25, ఏప్రిల్ 2011, సోమవారం

బిత్తరపోయిన టార్జాన్ గొణుగుడు

మనకు తెలుసు టార్జాన్ నేల మీద నడవడు. అడివిలో చెట్ల మీదే ఉంటాడు. ఒక చోటు నుంచి మరొక చోటుకు చెట్ల ఊడలు, తీగలు పట్టుకు ఊగుతూ, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎన్ని సినిమాలు, కామిక్ స్ట్రిప్పులు చూడలేదు! కాని అంతటి టార్జాన్ కూడ తన ప్రయాణానికి అంతరాయం ఏర్పడి కంగారుపడిపోయి, ఏమి చెయ్యాలో తెలియని ప్రమాద పరిస్థితిలో పడిపోయాడట . చూడండి ఒక చిన్నారి గీసిన చక్కటి కార్టూన్.

బ్రిటిష్ కౌన్సిల్ వారు పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లల మధ్య నిర్వహించిన కార్టూన్ పోటీలో ముంబాయికి చెందిన చిరంజీవి షేర్విన్ పటేల్ గీసిన చక్కటి అర్ధవంతమైన కార్టూన్ ఇది.

సభ్య
ప్రపంచంగా పిలవబడుతున్న ప్రస్తుతపు ప్రజలు, తమకు కావలిసిన ఉపకరణాల కోసం, తాత్కాలిక మైన సుఖాలకు బాగా మరిగి అడవులను ఎలా కొట్టేస్తున్నారో చక్కగా చూపిస్తున్నది కార్టూన్. అడివిలోనే ఉంటూ ప్రకృతి ఒడిలో నివసించే టార్జాన్ కు మరిక ముందుకు వెళ్ళటానికి చెట్లే లేని పరిస్థితి కల్పిస్తున్నాం మనం అందరం కలిసి.

టార్జాన్
బిత్తర పోక ఏమి చేస్తాడు. నాగరికులం అనుకునే మనం అందరి వంక టార్జాన్ ఎలా చూస్తాడో కదా! ప్రపంచం గురించి టార్జాన్ ఏమనుకుంటున్నాడో మరి?

పిల్లల సృజనాత్మతకు మురిసిపోవటం తప్ప మరేమీ చెయ్యలేరా మీరు అని ఘట్టిగా టార్జాన్ గొణుగుతున్నట్టుగా వినిపించటంలేదూ ??!!









2 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.