12, మార్చి 2011, శనివారం

మా విగ్రహాలు మళ్ళీ పెట్టడం ఎందుకు లెండి.......

మన హైదరాబాదు చెరువు గట్టు మీద జరిగిన అనవసరపు విధ్వంసం చూసి చాలా బాధ పడ్డాను. ఏమన్నా వ్రాసే మనసు కూడ రాక అచేతనావస్థలో ఉండగా "బాబు" గా ప్రసిద్దికెక్కిన ప్రముఖ కార్టూనిస్ట్ కొలను దుర్గా ప్రసాద్ గారు తాను చెందిన ఆవేదనను ఒక మంచి కార్టూన్ గా మలచి, బ్లాగులో ప్రచురించమని పంపారు.

ఎన్ని వందల పదాలు వ్రాసినా వ్యక్తపరచలేని భావాన్ని అతి కొద్ది గీతలలో కూర్చి లక్షల మంది పడుతున్న బాధను టూకీగా ఒక చిన్న బొమ్మలో ఇమిడ్చారు కార్టూనిస్ట్ "బాబు" గారు.

విగ్రహాలు పెట్టినప్పటి నుండి కొంతమంది విగ్రహాలు అక్కడ లేవని చాలా బాధపడేవాడిని. కాని మనకు అభిమానం ఉన్నది కదా అని విగ్రహాలు పెట్టలేదని బాధపడటం కాదు, విగ్రహాలు అక్కడ పెట్టనందుకు సంతోషింవలసిన రోజు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు.


ఇలా బాధపడేవారు ఒక్క ఆంధ్ర ప్రాంతంవారే కాదు తెలంగాణా ప్రాతంవారు కూడ ఆవేదన చెందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మీడియా కబుర్లు బ్లాగులో ఆంధ్ర జ్యోతిలో శ్రీ తిగుళ్ళ కృష్ణమూర్తిగారు వ్రాసిన ఒక చక్కటి ఆలోచనాత్మక వ్యాసం పున:ప్రచురించారు కింది లింకు నొక్కి చదవండి:






















4 కామెంట్‌లు:

  1. బాబు కార్టూన్ విగ్రహ ధ్వంస రచన చేసిన వారి కి పెద్ద చెంప పెట్టు.అద్భుతం.

    రిప్లయితొలగించండి
  2. మొగిలి పువ్వు సామెత లాగా హైదరాబాదుకి ఇవ్వన్నీ అవసరమా అనిపించేట్లు చేసారు. చాలామంది తాలిబాన్లతో పోల్చారు గానీ.......కనీసం తాలిబాన్లకున్న చరిత్ర జ్ఞానం కూడా ఈ పడగొట్టిన "మూర్ఖుల సంస్థకు" లేదు. ఎందుకంటే పడ గొట్ట బడిన విగ్రహాలు తెలుగు సంస్కృతికి సంభధించినవినూ అందరివీనూ, మరియు అనేకం ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు వారివీనూ.... ఈ సంస్థ వారు తాలిబాన్లతో కూడా పోల్చదగిన వాళ్ళు కాదు. వారికున్నపాటి సాంస్కృతిక జ్ఞానం కూడా లేని మూర్ఖులు. బహుశా తెలంగానా వస్తుందని వీరికి భయం వేసి నట్లున్నది. వస్తే వీరందరూ రాజకీయ నిరుద్యోగులవుతారు కదా!!!!

    రాధాకృష్ణ,
    విజయవాడ.

    రిప్లయితొలగించండి
  3. శివరాంప్రసాద్ గారు,

    నమస్తే. విగ్రహాల కార్టూన్ మీ బ్లాగు లో వేసి స్పందించినందుకు
    చాలా కృతజ్ఞతలు. ఒక పౌరునిగా నా విధిని నిర్వహించాను.

    శుభాకాంక్షలతో,
    బాబు

    రిప్లయితొలగించండి
  4. బాబు గారు .. ఇంకో విషయం మార్చాలి మీ కార్టూన్ లో

    టాంక్ బండ్ ఆత్మల జాక్ అని ... ఎక్కడ చూసినా జాక్ లే :-)

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.