వడ్డాది పాపయ్య గారి చిత్ర కళా వైభవం గురించి ఎంత వ్రాసినా తక్కువే! పై బొమ్మలో వాలి సంహార ఘట్టాన్నికళ్ళకు కట్టినట్టు ప్రతి పాత్ర హావభావాలతో ఎంత చక్కగా చిత్రీకరించి బాలలకు మళ్ళీ చెప్పోస్తే పెద్దలకే ఎక్కువగా ఆ సంఘటన చక్కగా అర్ధం అయ్యేట్టుగా తన కుంచే నుండి రంగు రంగులతో చక్కగా ఆవిష్కరించారు. చందమామ బొమ్మలలో ఉన్న గొప్పతనమే అది, అలా చూసి కథను అర్ధం చేసుకోవచ్చు.
హావభావాలు
రాముడు : అధర్మ యుద్ధం చేసి కొట్టినందుకు వాలి నిందిస్తుంటే నోట మాట రాక నివ్వెరపోతూ
వాలి: తన చరమ దశలో తగిలిన దెబ్బకు ప్రాణ శక్తి వెళ్లిపొతుండగా కూడ తన పౌరుషాన్ని మాటల బాణాలలో కూరుస్తూ
సుగ్రీవుడు: తన సోదరుని చివరి క్షణాలు చూసి శోకిస్తూ, రాముని సహాయంతో తన అన్ననే చంపించటానికి ఒప్పందం చేసుకున్నా, తాను ఆశించినది జరిగినా అన్న మరణం తెచ్చిన దు:ఖ్ఖంతో.
లక్ష్మణ-హనుమలు: బాణాల కంటే వాడైనా వాలి మాటలు వింటూ ఆలోచనా ముద్రలో.

రామునికి పాదుకలు వేసారేమిటి?ఈ బొమ్మలో..
రిప్లయితొలగించండి@ astrojoyd
రిప్లయితొలగించండిమీ ఉద్దేశ్యంలో రాముడు అరణ్యవాసం చేసినన్నాళ్ళూ చెప్పులు లేకుండా తిరిగాడనా? భరతుడికి తన పాదుకలు ఇచ్చేస్తే, రాముడికి మరొక చెప్పులే ఉండవనా ఏమిటి మీరు అనుకునేది.
శివ గారు,అవును అయన పాదరక్షలు లేకుండానే నడిచారు,ఒకవేళ మీరు వూహించిన విధంగా అవి ఉన్నాయన్కుంటే,అవి పావుకోళ్లు మాత్రమే అయివుండాలి,కాని చిత్రంలో షోలాపూర్ చెప్పులున్నాట్టుగా వేసారు మరి
రిప్లయితొలగించండిపాపం వడ్డాది వారు మీరు ఇవ్వాళ వచ్చి ఇలా వంకలు పెడతారని తెలియక వేసి ఉంటారు ఆ బొమ్మని. వారినే అడగాలి అలా ఎందుకు వేశారో.
రిప్లయితొలగించండిబ్లాగుల్లో పడి ఊరికే వాదోపవాదనలు చేస్తూ, ఆ వ్యాసం వ్రాసిన లక్ష్యం, పరిధి మర్చిపోతున్నాం. తెలుగు చందమామ అభిమానుల బ్లాగు ఇది. చందమామకు వడ్డాది వారు అద్భుత కళాకారుడు. నేను వ్రాసినది వడ్డాది పాపయ్య గారి చిత్రకళా వైభవం నాకు నచ్చి వ్రాశాను. రాముడు వేసిన బాణం ఏ లోహంతో చేసి ఉంటారు, ధనస్సుకు ఉండే నారి ఏ రకం తాడు అయ్యి ఉంటుది, అది తాడా లేక జంతు సంబంధమైనదా వంటి పరిశోధనలు చేసి మీరు వ్యాసం వ్రాయదల్చుకుంటె, హాయిగా వ్రాయండి. అటువంటి వ్యాసాలు ఇష్టపడేవారు చదువుతారు.