ఆకాశవాణి మన జీవితాల్లో ఒక బాగంగా ఉన్న రోజుల్లో, ప్రతి పండుగకూ ప్రత్యెక కార్యక్రమాలు ఉండేవి. వాటన్నిటికీ తలమానికమైనది భద్రాచలం నుండి శ్రీరామనవమికి ఆకాశవాణి వారి చేసే ప్రత్యక్షప్రసారం.
ఈ ప్రత్యక్ష ప్రసారాలు వింటూ ఉంటే భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణం చూస్తున్నట్టే ఉండేది. ఇప్పటి టి వి ప్రత్యక్ష ప్రసారం కూడ శబ్ద ప్రధానమైన ఆ ప్రత్యక్ష ప్రసారాల ముందు తీసికట్టే.
ఆనాటి ప్రత్యక్ష ప్రసారాల్లో ముఖ్యంగా జమ్మలమడక మాధవరాయశర్మ గారు నిజంగా రాముడు, సీత అక్కడ ఉన్నట్టుగా తాదాత్మ్యం పొంది అద్భుతంగా ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానం చెప్పేవారు. ఆ మహా వ్యక్తి ఫోటో కోసం అంత గాలించినా దొరకలేదు. ఎవరిదగ్గరన్న ఉంటే పంపితే ఎంతో సంతోషం.

పైన ఒక రికార్డింగు 1986 లో ఏ మహానుభావుడు రికార్డింగు చేసిపెట్టారో కాని ఆ మహానుభావుడుకి శతకోటి వందనాలతో అందిస్తున్నాను.
ఈ రికార్డింగు కు సంబంధించిన ఫైలు శ్రీ శ్యాం నారాయణ అందించారు, వారికి ప్రత్యేక అభినందనలు .
ఈ రికార్డింగు కు సంబంధించిన ఫైలు శ్రీ శ్యాం నారాయణ అందించారు, వారికి ప్రత్యేక అభినందనలు .
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
===========================================
===========================================
రాముడి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటూ, వెలుగులోకి వచ్చిన రాజకీయ పక్షం పరిపాలనలో ఉన్న కర్నాటక రాష్ట్రంలో శ్రీరామనవమి పండుగ కాదట, ఇదీ ఈ రాజకీయ పక్షానికి ఉన్న "రామ భక్తి! "
===========================================
===========================================
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. "వింటూ ఉంటే.....చూస్తున్నట్టే ఉండేది" నిజంగా అద్భుతం. ఆకాశవాణి లో ముఖ్యంగా విజయవాడ కేంద్రం నుండి వచ్చే కార్య క్రమాలు ఇప్పటికీ చూసిన మాయ లోనే వున్నాము. వారికి కార్యక్రమాల పట్ల అంత డెడికేషన్ వుండేది. ప్రత్యక్ష ప్రసారం చిన్న బ్రేక్ లేకుండా వచ్చేది. భద్రాచలం వెళ్ళినప్పటికీ రేడియోలో విన్న అనుభూతి కలగలేదు.
రిప్లయితొలగించండిఈ రోజు కళ్ళకి కనపడేట్లు మన పోటీ టీ వీ వారు చూపిస్తున్నప్పటికీ అది మనస్సుకి చేరడం లేదు. బహుశా వీరి కృత్రిమ భాష, వేష ధారణ వల్లనో.....లేక వెంట వెంటనే గొడ్డలి పెట్టు లాగా "ఇప్పుడొక బ్రేక్" అని యజ్ఞం చేస్తుంటే రాక్షసులు దాడి చెసినట్లు గా వచ్చే ప్రకటనల వల్లనో.. ...
ఇక పండగ సెలవు గురుంచి అంటారా చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ము కొవటం రాజకీ..... ఎందుకులే పండగపూట....... రాముడిని తలుచుకుందాము రాక్షసులని కాదు!!!
రాధాకృష్ణ,
విజయవాడ.