24, ఫిబ్రవరి 2011, గురువారం

ముళ్ళపూడి వారికి శ్రద్దాంజలి




"నవతరంగం" బ్లాగులో 'బాపు ఇక ఒంటరి వారు' అన్న కాప్షన్ చూడంగానే మనసు కీడు శంకించింది. ఎక్కడో ఒక చిరు ఆశ బాపు గారు తానూ తియ్యబోయే కొత్త సినిమాకి కథ సంభాషణలు మరేవరికన్నా ఇచ్చారా? (ఎలా ఇస్తారు ఒక భయంకర నిజాన్నించి తప్పించుకోవటానికి వచ్చిన వెర్రి ఆలోచన కాకపొతే). కాని, విషయం చదివి పూర్తి విషాదంలోకి కూరుకుపోయ్యాను.

తెలుగు సాహిత్యంలో ఒక శకం ముగిసింది. హాస్యాన్ని ఇంత అద్బుతంగా అందించవచ్చా అని అందరూ అపురూపంగా చూసుకునే రచనలు చేసి, హాస్య రచనకే కాదు, తెలుగు కథా రచనకే అనితర సాధ్యమైన గౌరవాన్ని తీసుకొచ్చినవారు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఆయన ఇక లేరన్న ఆలోచన చాలా బాధ కలిగిస్తున్నది.

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

నా అభిమాన రచయిత ముళ్ళపూడి వారికి శ్రద్ధాంజలి.

==================================
ముళ్ళపూడి వెంకటరమణ గారి అభిమానులను ఎవరు ఓదార్చగలరు?
==================================

బ్లాగుల్లో ఈ విషాద వార్త విని/చదివి వచ్చిన స్పందనలు
  1. "హాస్యానికి కళ్ళనిండా నీళ్ళు" (ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ బాబు-కొలను వెంకట దుర్గా ప్రసాద్)
  2. "...రమణ రచనలు చెయ్యలేదు. అది మామూలు రచయితలు చేసే పని. కొత్తపాత్రల్నీ, కొత్త నుడికారాన్నీ, కొత్త ఇతివృత్తాల్నీ, కొత్త తరహా హాస్యాన్నీ సృష్టించారు...."(శ్రీ గొల్లపూడి మారుతీరావు "మారుతీయం")
  3. "....ఆయన తెలుగు అక్షరాలతో ఆటలాడుకున్న తీరు అన్యులకు రాదు...." (మట్టె గుంట అప్పారావ్ 'సురేఖ' ప్రముఖ కార్టూనిస్ట్ 'రేఖా చిత్రం' బ్లాగ్)
  4. "ఎంతో బాధాకరమైన..... వార్త తెలుగు సాహిత్యం, హాస్యం అనాధేనేమొ .." (సుభద్ర "నవతరంగం')
  5. "నవ్వు తెలుగిల్లు ఖాళీ చేసి చిరునామా మార్చేసింది…. (తెలుగు)హాస్యానికి కాలం తీరింది" (హరిచరణప్రసాద్ 'నవతరంగం' లో)
  6. "...ఒక లెజండ్ ని కోల్పొయాం."(గోపి కిరణ్ 'నవతరంగం" లో)
  7. "ఓ తెలుగు మార్క్ ట్వైన్...." (జే సూర్య ప్రకాష్ 'నవతరంగం' లో)
  8. "...ఆత్మ బంధువే ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయారా అన్నంతగా ఏడుపొచ్చేసింది..." (ఫణిబాబు బాతాఖాని ఫణిబాబు కబుర్లు)
  9. "...బాపు బొమ్మ బుడుగు తో ఆడుకుంటుంది, పాడుకుంటుంది, కబుర్లు చెప్పుకుంటుంది??..." లక్ష్మణ కుమార్ మల్లాది 'బంతిపూలు')
  10. "....తెలుగు తెలిసిన ప్రతిఒక్కరూ కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూనే ఉన్నారే రాత్రినుండీ :-( మా ఈ దుఃఖ్ఖం ఆగేదెపుడు..."('శుకరుని కబుర్లు')
  11. "....తను సృష్టించిన పాత్రలతో.. ఎప్పుడు మన మధ్యనే వుంటారు....."(అన్నే శశిధర్ 'Sasidhar world- I Me Myself')






4 కామెంట్‌లు:

  1. ‘ఎక్కడో ఒక చిరు ఆశ. బాపు గారు తానూ తియ్యబోయే కొత్త సినిమాకి కథ సంభాషణలు మరెవరికన్నా ఇచ్చారా?’... మీ ఆలోచన చాలా ఆర్ద్రంగా ఉంది. రమణ గారి మీ ఫొటోల స్లైడ్ షో చక్కని నివాళి!

    రిప్లయితొలగించండి
  2. జాతస్యహి ధృవో మృత్యుః....
    ముళ్ళపూడి రమణగారికి శ్రద్ధాంజలి

    రిప్లయితొలగించండి
  3. తెలుగు సాహితీలోకానికి, సాహితీ ప్రియులకు తీరని లోటు

    రిప్లయితొలగించండి
  4. మహానుభావులు.ప్రత్యక్షంగా హరిసేవకోసం తరలివెళ్లారు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.