ఆకాశవాణి మన జీవితాల్లో ఒక బాగంగా ఉన్న రోజుల్లో, ప్రతి పండుగకూ ప్రత్యెక కార్యక్రమాలు ఉండేవి. వాటన్నిటికీ తలమానికమైనది భద్రాచలం నుండి శ్రీరామనవమికి ఆకాశవాణి వారి చేసే ప్రత్యక్షప్రసారం.
ఈ ప్రత్యక్ష ప్రసారాలు వింటూ ఉంటే భద్రాచలం లో జరిగే సీతా రామ కళ్యాణం చూస్తున్నట్టేఉండేది. ఇప్పటి టి వి ప్రత్యక్ష ప్రసారం కూడ శబ్ద ప్రధానమైన ప్రత్యక్ష ప్రారాల ముందు తీసికట్టే. ఆనాటి ప్రత్యక్ష ప్రసారాల్లో ముఖ్యంగా జమ్మలమడక మాధవరాయశర్మ గారు నిజంగా రాముడు, సీత అక్కడ ఉన్నట్టుగా తాదాత్మ్యం పొంది అద్భుతంగా ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానం చెప్పేవారు. ఆ మహా వ్యక్తి ఫోటో కోసం అంత గాలించినా దొరకలేదు. ఎవరిదగ్గరన్న ఉంటే పంపితే ఎంతో సంతోషం.

ఇప్పటికీ ఈనాటి ఆకాశవాణి వారు ఈ ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగిస్తున్నారా?? నాకైతే తెలియదు !!
పైన ఒక రికార్డింగు 1986 లో ఏ మహానుభావుడు రికార్డింగు చేసిపెట్టారో కాని ఆ మహానుభావుడుకి శతకోటి వందనాలతో అందిస్తున్నాను.
ఈ రికార్డింగు కు సంబంధించిన ఫైలు శ్రీ శ్యాం నారాయణ అందించారు, వారికి ప్రత్యేక అభినందనలు .

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
===========================================

రాముడి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటూ, వెలుగులోకి వచ్చిన రాజకీయ పక్షం పరిపాలనలో ఉన్న కర్నాటక రాష్ట్రంలో శ్రీరామనవమి పండుగ కాదట, ఇదీ ఈ రాజకీయ పక్షానికి ఉన్న "రామ భక్తి "!
===========================================
===========================================
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.