27, డిసెంబర్ 2010, సోమవారం

ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి

జీవన కాలం కేవలం నాలుగున్నర దశాబ్దాలు. ఆకాశవాణి శ్రోతల జ్ఞాపకాల్లో కలకాలం. వారే ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి. రాజమండ్రిలో జూన్ 30, 1946 జన్మించిన ఆకెళ్ళ మార్చ్ 17, 1992 పైలోకాలకువెళ్ళిపోయారు.

ఆంగ్లంలో ఎం ఏ చేసి, కొంతకాలం లెక్చరర్ గానూ, మరి కొంత కాలం జర్నలిస్టు గానూ పనిచేసారు ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి గారు. 1972 లో ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనౌన్సర్ గా చేరినప్పటికీ హైదరాబాదు ఆకాశవాణి కేద్రం లోనే చివరి వరకు పనిచేశారు. అనేక నాటికలు రచించారు, తాను నటించారు. వారు
వ్రాసిన నాటికల్లో నీలి నీడలు, రైలు కదిలింది, సక్షిప్త సంక్షోభ చిత్రం, కల్పన మున్నగునవి ఉన్నాయి. ఆకాశవాణిలోనే పనిచేస్తున్న జలసూత్రం సీతాదేవి గారిని వివాహమాడారు సత్యనారాయణ మూర్తి గారు.

రేడియో కళాకారునిగా ఆ కళలో బహుముఖ ప్రజ్ఞ కనబరిచి ఎంతో పేరు, అనేక మంది సహోద్యోగులను ఆత్మీయులుగా సంపాయించిన ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి గారికి ఆకాశవాణి వివిధ భారతి, హడారాబాడు కేంద్రం వారు సముచితమైన శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఆ కార్యక్రమ నిర్వహణ, సమర్పణ శ్రీ మట్టపల్లిరావు గారు. ఈ కింది ప్లేయర్ లో ఆ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని వినవచ్చు.

ఆడియో కర్టెసీ రంజనిగారు. 23 నిమిషాల ఆడియోని కుదించి, క్లారిటీ లేని భాగాలు తొలగించటం జరిగింది
శ్రద్ధాంజలి కార్యక్రమంలో శ్రీ మట్టపల్లి రావుగారు ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తిగారి గురించిన అనేక విషయాలు తెలియచేసారు. శ్రద్ధాంజలి కార్యక్రమం 31 మార్చ్ 1992 న ప్రసారం అయ్యింది.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి 1980ల మొదటి బాగంలో వచ్చిన ఒక అద్భుత కార్యక్రమం "నవలా స్రవంతి" లో ఎక్కువ భాగం శ్రీ ఆకెళ్ళగారే చదివారని ఈ మధ్యనే ఎవరో చెప్పగా విన్నాను. తెలిసిన వారు తెలియచేయగలరు.

===========================================================
ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి గారు నటించిన నాటికల ఆడియో ఉన్నవారు దయచేసి అందరితో పంచుకో ప్రార్ధన, మాకు పంపితే ఈ బ్లాగ్ ఆర్ఖైవ్స్ లో భద్రపరుస్తాము.

ఫోటోలు "వాచస్పతి" పుస్తకం నుండి గ్రహించబడినవి
===============================================================================









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.