12, డిసెంబర్ 2010, ఆదివారం

నాగిరెడ్డి గారిపై టి వి కార్యక్రమం

మధ్య మన చందమామ రాజుగారి ( నెలవంక బ్లాగ్ చూడండి) పుణ్యమా అని నాగిరెడ్డిగారి మీద తీయబడిన చక్కటి డాక్యుమెంటరీ చూసిన తరువాత అద్భుత వ్యక్తిమీద మరింత గౌరవం పెరిగింది. ఆయన మీద ఇంకా మరింత సమాచారం కాని లేదా ఆయన గురించిన కార్యక్రమాలు ఉన్నాయా అని వెతుకుతుంటే, "యు ట్యూబ్" (ప్రతి మాటను ఏమైనా సరే యధాతథంగా తెలుగు చేసెయ్యాలని పట్టుబట్టేవారు మాటకు తెలుగు ఏమి చేస్తారో అని భయంలేకపోలేదు) వెబ్ సైటులో "ఎన్ టి వి" తయారు చేసి ప్రసారం చేసిన ఒక కార్యక్రమం దొరికింది. కార్యక్రమపు నిడివి దాదాపు పదిహేడు పద్దెనిమిది నిమిషాలు. కార్యక్రమాన్ని సమర్పించిన ఆమె "శక్తి" "ధైర్యం" అనే మాటలను సరిగా ఉచ్చరించలేకపోవటం తప్పిస్తే కార్యక్రమం బాగున్నది. కింది లింకుతో కార్యక్రమంచూడవచ్చు. క్షణక్షణం బ్రేక్...బ్రేక్ ( ఈ మాటా "యధాతధపు తెలుగు" పాలపడితే!!) అంటూ ఝడిపించే టి వి చానెల్ నాగిరెడ్డిగారి గురించి మంచి నిడివిగల కార్యక్రమం ఇవ్వటం ఎంతైనా ముదావహం.
పై కార్యక్రమానికి రెండవ భాగం కూడ ఉన్నది. కింది లింకు ద్వారా చూడవచ్చు.
***

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.