28, మార్చి 2011, సోమవారం

పొట్టి ప్లీడరు సినిమా - వెరైటీ టైటిల్స్

కీర్తి శేషులు శ్రీ పద్మనాభం మంచి అభిరుచి గల నిర్మాత. చక్కటి సినిమాలు తీశారు. తాను తీసిన సినిమాలన్నిటిలోనూ ఏదో ఒక వెరైటీ చూపించారు పద్మనాభం. దేవత సినిమాలో సినీ నటీమణులను వారి నిజరూపంలో వారిళ్ళ లోనే చూపిస్తే , పొట్టి ప్లీడరు సినిమాలో తానె హీరో అయ్యి, సినిమా టైటిల్స్ వేస్తున్నప్పుడే అద్భుతమైన పద్ధతిలో సినిమాలో సంగీతం సమకూర్చిన కోదండపాణిగారిని , కథ వ్రాసిన భమిడిపాటి రాధాకృష్ణ గారిని, పాటలు వ్రాసిన ఆరుద్ర, దాశరధి, కొసరాజు, అప్పలాచార్య, శ్రీ శ్రీ లను, గాయకులు శ్రీ ఘంటసాల, శ్రీనివాస్ మొదలగు వారిని, అందరినీ తాను పరిచయం చేస్తూ ప్రేక్షకులకు చూపించారు. అదొక చక్కటి ఒరవడి. కాని మళ్ళి ఎవరూ మంచి సాంప్రదాయాన్ని అనుసరించినట్టుగా కనపడదు.

పద్మనాభం గారు చేసిన ప్రయోగాన్ని కింది ఫిల్ము క్లిప్ లో చూడండి.





6 కామెంట్‌లు:

  1. మంచి సమాచారం. Thank you. ఈ సినిమా DVD దొరుకుతోందాండి?

    రిప్లయితొలగించండి
  2. ఈ ప్రయోగం చాలా బాగుందండీ. సాంకేతిక నిపుణులను ఇలా చూపించవచ్చనే ఆలోచనే ఎంతో బాగుంది. పద్మనాభం గారి అభిరుచి అభినందనీయం. ఘంటసాల, కోదండపాణి, శ్రీశ్రీ లాంటి మహామహులను ఈ క్లిప్ ద్వారా చూడగలిగాను. మీకు కృతజ్ఞతలు!
    అన్నట్టు- ఈ ఫిల్మ్ ఎడిటర్ కీ.శే. ఎం.ఎస్.ఎన్.మూర్తి గారు నాకు నా హైస్కూల్ రోజుల్లో తెలుసు.

    రిప్లయితొలగించండి
  3. ఏమిటోనండీ ఈ వీడియో కూడా నాకు ప్లే అవ్వట్లేదు. an error occured, please try againlater అని వస్తున్నాది. :(

    రిప్లయితొలగించండి
  4. నిజంగా కొత్త ఒరవడి ఇది. చాల వినుత్నం గ వుంది. మీకు మరి మరి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. విజయ వర్ధన్, వేణు, మాణిక్యాంబ గార్లకు ధన్యవాదాలు.

    సౌమ్య గారూ మీకు వీడియో ప్లే చెయ్యబోతే ఎర్రర్ మెసేజీ ఎందుకు "వస్తున్నాది" నాకు తెలియటం లేదు. ఆరోజున దాదాపు వందమంది చూశారు, అందులో ముగ్గురు "చూసి" స్పందించారు .

    రిప్లయితొలగించండి
  6. అద్భుతం శివగారు.
    మంచి ప్రయోగం. ఇటువంటి వాటి ద్వారా అయినా అప్పటి కళాకారులను చూడడం ఎంతో ఆనందంగా ఉంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.