24, ఏప్రిల్ 2011, ఆదివారం

ఏ క్షణానికి ఏమి జరుగునో...

కీర్తి శేషులు శ్రీ బి రామకృష్ణ

వారం పైగా బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళటమే కుదరలేదు. నిన్న వెళ్ళీ వెళ్ళగానే దుర్వార్త తెలిసింది. లైబ్రరీకి వచ్చే అందరు సభ్యులనూ నవ్వుతూ పలకరిస్తూ, కావలిసిన పుస్తకాలు, మాగజైన్లు, డివిడిలు అందిస్తూ స్నేహపాత్రంగా ఉంటూ ఉన్న సహాయక లైబ్రేరియన్ శ్రీ బి రామకృష్ణ ఏప్రిల్ 12 తారీకున హటాత్తుగా గుండెపోటుతో మరణించారని తెలిసింది. దాదాపు వారానికి ఒకటి రెండుసార్లు కలుసుకునే మనిషి ఇలా ఐపోయారని తెలిసి కొంతసేపు మాటరాలేదు. శ్రీరామనవమి రోజున పొద్దున్నే పూజచేసుకుని కూచుని ఉండగా ఛాతీలో నెప్పి రావటం హాస్పిటల్ తీసుకు వెళ్ళేలోపల అంతా అయిపోవటం జరిగిపోయిందట.

శ్రీ రామకృష్ణ బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీలో 1978 నుండి తన సేవలను అందిస్తూ ఉన్నారని తెలుస్తున్నది. అంటే తన ఇరవై ఒకటో సంవత్సరపు వయస్సు నుండి ఆయనకు అదే లోకం, ఒక్కటే ఉద్యోగం. (మా) పాత తరానికి చెందిన మనిషి శ్రీ రామకృష్ణ. ఏదో ఉద్యోగ ధర్మంగాకాకుండా వచ్చిన అందరితో హాయిగా మాట్లాడుతూ ఎప్పుడూ పుస్తకాలు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉంచుతూ వచ్చి అడిగిన వారికి అవి ఉండే షెల్పులు చూపిస్తూ బిజీ బిజీగా ఉండేవారు.

శ్రీ రామకృష్ణ ఆత్మకు సదా శాంతి కలగాలని, ఆయన లేని లోటు తట్టుకునే శక్తి ఆయన కుటుంబానికి భగవంతుడు ఇవ్వాలని బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ ఉద్యోగులు, లైబ్రరీ సభ్యులతోబాటుగా ప్రార్ధిస్తున్నాను.












2 కామెంట్‌లు:

  1. మీరు రామకృష్ణను గుర్తు చేసుకొని రాయడం నాకు నచ్చింది . చెడును విమర్శించినప్పుడు మంచిని తప్పని సరిగా గుర్తొ చేసుకోవాలి. ఈ రోజు కొన్ని బ్లాగ్స్ లో సత్యసాయి బాబా గురించి కామెంట్స్ చుస్తే చనిపోయిన రోజు కూడా వదిలి పెట్టార అని భాద వేసింది. అప్పుడు మీ బ్లాగ్ చూసాను

    రిప్లయితొలగించండి
  2. Librarians are blessed people :-)
    May Ramakrishna gari's soul rest in peace.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.