26, డిసెంబర్ 2010, ఆదివారం

మనదేశంలోనే మైనపు బొమ్మల అద్భుతంపైన కనపడే బొమ్మలన్నీ నిజమైన సంఘటనలకు ఫోటోలు కాదు. చూడటానికి ఎంతో సహజంగాకనపడుతున్న ఇవన్నీ కూడా మైనంతో చెయ్యబడ్డ బొమ్మలు. మనకందరికీ లండన్ లో టుస్సాడ్ మ్యూజియం గురించి తెలుసు. అక్కడ ఎవరి బొమ్మన్నా పెడితే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యిఉండాలిట.

కాని
మన దేశంలోనే ఇలాంటి అద్భుత మ్యూజియం ఉన్నదని మధ్య వరకూ నాకు తెలియదు. రచన శాయిగారు తెలియ చేసి, బొమ్మలను పంపారు. మన వాళ్ళు గొప్పవాళ్ళ జోలికి పోకుండా సామాన్యగ్రామీణ జీవనంలో తారసపడే అనేక ఘట్టాలను మైనంతో చక్కగా మలిచారు.

ఇంగ్లాండ్ అంటే చలి దేశం మైనం కరగటం జరగదు. కాని మన దేశంలో వేసంకాలంలో బొమ్మల్ని ఎలాకాపాడుతున్నారో మరి! కాపోతే ఈ
మ్యూజియం ఉన్న ప్రదేశం పూనా బెంగుళూరు రహదారిలో ఉన్నది. అక్కడ వేడి తక్కువగానే ఉంటుంది. ఆ కారణాన ఈ బొమ్మలు అక్కడ ఏర్పాటు చెయ్యటం సాధ్యపడి ఉంటుంది.

ఇక ఈ బొమ్మల్ని తయారు చేసి మ్యూజియంగా ఉంచినారు "సిద్ధగిరి గురుకుల్ ట్రస్ట్" వారు. వారు ఈ బొమ్మల్ని ఉంచటంలోని తమ ఉద్దేశ్యాన్ని ఈ కింది విధంగా వారి వెబ్ సైటులో తెలియచేసారు:

"ఏ ప్రాంతలో జన్మించి, పెరిగిన వ్యక్తి, తనకు తెలిసిన ఆ ప్రాంతపు పరిసరాలలోని సంస్కృతిని వంటబట్టించుకుంటాడు. బయటివారు ఎవరన్నా వచ్చి దుండగీడుతనంగా తన సంస్కృతిని, కళా సంపదను దోచుకుంటున్నా పాడిచేస్తున్నా అతను ఊరుకోలేడు. తన మస్తిష్కం లో తన సంస్కృతీ రూపాన్ని పదిలంగా ఉంచుకుంటాడు . ఈ మ్యూజియం రాబొయ్యే తరాలకు మన సంస్కృతిని తెలియచెప్పటానికి నెలకొల్పబడింది".

మిగిలిన వివరాలకు కింద ఇచ్చిన లింకు ద్వారా సిద్ధగిరి మ్యూజియం వారి వెబ్ సైటు దర్శించి పూర్తి వివరాలు, వారు ఉంచిన మరి కొన్ని బొమ్మలు చూడవచ్చు.

3 వ్యాఖ్యలు:

  1. నిజంగానేఅద్భుతం. అందించిన మీకు, శాయి గారికి ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ప్రాణం పోసుకున్న ఆ బొమ్మలు మాకు చూసే అదృష్టాన్ని
    కలిగించిన మీకు, మా రచన శాయిగారికి ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.