26, డిసెంబర్ 2010, ఆదివారం

నయనం ప్రధానం

మనకు దేవుడు అనండి ప్రకృతి అనండి ఇచ్చిన అవయవాల్లో అన్ని ముఖ్యమే అనిపిస్తాయి. కాని అన్నిటికంటే ముఖ్యమైనవి "కళ్ళు". కళ్ళే లేకపోతె! అసలు ఆలోచనే భయానకంగా ఉంటుంది. కాని, కంటి చూపు కోల్పోయినవారు, పుట్టుకతోనే గుడ్డివారు ఐనవారు మన మధ్యనే కనపడుతూ ఉంటారు. వారికి కంటి చూపు వచ్చే మార్గం ఉన్నది. ఎవరన్న నేత్రదానం చేస్తే వాళ్ళు చూడగలరు. కాని ఎవరు దానం చేస్తారు తమకున్న కళ్ళను. అందుకని మన వైద్యశాస్త్ర పారంగతులు మరణించిన వారి కళ్ళను అమర్చి గుడ్డివాళ్ళకు చూపు ప్రసాదించే పద్ధతి చాలా కాలం క్రితమే కనుగొన్నారు. మన తరువాత మన కళ్ళు ఎవరికన్నా చూపును ప్రసాదిస్తే అంతకంటే ఏమికావాలి.

కింది ఉన్న వీడియోని ఒక్కసారి చూడండి, చిట్టచివరలో పుట్టు గుడ్డి అయిన బాలుడు పచ్చ రంగు అంటే ఎలా ఉంటుంది అని అమాయకంగా అడుగుతుంటే, చెప్పలేక "నీకు ఎలా చెప్పాలిరా నాయనా" అని గద్గద కంఠంతో కుర్రవాడిని అనునయించటానికి ప్రయత్నిస్తూ దగ్గరకి తీసుకుంటాడు, ముసలి వార్డెన్. వీడియోకి అవార్డు వచ్చిందట.
వీడియోని చూసిన వారు, వీడియో తయారుచేసిన వారు తమ మరణానంతరం తమ కళ్ళను దానం చేయటానికి ఒప్పుకున్నరుట.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.