25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ముళ్ళపూడి గారికి శ్రీ జయదేవ్ నివాళి


ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ మెయిల్ ద్వారా పంపిన సందేశం

= = = = = = = =
నిన్న ముళ్ళపూడి బాపు గార్ల ఇంటికి వెళ్ళాము. వారింటికి వెళ్ళటానికి లోకల్ ట్రైన్ లో స్టేషన్ లో దిగాను . దండ కొనాలి అనుకున్నాను. ఐతే ఎక్కడా నాకు దండ దొరకలేదు. ఆటో అతను మైలాపూర్ (అంటే వెనక్కి) వెళ్ళాల్సిందే సార్ అని అని నన్ను తిన్నగా మైలాపూర్ కపాలేశ్వరుడి గుడి కి తీసుకు వెళ్ళాడు దండ కొని ముళ్ళపూడి వారికి నివాళి అర్పించాను.

అక్కడ దుఖం ఆవరించి ఉన్నది. ఐస్ పెట్టె లో ముళ్ళపూడి వారు చల్లగా పడుకుని ఉన్నారు. అయనకి నమస్కరించుకుని నిలబడ్డాను.పాత స్మృతులు సినిమా రీల్ లాగ కళ్ళముందు కనిపించాయి. దండ వేసి వారి పాదాల వేపుకు నడిచి మోకరిల్లి నిలబడి రెండు నిమిషాల పాటు నన్ను నేను మరిచిపోయాను .

ముళ్ళపూడి
వారికి మైలాపూర్ కపాలేశ్వరుడి మీద భక్తి . ఆ విషయం ఒకటి రెండుసార్లు చిత్రకల్పన ఆఫీసు లో మిత్రులతో మాట్లాడె సందర్భం లో విన్నాను . కపాలేశ్వరుడి గుడి గురించి తన 'కోతి కొమ్మచ్చి" లో కూడా వ్రాశారు.
వెనక్కి తిరిగి వస్తుండగా అనిపించింది, ఆ కపాలేశ్వరుడే ముళ్ళపూడి వారికి ఒక దండ పంపించాడు అని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.