేర్లు మాత్రమె తెలుసు ఎవరి వివరాలూ తెలియవు. వారి గొంతులే కాని వారి చిత్రాలు అందుబాటులో లేవు. ఒక్క బుచ్చమ్మపాత్ర వేసిన శ్యామల గారి వివరాలు "వాచస్పతి" పుస్తకం పుణ్యమా అని (ఆకాశవాణి హైదరాబాడుకేంద్ర కళాకారుడు శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ తీసుకున్న చొరవ కారణంగా) కొద్దిగా దొరుకుతున్నాయి. ఈ కింది ఆడియో వినండి, అందులో ఈ అద్భుత నాటక పున:ప్రసారం జరిగినప్పుడు, అందులోని నటీనటుల వివరాలు ఆకాశవాణి వారు నాటకం చివరలో చెప్తున్నప్పటిది.
పైన ఆడియోలో మనం విన్న పేర్లల్లో వచ్చిన నటీనటుల వివరాలు, వారి ఫోటోలు లభ్యమైతే ఎంత బాగుండును. ఈ బ్లాగు చూసి, పై ఆడియో విన్నవారు ఎవరైనా వారి దగ్గర వివరాలు ఉంటే పంపగలరు. అలాగే ఆయా నటీనటుల వారసులు, స్నేహితులు, బంధువులు ఎవరన్నా చూసే అదృష్టం ఈ కాస్త వ్రాతకు పడితే, వారి కూడా ఇదే విన్నపం. మీ దగ్గర ఉన్న వివరాలు అందరితో పంచుకోండి, అందరికీ తెలియచేయండి, మన రేడియో కళా సంపదను కాపాడుకుందాం, రాబొయ్యే తరాలకు ఈ అద్భుత కళ గురించి తెలియచేయటానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం.
మరి కొద్ది రోజులలో ఈ రేడియో నాటక సమీక్ష ఇదే బ్లాగులో! కొద్దిగా వేచి చూడండి.
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.