అయ్యో రమణ గారు వెళ్లిపోయారని మనమంతా బాధపడిపోతూ ఉంటే, కన్నీళ్లు ఆపుకోలేని పరిస్థితిలో ఉంటే, అక్కడ, స్వర్గంలో కోలాహలం మొదలయ్యింది. అమరావతిలో దేవతలందరూ గుమికూడి, హాస్య చక్రవర్తి ముళ్ళపూడి వెంకట రమణను ఆహ్వానించటానికి ఇంద్రుని ఆధ్వర్యంలో వచ్చేసారు.
ప్రముఖ కార్టూనిస్ట్ "బాబు" గా ప్రసిద్దికెక్కిన శ్రీ కొలను వెంకట దుర్గా ప్రసాద్ గారు పై కార్టూన్ వేసి ముళ్ళపూడి వెంకటరమణ గారికి నివాళి అర్పించారు.
"బాబు" గారు తన భావాలను వ్యక్త పరుస్తూ, ఈ కింది విధంగా తెలిపారు. ఆయన వ్రాసిన మాటలను యధాతధంగా చదవటానికి వీలుగా ఆయన స్వదస్తూరీలోనే పంపిన పి డి ఎఫ్ ను బొమ్మల కింది మార్చి ఈ కింద ఇవ్వటం జరిగింది.
"బాబు" గారి చేతి వ్రాతలో ఉన్న పై రెండు బొమ్మలను క్లిక్ చేసి చదువుకోగలరు
ముళ్ళపూడి రమణ గారు రచించి, బాపు గారు బొమ్మలు వేసిన 'రామాయణం" ముళ్ళపూడి వారి ఆటోగ్రాఫ్ తో అపురూపంగా దాచుకున్న "బాబు" గారు.
బాపురమణల పుస్తకాలు పేర్చిన షెల్ఫ్ దగ్గరకు వెళ్ళాలంటె ,అటు చూడాలంటే
రిప్లయితొలగించండిఏదో తెలియని బాధ ! నే కోలుకోవడనికి ఎన్నాళ్ళు పడుతుందో?
సురేఖ గారూ. నాదీ అదే బాధ. కాని, ముళ్ళపూడి వారి పుస్తకాలు చదివి స్వాంతన పొందుతున్నాను. ఆయన వ్రాసిన పుస్తకం ఏది చదివినా సరే ఆయన పోయారన్న బాధను కూడా మరిపించి నవ్విస్తున్నారు.
రిప్లయితొలగించండిచాలా మంచి కార్టూన్, బాబు గారు చెప్పిన మాటలు కూడా చాలా బావున్నాయి.
రిప్లయితొలగించండిచాలా ఏళ్ళ క్రితం ప్రభలోనో , పత్రికలోనో ఏటి ఒడ్డున నీటి పూలు, జీవవాహిని అన్న సీరియల్స్ వచ్చాయి. మీకేమైనా తెలుసా? ఎవరైనా ఆ సీరియల్ సేకరించి ఉంటే తెలియ చేయగలరని కోరుతున్నాను. పుస్తక రూపంలో వచ్చాయో లేదో తెలియదు. తెలుగు నుంచి తమిళంలో కి అనువాదం చేస్తున్న అనువాద రచయిత్రిగా ఈ వివరాలు తెలుసుకోవాలను కుంటున్నాను.
రిప్లయితొలగించండిGowri Kirubanandan
tkgowri@gmail.com