1, ఫిబ్రవరి 2011, మంగళవారం

కీర్తిశేషుడు రచయిత - చిరంజీవ రచనలు


దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల ప్రదర్సన
అవును రచయిత కీర్తిశేషుడుఅయ్యి జనవరికి 27 2011 కు ఒక సంవత్సర కాలం జరిగింది. రచయితే శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారు. చిత్రమైన విషయం ఏమంటే, రచనల వల్లైతే ఆయనకు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయో, ఆయా రచనలకు ఆయన పేరు వేసి ఉండలేదు.

చందమామలో
పన్నెండు అద్భుతమైన జానపద ధారావాహికలు సంవత్సరాల పాటు వ్రాసి అప్పటి పిల్లలను పెద్దలను ఒకే విధంగా ఉర్రూతలూగించారు దాసరి. కాని ధారావాహికలు ఎవరు వ్రాస్తున్నారో ఎవరికీ తెలియదు. రచయిత పేరు ఉండాల్సిన చోట క్లుప్తంగా "చందమామ" అని ఉండేది. అదే పత్రికలో ఎప్పుడో నిర్వహించిన ప్రశ్నలు జవాబుల్లో ఒక్కసారి మాత్రం పాఠకులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పేరు ఇవ్వటం జరిగింది అంతే!


ఆయన అనేక పేర్లతో యువ పత్రికలోనూ, ఇతరత్రా పత్రికల్లోనూ రచనలు చేస్తూనే ఉన్నారు. కాని ఆయన పేరు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియలేదు. కారణం, దాసరి గారికి ఒంటరిగా ఉండటమే ఇష్టమనుకుంటాను. బొమ్మరిల్లు అన్న పిల్లల పత్రిక దాదాపుగా చందమామ పత్రికకు ఒక చక్కటి కాపీగా 1971 సంవత్సరంలో వచ్చింది. పత్రిక లో వచ్చిన మొట్టమొదటి ధారావాహిక మృత్యు లోయ కూడ ఆయన వ్రాసినదే.

విషయాలన్నీ ప్రముఖ బ్లాగర్ శ్రీ వేణు (వేణువు) దాసరి గారిని కలిసేవరకు ఎవరికీ తెలియదు. తరువాత చందమామ అభిమానులందరూ ఎవరికి వారు తమ అభిమాన రచయితను కలుసుకుందామని అనుకుంటూనే ఇవ్వాళ-రేపు అనుకుంటూ ఉండగా దాసరి వారు "ఇక చాలు" అనుకుని వెళ్ళిపోయారు. తరువాత జరిగినది అంతా ఇప్పుడు ఒక సాహిత్య చరిత్ర.

మనకున్న
ఏకైక సాహిత్య పత్రిక "రచన" సంపాదకులు శ్రీ శాయిగారు (ఆయన రచన శాయిగానే ప్రసిద్ధులు ) చొరవ తీసుకుని, దాసరి సుబ్రహ్మణ్య గారి పేరున ఒక ప్రతేక సంచిక తీసుకు వచ్చి, చందమామ అభిమానులందరి చేత దాసరి వారి ధారావాహికలన్నిటి మీద సమీక్షలు వ్రాయించి ప్రచురించి ఒక అరుదైన సాహిత్య సంఘటనకు దారి తీసారు. అప్పుడెప్పుడో, చిన్నతనంలో, ప్రతి నెల అపురూపంగా చదువుకున్న ధారావాహికల మీద, అదే బాలలు రోజున పెద్ద వారై సమీక్షలు వ్రాయటంరచయితకు ఒక అపురూప నివాళి.

అందుకే దాసరి రచయితగా కీర్తిశేషుడు కాని ఆయన రచనలు ఎప్పటికీ చిరంజీవులు.

ఇక్కడితో
ఆగలేదు, రచన శాయిగారి మరొక బృహత్కార్యక్రమం మొదలు పెట్టారు. ఎక్కడెక్కడో ఎన్నో పత్రికల్లో రకరకాల పేర్లతో పడి ఉన్న దాసరి వారి రచనలన్నీ గుదిగుచ్చి ఒక్కటే సంపుటిగా తీసుకురావటం ఒక అద్భుత ఆలోచన . కార్యక్రమంలో ఎందరెందరో పాల్గొన్నారు. అందరూ అభినందనీయులు.

సంపుటిలో బొమ్మరిల్లు మొట్టమొదటి ధారావాహిక "మృత్యు లోయ" కూడ చేర్చటం ఒక ప్రత్యెక ఆకర్షణ. ధారావాహికను సంపుటిలో చేర్చటానికి బొమ్మరిల్లు అధినేత శ్రీ విజయా బాపినీడు గారు ఏవిధమైన వ్యాపారపరమైన లాభాపేక్ష ఆశించకుండా పూర్తిగా ఉచితంగా అనుమతి ఇవ్వటం ఎంతైనా ముదావహం.


అద్భుత సంపుటి హైదరాబాదులో జనవరి 27 2011 ఆవిష్కరించబడినది. ఆవిష్కరణ సభకు సంబంధించిన చిత్రాలు చూడండి.



పుస్తక ఆవిష్కరణ సమయం
ప్రసంగిస్తున్న బాల సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ దాసరి వెంకటరమణ
తెలుగు చందమామ అసోసియేటెడ్ సంపాదకుడు శ్రీ రాజశేఖర రాజు
వచ్చిన సాహిత్యాభిమానులలో కొందరు.
శ్రీ విజయా బాపినీడుతో ముచ్చటిస్తున్న శ్రీ దాసరి వెంకటరమణ

మరక్కడా దొరకని దాసరి సుబ్రహ్మణ్యం గారి చిన్న కథలు
"బొమ్మరిల్లు" మొదటి ధారావాహిక మృత్యు లోయ ఎం కే భాషా వేసిన చక్కటి బొమ్మలతో యువ పత్రికలో వచ్చిన ఒక జానపద నవల. దాసరి వారి పాత్రలన్నీ కూడా మన చిత్రాగారి బొమ్మల్లోనే చూశాం
దాసరి పాత్రలను మనం నవలలో వడ్డాది వారి కుంచే నుంచి జాలువారినవి చూడవచ్చు


పై మూడు పుస్తకాలు హాయిగా కొని చదువుకుంటే, ఇలాంటి చక్కటి పుస్తకాలు మరిన్ని మనముందుకు వచ్చే అవకాశం ఉన్నది.

కాబట్టి, ఆసక్తి కలవారు, వివరాలకు కింది లింకు ద్వారా సమాచారం పొందవచ్చు

వివరాలు
*********************************************************************

ప్రస్తుతం, చందమామ అభిమానులందరి మధ్య జరుగుతున్న చర్చ దాసరి సుబ్రహ్మణ్యం గారు వ్రాసిన పన్నెండు చందమామల ధారావాహికలు అన్ని కూడ చిత్రా గారి బొమ్మలతో దాసరి వారి రెండో వర్ధంతి కల్లా రెండవ సంపుటి తీసుకు రాగలమా అని.

తీసుకు
రావచ్చు, కాని చందమామ యాజమాన్యం అనుమతించాలి. అనుమతించటానికి వారికున్న కోరికలేమిటో తెలియాలి. విషయం తెలిసిన తరువాత, చందమామ అభిమానులందరూ తలుచుకుంటే కార్యక్రమం తప్పకుండా విజయవంతమవుతుందని నా ప్రగాఢ నమ్మకం
.









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.