10, డిసెంబర్ 2010, శుక్రవారం

చందమామ పుట్టుక - నాగిరెడ్డిగారి మాటల్లో


మనకంటూ ఒక చక్కటి బాలల పత్రిక మొదలు పెట్టి, అటువంటి పత్రికను అటు బాలలకే కాక, పెద్దలయినా, బాల్యాన్ని అపురూపంగా తమలో ఇంకా ఉంచుకోగలిగిన వారి మన్నననలను కూడ పొందుతూ (ఇందులో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడ ఉన్నారు) కొన్ని దశాబ్దాలపాటు నడిచిన ఏకైక అద్భుత పత్రిక తెలుగు చందమామ.

నాటికీ చేతులు మారినా పత్రిక పరిమాణం తగ్గిస్తేనే, ఉరిమి చూసి అక్షింతలు వేసి, ప్రస్తుతపు యాజమాన్యానికి ఒక పాఠం నేర్పి, మళ్ళి పాత రూపానికి తీసుకు రాగలిగిన బలమైన ఉత్తమ అభిరుచిగల పాఠక లోకం గల ఏకైక పత్రిక చందమామ.


మనకందరికీ
తెలుసు చందమామ జులై నెల 1947 సంవత్సరంలో మొదలు పెట్టారని, నాగిరెడ్డిగారు చక్రపాణిగారు పత్రికను స్థాపించిన మహానుభావులని. కాని పత్రిక పుట్టుక అద్భుత ద్వయంలో ఒకరైన శ్రీ నాగి రెడ్డిగారి మాటల్లో వినగలిగితే, అలనాటి చారిత్రాత్మక ఘటన గురించి ఆయనే వివరిస్తే ఎలా ఉంటుంది అన్న చందమామ అభిమానుల కోరిక తీర్చటానికా అన్నట్టుగా ఒక చక్కటి వీడియో దొరికింది. వీడియోలో శ్రీ నాగిరెడ్డిగారు, చందమామ పుట్టుక, తాను చక్రపాణిగారు కలిసి పత్రిక స్థాపించటం గురించి అలా హాయిగా తన పాత రోజులు నెమరువేసుకుంటూ చెప్తుంటే, మనం కూడా రోజుల్లోకి వెళ్ళిపోయి, తెలుగు చందమామలో హేమా హేమీలైన కొడవటిగంటి కుటుంబరావుగారు, దాసరి వారు, చిత్రా, వపాగార్లు, ఆపైన మన శంకర్ గారు కలిసి జన రంజకంగా నడిపిన అలనాటి చందమామ తప్పక గుర్తుకు వస్తుంది.

వీరందరి
అద్భుత కలయికలో వచ్చిన కథలు, ధారా వాహికలు,ఇతర శీర్షికలు ప్రజల మనస్సులను ఎంతగా చూరగోన్నాయంటే, ఇప్పటికీ కార్పోరేట్ యాజమాన్యం అలనాటి కథలనే మళ్ళి మళ్ళివేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నది
.

నాగిరెడ్డిగారు, చందమామ చరిత్రను వివరిస్తున్న దృశ్యం చూసి ఆనందించండి. వీడియో చివరలోఅలనాడు చందమామలు అచ్చు అవుతూ అలా కదిలి వెళ్ళిపోతూ, కట్టలుకట్టబడుతున్న దృశ్యం కూడా ఉన్నది.
అద్భుత వీడియోని అందించిన శ్రీ రాజశేఖర రాజుగారికి ధన్యవాదాలు
వీడియోని తయారుచేసి
అందించిన విజయా గ్రూప్ వారికి ప్రత్యెక అభినందనలు


మరొక రోజున అలనాటి ప్రముఖ నటి చందమామ జ్ఞాపకాలు


*

1 వ్యాఖ్య:

 1. శివరామప్రసాద్ గారు, శుభోదయం ! శ్రీ నాగిరెడ్డి గారి వీడియో
  చూపించినందుకు మీకూ, రాజశెఖరరాజు గారికి ధన్యవాదాలు.
  నవంబరు చందమామలో నా ఉత్తరం చూశారని తలుస్తాను.
  మీ లాంటీ చందమామ అభిమానుల కృషి వల్లే మళ్ళీ మన
  తెలుగు చందమామ కొత్త ఏడాది నుంచి పున్నమి చందమామ
  గా మారి పాఠకప్రియులకు వెన్నెల కురిపిస్తున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.