చందమామ మొదటి రోజులలో ముఖచిత్రాలు "చిత్రా" గారే వేశేవారు. ఆ తరువాత ఎం టి వి ఆచార్యగారు కొంతకాలం వేశారు. ఆచార్య గారి బొమ్మలకీ, పాపయ్యగారిబొమ్మలకీ చాలా తేడా ఉన్నది. ముద్రణా సాంకేతికత కూడా పాపయ్య గారు వచ్చి బొమ్మలు వేసే రోజులకుఅభివృద్ది చెందినట్టుగా కనపడుతుంది. పాపయ్య గారు వేసిన బొమ్మలన్నీ "కలర్ రిచ్" ఎన్నెన్నో రంగులు అద్భుతంగా వెలిగిపోతూ ఉంటాయి.
ఆచార్య గారు కూడా తనదైన శైలిలో అనేకానేక పురాణ పురుషుల బొమ్మలు గీశారు, ముఖ్యంగా భారతంలో అనేక ఘట్టాలు ఆయన చిత్రించారు. ఆయన వేసిన కొన్ని బొమ్మలను, డిజిటల్ రీ మాస్టర్ చేసి ఒక స్లైడ్ షో గా అందిస్తున్నాను, చూసి ఆనందించండి.

స్లైడ్ షోలో బొమ్మలన్ని చందమామ వారి సౌజన్యం
*
స్లైడ్ షో బాగుందండీ. ముఖ్యంగా ఉత్తర గోగ్రహణం, యుద్ధరంగంలో ఏనుగు, కాళియ మర్దనం, ఉయ్యాల్లో చిన్ని కృస్ణుడూ, భీష్ముడు, భీముడు, ఘటోత్కచుడు... ఈ బొమ్మలన్నీ ఎంటీవీ ఆచార్య గారు అద్భుతంగా వేశారు. చిత్రాల క్వాలిటీని మీరు మెరుగుపరిచారు కాబట్టి మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉన్నాయండీ. ఇప్పుడే వేణుగారి బ్లాగులో ఆచార్యగారి గురించి చదివి కామెంటు పెట్టి వస్తున్నా, ఇంతలోనే ఇక్కడ మరిన్ని బొమ్మలు ప్రత్యక్షం. గొప్ప ఉల్లాసంగా ఉంది అన్నీ చూస్తూ ఉంటే ముఖ్యంగా కర్ణుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, గంగాదేవి, పార్థసారథి, యమ ధరమరాజు, వలలుడు, శివుడు చాలా బావున్నాయి.
రిప్లయితొలగించండి