19, డిసెంబర్ 2010, ఆదివారం

చందమామ ధారావాహిక పుస్తకం

చందమామ ధారావాహికలను పుస్తకాలుగా ప్రచురించిఉంటే అని అనుకోని చందమామ అభిమాని ఉండరు. కాని చందమామ వారు కారణం వారికే తెలియాలి, వారి ధారావాహికలను పుస్తకాలుగా ప్రచురించ లేదు. కాని, రోజున పాత చందమామలు తిరగేస్తుంటే ఆగస్టు 1955 సంచికలో పై వ్యాపార ప్రకటన కనపడింది. అంటే, ఆరోజులలో విచిత్ర కవలలు అనే ధారావాహికను ఒకే పుస్తకంగా పాఠకులకు అందించారన్నమాట. అప్పట్లో అంటే 1950లలొ వెల ఒక్క రూపాయి. చాలా ఖరీదే అయ్యి ఉండాలి. అప్పట్లో ఒక రూపాయికి, ఇప్పుడు మనం వందరూపాయలు పెట్టినా కొనలేనన్ని సామాన్లు వస్తూ ఉండాలి. కాబట్టి, పుస్తకం ధర ఎక్కువే! అలా వెలువడిన విచిత్ర కలవలలు పుస్తకం ఎవరిదగ్గరన్నా ఉన్నదా? ఉంటే ఆ పుస్తకాన్ని ఇంటర్నెట్లో అందరితో పంచుకోగలరా? ఎవరి దగ్గరన్నా ఈ పుస్తకం ఉంటే, చందమామ అభిమానులందరితో పంచుకోవాలని విజ్ఞప్తి.

విచిత్ర కవలల తరువాత మరే ధారావాహికను చందమామ వారు పుస్తకంగా ప్రచురించలేదు. ఇప్పటికైనా వారి ధారవాహికలను, చిత్రా, శంకర్ మరియు వపా గార్ల బొమ్మలతో సహా ఒకే పుస్తకంగా ప్రచురిస్తే చందమామ అభిమానులందరూ సంతోషిస్తారు, వేల సంఖ్యలో కొంటారు. కాని చందమామ వారికి ఈ విషయం చెప్పటం ఎలా? ఎన్ని మైళ్ళు ఇచ్చినా వినరే!

5 కామెంట్‌లు:

  1. శివరామ ప్రసాద్ గారికి నమస్కారం!
    చందమామలోని సీరియల్స్ ను పుస్తక రూపంలో తీసుకొని రావాలి అనే చందమామ అభిమానుల కోరిక ఈ నాటిది కాదు. ఆ కోరికకు దాదాపు యాభయ్యేళ్ళ పైనే చరిత్ర వుంది. అభిమానులు ఆ విధంగా వత్తిడి తెస్తున్నట్లు చందమామ 1951 అక్టోబర్ సంచిక సంపాదకీయం లో రాసారు. నాకు తెలిసినంత వరకు చందమామ వారు ఐదుప్రశ్నలు (వెల:ఆరణాలు), తండ్రి కొడుకులు (వెల:ఎనిమిది అణాలు),జాతక కథలు (వెల:ఒక రూపాయి రెండణాలు), విచిత్ర కవలలు (వెల: ఒక రూపాయి),పుస్తక రూపంలో తీసుకు వచ్చారు. జాతక కథలు పుస్తకం నా దగ్గర వుంది. విచిత్ర కవలలు పుస్తకం శ్రీ రచన శాయి గారి దగ్గర వుంది. ఆగస్ట్ 2008 రచనలో విచిత్ర కవలలు ముఖచిత్రం వేసారు.

    రిప్లయితొలగించండి
  2. రచన శాయిగారు ఈ మైలు ద్వారా20 డిసెంబర్, 2010 5:36:00 AM ISTకి

    I do posses it. There was another Advt in one of the issues stating that Tokachukka- Makaradevata together in book form. But was not available for puchase in those days. Not sure whether it was out for sale or otherwise.

