చిత్రకారులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిత్రకారులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2011, శనివారం

దుష్ట చతుష్టయం

పాండవులను లక్క ఇంట ఉంచి, ఆ ఇంటిని అగ్నికి ఆహుతి చేసి, వారిని తుదముట్టించాలని, పథక రచన చేస్తున్న దుష్ట చతుష్టయం. వపా గారి కుంచే నుండి జాలువారిన మరొక చక్కటి చిత్రం. చందమామలో మహాభారతం ధారావాహిక వచ్చే రోజుల్లో, అట్ట చివరి బొమ్మగా వచ్చింది ఈ బొమ్మ.

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

పంచతంత్ర కథకు వపా బొమ్మ

ఇదొక పంచతంత్ర కథ. నాకు గుర్తున్నంత వరకూ వ్రాస్తాను. ఒక చింపాంజీ ట అన్ని విద్యలూ నేర్చి అచ్చం మనిషిలా ఉండటం నేర్చుకుని ఆ దేశ రాజుగారి దగ్గరకు వెళ్లి తన విద్యలన్నీ చూపిందట . ఆయన ఈ చింపాంజీ విద్యలు అన్ని చూసి మురిసిపోయి, తన అంగరక్షకునిగా నియమించారుట. ఒక రోజున రాజుగారు హాయిగా శయనిస్తూ ఉండగా, ఈ చింపాంజీ అంగరక్షకుడు కాపలా కాస్తున్నాడు. కాసేపటికి ఒక కీటకం రాజుగారి మీద వాలింది. చింపాంజీ గారు ఆ కీటకాన్ని తరమబోయ్యారు, ఆ కీటకం అక్కడ నుంచి కదలలేదు. చింపాంజీ అంగరక్షకుడు ఆ కీటకాన్ని తరమటమే తన కర్తవ్యం అనుకుని కత్తితో ఒక్కటి వేశాడు. కీటకం తప్పించుకుని ఎగిరిపోయింది, కాని పాపం రాజుగారు కత్తి వేటుకు మరణించాడు.

మనిషికి ఎన్నెన్ని విద్యలు తెలిసినా "బుద్ధి" లేకపోతె విచక్షణ ఉండదు. విచక్షణ తెలియని వారికి ఎన్ని విద్యలున్నా వృధాయే కాక ప్రమాదం కూడా!

పాపయ్య గారు చింపాంజీ ముఖంలో చక్కటి భావాలను తన కుంచెతో స్పురింపచేసారు.

వాలీ సంహారం

వడ్డాది పాపయ్య గారి చిత్ర కళా వైభవం గురించి ఎంత వ్రాసినా తక్కువే! పై బొమ్మలో వాలి సంహార ఘట్టాన్నికళ్ళకు కట్టినట్టు ప్రతి పాత్ర హావభావాలతో ఎంత చక్కగా చిత్రీకరించి బాలలకు మళ్ళీ చెప్పోస్తే పెద్దలకే ఎక్కువగా ఆ సంఘటన చక్కగా అర్ధం అయ్యేట్టుగా తన కుంచే నుండి రంగు రంగులతో చక్కగా ఆవిష్కరించారు. చందమామ బొమ్మలలో ఉన్న గొప్పతనమే అది, అలా చూసి కథను అర్ధం చేసుకోవచ్చు.

హావభావాలు

రాముడు : అధర్మ యుద్ధం చేసి కొట్టినందుకు వాలి నిందిస్తుంటే నోట మాట రాక నివ్వెరపోతూ

వాలి: తన చరమ దశలో తగిలిన దెబ్బకు ప్రాణ శక్తి వెళ్లిపొతుండగా కూడ తన పౌరుషాన్ని మాటల బాణాలలో కూరుస్తూ

సుగ్రీవుడు: తన సోదరుని చివరి క్షణాలు చూసి శోకిస్తూ
, రాముని సహాయంతో తన అన్ననే చంపించటానికి ఒప్పందం చేసుకున్నా, తాను ఆశించినది జరిగినా అన్న మరణం తెచ్చిన దు:ఖ్ఖంతో.

లక్ష్మణ-హనుమలు: బాణాల కంటే వాడైనా వాలి మాటలు వింటూ ఆలోచనా ముద్రలో.














21, ఏప్రిల్ 2011, గురువారం

పురాణ బొమ్మలే కాదు!!

అద్భుత చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు ఒక్క పురాణ బొమ్మలు వెయ్యటానికే పరిమితం అవ్వలేదు సందర్భోచితంగా చందమామ ముఖ చిత్రాలుగా అప్పటి దేశ సమస్యలను పిల్లలకు తెలిసేట్టుగా చక్కగా చిత్రీకరించారు.

1962
దీపావళికి పాపయ్య గారు వేసిన చిత్రం చూడండి. అప్పుడే కమ్యూనిస్ట్ చైనా మన దేశం మీదకు దురాక్రమణ చేసింది. ఆ విషయాన్ని పరోక్షంగా చూపిస్తూ చిన్న పిల్ల వాణ్ని సైనిక దుస్తుల్లో చూపి దేశానికి సైనిక పాటవం ఎంతో అవసరం అని పిల్లలకు స్పురించేలా చక్కగా వేశారు.


అలాగే
జనవరి 1963 సంచిక చివరి పుట చిత్రంగా అద్భుతమైన బొమ్మ వేశారు. బారతీయుల దేశ భక్తి చూసి బిత్తరబోతున్న చైనాను కాళ్ళ జెర్రి లాగ , డ్రాగన్ లాగ వేశారు. అప్పట్లో ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వటం కూడా చక్కగా చూపారు ఆ బొమ్మలో, చూడండి.




10, ఏప్రిల్ 2011, ఆదివారం

చిత్రా అద్భుత చిత్రీకరణ

శ్రీ చిత్రా
చందమామ అంటేనే బొమ్మలకు ప్రసిద్ది. కథ ఏదైనా సరే (కథలు గొప్పవి కావని కాదు!) బొమ్మల ఆకర్షణలో ఆ కథ చదవకుండానే అర్ధమయ్యే రీతిలో ఉండేవి బొమ్మలు అప్పట్లో. ముఖ్యంగా "చిత్రా" గారి బొమ్మలు. పాతాళ దుర్గం అని ఒక ధారావాహిక 1960 లలో వచ్చింది. ఆ ధారావాహికలోది , ఒక పూర్తి పుట చిత్రం ఈ కింద ఇస్తున్నాను. ఇది పాతాళ దుర్గం లోపలి బొమ్మ. చూడండి చిత్రాగారు ఎంత చిత్రంగా చిత్రించారో!! పాతాళంలో ఉన్నవాళ్ళకి లైటు ఎలా అనుకునే పిల్లలకి చక్కగా తెలిసేట్టుగా అక్కడక్కడా ఆ అంతర్ గుహా నిర్మాణం లో ఉన్న రంధ్రాల నుండి "స్కై లైట్" లాగ సూర్య కిరణాలుఎలా ప్రసరిస్తున్నాయో. చక్కటి "Light & Shade effect" బొమ్మ పరిపూర్ణంగాఉన్నది. స్వతహాగా చక్కటి ఫోటోగ్రాఫర్ ఐన చిత్రాగారు, తన బొమ్మల్ని కూడా ఫోటో తీసినట్టు వేసేవారు. ఇకచూడండి ఆ అద్భుత చిత్రం.