బంగారంలో పాత బంగారానికి విలువు ఎక్కువట. తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదే పద్ధతిన పాత పాటలు కూడా అని నాకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయం .
నాకు ఆంగ్ల సంగీతంలో పాత పాటలంటే ఉన్న మక్కువ తెలిసిన నా స్నేహితుడు శ్రీ విజయ్‌కుమార్ ఈ రోజున మెయిల్ పంపాడు. ఆయన ఎప్పుడు మెయిల్ పంపినా అందులో మంచి మంచి వెబ్ సైట్ల వివరాలు ఉంటాయి (మా ఇద్దరికీ ఇష్టమైనవి). అనుకున్నట్టుగానే, అందులో ఒక సంగీత ప్రధానమైన వెబ్ సైటు వివరాలు ఉన్నాయి.
ఈ వెబ్ సైట్ లో ఆంగ్ల సంగీతం మీద అభిమానం ఉండి పాటలవివరాలు తెలిసినవారు తమ పేరు నమోదు చేసుకుని, కొన్ని పాటల సమాహారాన్ని (ఏ రకమైనాసరే) ఏర్పరచవచ్చు. ఈ కింది లింకు నొక్కి ఆ వెబ్సైటు చూడగలరు

ఈ వెబ్ సైట్లో మనకు కావలిసిన పాటలను వెతుక్కునే సౌకర్యం కూడ ఉన్నది. అలా వెతుకుతూ కొన్ని పాతపాటలను పట్టాను. అందులో ఒకటి ఈ కింద ఇస్తున్నాను. విని ఆనందించండి. అలా ప్లే చెయ్యనిస్తే ఒకదాని తరువాత మరొక పాట వస్తూ ఉంటాయి. ముదుకు తోసేస్తే రెండు పాటలకు మించి రావు.
(బొమ్మ చూసి మోసబోకండి!! నిఝంగానే పాత పాటలు కొద్దిగా ఒపికపడితే ప్రముఖ హాలీవుడ్ నటి ఆద్రీ హెప్బర్న్ పాడిన 'MOON RIVER' అన్న అద్భుతమైన పాత కూడ వినే అవకాశం ఉన్నది )
మరికొన్ని పాత పాటలూ వినండి మరి ఇందులో స్టీవీ వండర్ పాట వినే ఆవకాశం ఉన్నది. "ఆవకాశం" ఎందుకు అనాల్సి వచ్చింది?పాటలు Random గా వస్తాయి కాబట్టి!!
పై బొమ్మలో ఉన్నాయనే స్టీవీ వండర్, అమెరికాకు చెందిన, 1950 లో జన్మించిన ఒక అంధ గాయకుడు. ఇవి కాక అనేక పాత పాటల సమాహారాలు ఉన్నాయి ఈ కింది లింకు నొక్కి అవి కూడా చూడండి, ఆసక్తి ఉంటే విని ఆనందించండి.
పూర్తిగా ఇనుస్ట్రుమెంటల్ సంగీత సమాహారాలు ఈ కింది లింకు సహాయంతో చూసి వినవచ్చు.
పూర్తిగా ఇనుస్ట్రుమెంటల్ సంగీత సమాహారాలు ఈ కింది లింకు సహాయంతో చూసి వినవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.