20, డిసెంబర్ 2010, సోమవారం

ఎట్టకేలకు స్నేహితుల కలయిక


ప్రసాదు గారు డల్లాస్ లో ఉంటున్న, సాహిత్యం మీద అపారమైన ఆదరణ, అభిమాన కలిగిన తెలుగు వారు. అక్కడ జరిగే తెలుగు వారి కార్యక్రమాలన్నిటికి ఈయనే ప్రధాన సూత్రధారి.

M V L ప్రసాద్ గారితో రెండు సంవత్సరాల నుండి స్నేహం. జి మెయిల్ చాట్ ద్వారా, ఆపైన ఫోనులోనూ సంభాషణలు. మైళ్ళ ద్వారా అనేకానేక విషయాల మీద సమాచారం పంచుకోవటం జరిగినా, ఒకరినొకరు చూసుకున్నది లేదు, కలిసింది లేదు. మధ్యనే ప్రసాదు గారు అమెరికానుండి భారత్ వచ్చి బెంగుళూరు వచ్చారు. ఆయన తన కార్యక్రమాల్లో తలమునకలై ఉండి కూడా, గుర్తుపెట్టుకుని మా ఆఫీసుకు వచ్చి నన్ను కలిశారు. ఆఫీసులో తప్పనిసరిగా ఆరోజే చూడవలసిన కార్యకలాపాల వల్ల ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోవటం ఒక బాధ అయినా, ఆయన్ని కలిసిన ఆనందం ఆనందమే. ఆయన్ను స్వాగతించటానికి , నేను మా కార్యాలయపు సెక్యూరిటీ వద్దకు వచ్చేప్పటికే ఆయన లోపలకు వస్తూ కనిపించారు. ఇద్దరం ఒకేసారి ఒకరినొకరు గుర్తుపట్టాము. దాదాపుగా నలభై ఐదు నిమిషాలు మాత్రమె ఆయనతో సంభాషించే ఆవకాశం కలిగింది. ఆయనను సాదరంగా మా ఇంటికి తీసుకుని వెళ్ళే ఆవకాశం మాత్రం దొరకలేదు. మళ్ళి అటువంటి ఆవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.

ఆయన నేను కలిసిన సందర్భంగా తీయబడ్డ ఫోటో పైన ఉంచాను. ఫోటో తీసిపెట్టిన మా సహోద్యోగి, శ్రీ రవి కుమార్ కు కృతజ్ఞతలు.

















*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.