కీర్తి శేషులు శ్రీ పద్మనాభం మంచి అభిరుచి గల నిర్మాత. చక్కటి సినిమాలు తీశారు. తాను తీసిన సినిమాలన్నిటిలోనూ ఏదో ఒక వెరైటీ చూపించారు పద్మనాభం. దేవత సినిమాలో సినీ నటీమణులను వారి నిజరూపంలో వారిళ్ళ లోనే చూపిస్తే , పొట్టి ప్లీడరు సినిమాలో తానె హీరో అయ్యి, ఆ సినిమా టైటిల్స్ వేస్తున్నప్పుడే అద్భుతమైన పద్ధతిలో సినిమాలో సంగీతం సమకూర్చిన కోదండపాణిగారిని , కథ వ్రాసిన భమిడిపాటి రాధాకృష్ణ గారిని, పాటలు వ్రాసిన ఆరుద్ర, దాశరధి, కొసరాజు, అప్పలాచార్య, శ్రీ శ్రీ లను, గాయకులు శ్రీ ఘంటసాల, శ్రీనివాస్ మొదలగు వారిని, అందరినీ తాను పరిచయం చేస్తూ ప్రేక్షకులకు చూపించారు. అదొక చక్కటి ఒరవడి. కాని మళ్ళి ఎవరూ ఆ మంచి సాంప్రదాయాన్ని అనుసరించినట్టుగా కనపడదు.
పద్మనాభం గారు చేసిన ఈ ప్రయోగాన్ని ఈ కింది ఫిల్ము క్లిప్ లో చూడండి.
మంచి సమాచారం. Thank you. ఈ సినిమా DVD దొరుకుతోందాండి?
రిప్లయితొలగించండిఈ ప్రయోగం చాలా బాగుందండీ. సాంకేతిక నిపుణులను ఇలా చూపించవచ్చనే ఆలోచనే ఎంతో బాగుంది. పద్మనాభం గారి అభిరుచి అభినందనీయం. ఘంటసాల, కోదండపాణి, శ్రీశ్రీ లాంటి మహామహులను ఈ క్లిప్ ద్వారా చూడగలిగాను. మీకు కృతజ్ఞతలు!
రిప్లయితొలగించండిఅన్నట్టు- ఈ ఫిల్మ్ ఎడిటర్ కీ.శే. ఎం.ఎస్.ఎన్.మూర్తి గారు నాకు నా హైస్కూల్ రోజుల్లో తెలుసు.
ఏమిటోనండీ ఈ వీడియో కూడా నాకు ప్లే అవ్వట్లేదు. an error occured, please try againlater అని వస్తున్నాది. :(
రిప్లయితొలగించండినిజంగా కొత్త ఒరవడి ఇది. చాల వినుత్నం గ వుంది. మీకు మరి మరి ధన్యవాదాలు
రిప్లయితొలగించండివిజయ వర్ధన్, వేణు, మాణిక్యాంబ గార్లకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసౌమ్య గారూ మీకు వీడియో ప్లే చెయ్యబోతే ఎర్రర్ మెసేజీ ఎందుకు "వస్తున్నాది" నాకు తెలియటం లేదు. ఆరోజున దాదాపు వందమంది చూశారు, అందులో ముగ్గురు "చూసి" స్పందించారు .
అద్భుతం శివగారు.
రిప్లయితొలగించండిమంచి ప్రయోగం. ఇటువంటి వాటి ద్వారా అయినా అప్పటి కళాకారులను చూడడం ఎంతో ఆనందంగా ఉంది.