    What I have is the Book they published. Mri Venu gave Soft Copies of the same - both BW and Color. Probbly he will make you available.


    Your assumption that thousands will purchase is only hypothetical. They knew it and as a result they don't bring them in book form. Also it is their treasure for reprints for another century or so.

    రిప్లయితొలగించండి
  3. ధారావాహికలను పుస్తకరూపంలో తేకపోవటానికి శాయి గారు చెప్పిన కారణాన్నే నేనూ ఊహించాను. వాటిని చందమామలో మళ్ళీ మళ్ళీ ప్రచురించే అవకాశాన్ని ప్రచురణకర్తలు ఎందుకని వదులుకుంటారు చెప్పండి?

    ఈ సీరియల్స్ పుస్తకాలుగా వస్తే పాఠకులు ఆలస్యంగానైనా బాగానే కొంటారని మాత్రం నాకనిపిస్తోంది!

    రిప్లయితొలగించండి
  4. చందమామ వారు తమ పత్రిక అభిమానులందరినీ నిరాశపరిచిన సంగతి ఏమిటి అంటే, ప్రతి ధారావాహిక పూర్తయిన తరువత ఆ ధారావాహికను పుస్తకంగా వేసి సరసమైన ధరకు ఇవ్వలేకపోవటం. పైన వ్యక్తపరచబడిన అభిప్రాయాలతో నేను ఏకీభవించలేక పోతున్నాను. నిజానికి ఒక ధారావాహిక చందమామలో వచ్చి, పున:ప్రచురణ ఎప్పుడు అయ్యింది. శిధిలాలయం 1968-70 ల మధ్య మొదటిసారి ధారావాహికగా ప్రచురిస్తే, పున:ప్రచురణ ఎప్పుడు? 2010లో!! అంటే నాలుగు దశాబ్దాల తరువాత! అప్పుడెప్పుడో 1970లో ఆ ధారావాహిక పుస్తకంగా వేసి ఉంటే, నాలుగు దశాబ్దాల తరువాత, ధారావాహిక మళ్ళి ప్రచురించటానికి వ్యాపార పంధాలో అడ్డువస్తుందా?? ఇదే కనుక చందమామ ధారావాహికలను పుస్తకాలుగా వేయకపోవటానికి కారణం ఐతే, అంతకంటె హాస్యాస్పదమైన కారణం మరోటి ఉండదు. ధారావాహికను పుస్తకంగా వెయ్యలన్న సదుద్దేశ్యం చందమామవారికి లేదు కలగలేదు. దానికి కారణాలు మనం వెతుక్కోవటమేకాని, నిజానికి వారిది ఒక విధమైన మూర్ఖపు మొండితనపు వైఖరే తప్ప మరొకటికాదని నా అభిప్రాయం.

    1970లలో బొమ్మరిల్లులో వచ్చిన ధారావాహిక "మృత్యులోయ" పుస్తకంగా వేశారు. ఈ మధ్య రచన శాయిగారు దాసరివారి మీద మరొక సంచిక కోసం భూమ్యాకాశాలు వెతగ్గ వెతగ్గా ఎక్కడో ఒకటో రెండో దొరికాయి. అంతే కాని, వందల సంఖ్యలో ఎక్కడా తారసపడలేదు.

    సరే, ఇప్పుడు పుస్తకంగా వేస్తే ఎంతమంది కొంటారు అని. ధారావాహిక పూర్తయిన వెంటనే పుస్తకంగా బొమ్మలతో సహా వేసి ఉంటే, తప్పనిసరిగా వేల సంఖ్యలో అమ్ముడై ఉండేవి. చందమామవారు తమ ధారావాహికలను ఒక్కో పుస్తకంగా వెయ్యటానికి అన్ని తయారు చేసుకుని (చిత్రా బొమ్మలతో సహా) ఆర్డరు ఇచ్చినవారికి మాత్రమే అమ్మే ఏర్పాటు చేస్తే బాగుండవచ్చు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.