26, డిసెంబర్ 2010, ఆదివారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావ్

నాకు ఊహ తెలిసినాక విన్న మొట్టమొదటి వార్తా చదువరి కంఠం శ్రీ ఏడిద గోప్పలరావుగారిదే. అప్పుడు నేను మూడో క్లాసో నాలుగో క్లాసో సరిగ్గా గుర్తులేదు, ఢిల్లీ నుంచి మాత్రమె ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం, వార్తలువచ్చేవి. అప్పుడు పొద్దున్నపూట స్కూలుకు వెళ్ళబోతూ విన్న వార్తలు, ఆ చదివినాయన పేరు ఇంకాగుర్తున్నాయి.

ఈ మధ్యనే ఆకాశవాణి హైదరాబాదు తమ కేద్రం స్తాఫిచి ఆరు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా ప్రసారం చేయబడ్డ కార్యక్రమం లో, అరవై ఏళ్ళ వారి కార్యక్రమాలను క్లుప్తంగా సమీక్షిస్తూ ఇప్పటి శ్రోతలకు తెలియచేసారు. ఆ రికార్డింగు, రంజని గారు నాకు పంపటం జరిగింది. ఆ ప్రసారం ఇరవై ఏడు నిమిషాలు జరిగింది. అందులో శ్రీ ఏడిద గోపాలరావుగారు కూడ పాల్గొని, తాను హైదరాబాదులో పనిచేయటం ఆపైన
ఢిల్లీ కేంద్రంలో న్యూస్ రీడర్ గా వెళ్ళటం, మధ్యలో కొంతకాలం రేడియో మాస్కో లో పనిచెయ్యటం వంటి విషయాలు ఒక్క నిమిషంలోపు వివరించారు. తాను ఆరోజుల్లో వార్తలు ఎలా చదవటం మొదలుపెట్టేవారో సరదాగా అలానే తన వివరణ మొదలు పెట్టారు. ఈ కింది ఇవ్వబడిన ప్లేయర్లో వినండి అలనాటి వార్తా చదువరి శ్రీ ఏడిద గోపాలరావుగారి కంఠం :


ఏడిద గోపాలరావుగారి స్వరం వినగలిగే అవకాశం కలిగించి రికార్డింగు పంపిన రంజని గారికి కృతజ్ఞతలు

శ్రీ
గోపాలరావుగారు రేడియోలో వార్తలు చదవటానికే కాక గాంధీ వేషం వెయ్యటంలో కూడ మంచి పేరు సంపాయించుకున్నారుట . ఆయన గాంధీ వేషంలో ఉన్న ఫోటో ఒకటి దొరికితే బాగుండును.

శ్రీ
గోపాలరావుగారు చూసే అదృష్టం వ్యాసానికి పడితే, వారికివే నా విన్నపం. మీరు న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న రోజుల్లోని అనుభవాలు, ఫోటోలు, అప్పటి ఇతర వార్తా చదువరుల రికార్డింగులు ఏమన్నా ఉంటే దయచేసి పంపగలరు. రేడియో కళాకారుల గురించి వ్రాసి అందరికీ తెలియచేయ్యాలని కోరిక. కోరికలోనించి వచ్చినదే అభ్యర్ధన.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.