29, డిసెంబర్ 2010, బుధవారం

కర్నాటక సంగీత మహామహులు

(పై బొమ్మ క్లిక్ చేసి పెద్దది చేసి చూడండి, అనేకమంది సంగీతజ్ఞుల చిత్రాలు చూడవచ్చు)

రోజున ఆకాశవాణి వారి భక్తిరంజని కార్యక్రమం గురించి వ్రాద్దామని శ్రీరంగం గోపాలరత్నం గారి ఫోటో కోసంవెతుకుతుంటే, ఒక చక్కటి వెబ్ సైటు దొరికింది. వెబ్ సైటు పేరు. "నాద ప్రభ" కింది లింకు నొక్కి చక్కటి వెబ్ సైటు చూడ వచ్చు.

వెబ్ సైటులో మీరు వేరే చోట వెతుక్కోనక్కర్లెకుండా , కర్నాటక సంగీత మహామహుల సగీతం ఒక్క చోటే ఉంచారు. వారి ఫోటో, వారు పాడిన సంగీతం పేరు పేరునా ఉంచారు.

ఒక్క గాత్ర సంగీతమే కాదు, వాద్య సంగీతం - వీణ, ఫ్లూట్, మృదంగం, మాండలిన్ - కూడా పేరొందిన విద్వాంసుల సంగీతం అక్కడ సమకూర్చారు . పైన ఇచ్చిన లింకు నొక్కి మీకు నచ్చిన కర్నాటక సంగీత విద్వాంసుని పాటలు/సంగీతం విని ఆనందించండి. ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి ఆ అద్భుత వెబ్ సైటులో!



2 కామెంట్‌లు:

  1. మీరిచ్చిన సైట్ చాలా బాగుంది.
    "రార మా ఇంటి దాకా" ఓలేటి వారి పాట విన్నాను.
    సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పిన నాదప్రభ చాలా బాగుంది. నాదప్రభ ద్వారా ఎమ్మెస్ బాల
    సుబ్రహ్మణ్యశర్మగారి గాత్రాన్ని మరోసారి వినే భాగ్యం కలిగింది. ఆయన
    మా చెల్లి కస్తూరికి సంగీతం నేర్పారు. మా చెల్లి తన పదో ఏట "నేనూ-మా
    సంగీతం మాస్టారు" అన్నబొమ్మ గీసి ఆంధ్రసచిత్ర వార పత్రిక (1954)
    దసరా సంచికలో బహుమతి గెలుచుకొంది. ఆ బొమ్మను చూసి ఆయన
    మా చెల్లిని మెచ్చుకోవడం నాకింకా కళ్ళకు కట్టినట్లు జ్ఞాపకం వుంది!
    శర్మ గారిని మేమూ ఆరోజుల్లో మామయ్యగారూ అని పిలిచే వారం.ఆయన
    ఇద్దరు అబ్బాయిలూ స్టేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.