బొమ్మలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బొమ్మలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జూన్ 2011, ఆదివారం

మాయదారి ముసలిది బొమ్మలు

మిత్రుడు మన తెలుగు చందమామ సహా రచయిత శ్రీ రాధేశ్యాం ఈ రోజున ఇద్దరు మోసగత్తెలు అన్నపేరుతొ ఒక చక్కటి సమీక్ష వ్రాసారు. ఆయన వ్రాసినది మూడవసారి ఈ ధారావాహికప్రచురించినప్పటిది అనుకుంటాను. ఇదే కథ తెలుగు చందమామలో మూడుసార్లుప్రచురించబడినది. రెండవసారి వ్రాసినప్పుడు రచయిత శ్రీ ఆర్ నాగభూషణం గారు.

ఈ ధారావాహికకు పట్టు చిత్రాగారు వేసిన బొమ్మలు. అన్ని బొమ్మలూ ఒక్కటొక్కటిగా ఉంచటం కష్టం కాబట్టి. మూడు విడతలుగా తయారు చేసి ఉంచాను. ఆసక్తి కలవారు ఒక్కో బొమ్మను నొక్కి అన్ని బొమ్మలను చూడవచ్చు.










1, నవంబర్ 2010, సోమవారం

M T V ఆచార్య గారి బొమ్మల కొలువు

చందమామ మొదటి రోజులలో ముఖచిత్రాలు "చిత్రా" గారే వేశేవారు. ఆ తరువాత ఎం టి వి ఆచార్యగారు కొంతకాలం వేశారు. ఆచార్య గారి బొమ్మలకీ, పాపయ్యగారిబొమ్మలకీ చాలా తేడా ఉన్నది. ముద్రణా సాంకేతికత కూడా పాపయ్య గారు వచ్చి బొమ్మలు వేసే రోజులకుఅభివృద్ది చెందినట్టుగా కనపడుతుంది. పాపయ్య గారు వేసిన బొమ్మలన్నీ "కలర్ రిచ్" ఎన్నెన్నో రంగులు అద్భుతంగా వెలిగిపోతూ ఉంటాయి.

ఆచార్య గారు కూడా తనదైన శైలిలో అనేకానేక పురాణ పురుషుల బొమ్మలు గీశారు, ముఖ్యంగా భారతంలో అనేక ఘట్టాలు ఆయన చిత్రించారు. ఆయన వేసిన కొన్ని బొమ్మలను, డిజిటల్ రీ మాస్టర్ చేసి ఒక స్లైడ్ షో గా అందిస్తున్నాను, చూసి ఆనందించండి.






స్లైడ్ షోలో బొమ్మలన్ని చందమామ వారి సౌజన్యం














*

31, అక్టోబర్ 2010, ఆదివారం

పాపయ్య గారి అద్భుత చిత్రాలు

చందమామ పత్రిక చేసుకున్న అదృష్టాలలో ఒకటి వారికి వడ్డాది పాపయ్య గారు చిత్రకారునిగా దొరకటం, నెలసరి జీతానికి ఆయన పని చేయటానికి ఒప్పుకోవటం. పాపయ్య గారికి ఆ నెల జీతమే దక్కింది కాని, రావలిసిన పేరు ప్రఖ్యాతులు అంతగా రాలేదు. చాలామంది పాపయ్యగారు పురాణ చిత్రాలు మాత్రమె వేశారని అనుకుంటూ ఉంటారు. కానీ, నిజానికి, పాపయ్య గారు సాంఘిక కథలకు, జానపద కథలకు కూడ బొమ్మలు వేశారు. చక్రపాణి గారు బెంగాలీ నుండిఆంధ్రీకరించిన శరత్ నవలలు అన్ని 'యువ' పత్రికలో ప్రచుచేవారు. వాటన్నిటికి బొమ్మలు వేసినది పాపయ్య గారే. చందమామలో వేసిన చిత్రాలలో, అరణ్య పురాణం ధారావాహిక కు వేసిన చిత్రాలు అమోఘం. బొమ్మలు చూస్తె చాలు కథ చదవాలిసిన అవసరం లేదు. పూర్తిగా అర్ధం అయిపోతుంది. పైగా, ఆ బొమ్మలు రంగుల్లో, ఆయన కుంచే నుండి అద్భుతంగా జాలువారాయి. ఆ బొమ్మలలో కొన్ని చూడండి.



చిత్రాలు చందమామ వారి సౌజన్యంతో
అరణ్య పురాణం చిత్రాలతో చేసిన ఒక స్లైడ్ షో చూడండి.










4, జనవరి 2010, సోమవారం

విచిత్ర కవలలు - బొమ్మలు

పైన ఉన్న బొమ్మలు చందమామలో మొట్టమొదటి సారిగా రెండవసారి ప్రచురించబడిన ధారావాహిక విచిత్రకవలలులోనివి. మొదటి సారి ఈ ధారావాహికను ప్రచురించినప్పుడు బొమ్మలు రంగులలో లేవు, అప్పటికి ఆ సాంకేతిక నైపుణ్యంమనకు వచ్చినట్టు లేదు. అటు నలుపు తెలుపులోను, ఆ తరువాత రంగులలోను బొమ్మలు వేసినది, చిత్రా గారే. చిత్రాకు తన పేరు బొమ్మలోని ఒక రాయిమీద వ్రాసుకోవటం చాలా ఇష్టంగా ఉన్నాట్టున్నది. కుడి పక్కన ఉన్న బొమ్మలోచూడవచ్చు. ఈ విధంగా ఆయన తనపేరు వ్రాసుకోవటం, చందమామ బొమ్మలలో అనేక చోట్ల చూస్తాం. చందమామ దారావాహికలలో ఇలా పొడుగాటి బొమ్మలు వేసినది ఈ దారావాహికలోనే అనుకుంటాను.

చందమామ ధారావాహికలో పుస్తకంగా వచ్చినది విచిత్ర కవలలు. కాకపొతే ఆ పుస్తకంలో బొమ్మలు రంగులలో లేవు. తన చిన్నతనంలో ఆ పుస్తకాన్ని కొనుక్కోవటమే కాకుండా దశాబ్దాల పాటుగా పదిలంగా దాచుకున్న చందమామప్రియులు శ్రీ మట్టెగుంట అప్పారావుగారు (సురేఖ కార్టూనిస్టు). వీరు రాజమండ్రిలో ఉంటారు. ఆయన సేకరించిన ఈపుస్తకంలోని కొన్ని బొమ్మలను మన అందరితోను పంచుకోవటానికి పంపారు. ఆ బొమ్మలు (రంగులు లేవు) ఈ కిందఇవ్వబడినాయి. రంగులు లేకపోయినా, చిత్రా గారి నైపుణ్యం కనపడుతూనే ఉన్నది.


























ఈ
కింది బొమ్మలు చూడండి అందులో ఒకటి మొదటిసారి ధారావాహిక వేసినప్పటిది రెండవది తరువాత రంగులలో వేసినప్పటిది. దాదాపు ఒకేలాగా ఉన్న బొమ్మలు ఇవి.