5, మే 2011, గురువారం

ఒక అద్భుత వెబ్ సైట్ - మహానటి సావిత్రి వెండి తెర సామ్రాజ్ఞి

తెలుగు చిత్ర ప్రపంచంలో నటీమణీ తెచ్చుకోలేని పేరు "సావిత్రి" తెచ్చుకున్నారు. తన నటనతో ఎందరో ఔత్సాహిక నటీ నటులకు స్ఫూర్తినిచ్చారు. తెలుగునాట సావిత్రి అభిమాని కాని వారెవ్వరు!

ఈ మధ్యనే అలనాటి నటి సావిత్రి స్మృత్యర్ధం తపాలా వారు ఒక చక్కటి స్టాంపు విడుదల చేశారు. ఆస్టాంపును తాను వ్రాసిన ఉత్తరం ఉంచిన కవరుకు అంటించిన ఒక అభిమాని తన ఉత్తరంలో వ్రాసినవిశేషం చూడండి

"మహారాజశ్రీ…. గారికి నమస్కరం ఇక్కడంతా క్షేమం. మీ క్షేమ సమాచారం తెలుపగలరు. మహానటి సావిత్రి పేరు మీద ఓ తపాలా బిళ్ల విడుదలైంది. ఈ సారి నుంచి ఉత్తరం చించేటప్పుడు స్టాంపు జాగ్రత్త!"

భవదీయుడు….

ఉత్తరం పోస్టు చేసాక పోస్టాఫీసులో సిబ్బందికి వచ్చిన మహా కష్టం ఒకసారి పరికించండి:

"పోస్టు మాస్టారు బాబాయిగారికి పెద్దచిక్కే వచ్చిపడింది. తపాలా ముద్రేసి, అందాల చందమామ మొహానికి మసి పూయడానికేమో మనసొప్పుకోదు. ముద్రలేకుండా బట్వాడా చేద్దామంటే తపాలశాఖ ఒప్పుకోదు. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా అన్నంత డైలమా.

మాస్టారి కష్టం చూసి, ఏలోకాల్లోనో ఉన్న ( ఏ లోకాలో ఏమిటి స్వర్గమే, దేవత లుండేది అక్కడేగా) మహానటి సావిత్రి నవ్వుకుంటూ ఉంటుంది. ‘’ మాయాబజార్ లో లక్ష్మణకుమారుడి అమాయకత్వాన్ని చూసి నవ్వే మాయా శశిరేఖలా

సావిత్రి గురించి చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదు. చెప్పాల్సిందంతా చెప్పేశారు. రాసుకోడానికి ఏమీ మిగల్లేదు రాయాల్సిందంతా రాసేశారు. అయినా ఊరుకుంటామా, అందులోనూ సావిత్రి పేరు మీద స్టాంపు విడుదల చేస్తున్నారాయె."

పైన కోట్స్ లో ఉన్న మాటలు ఏవీ నావి కావు. ఒక చక్కటి వెబ్ సైటులోంచి తస్కరించి ఇక్కడ వ్రాసినవి.

మనకు తెలిసిన నటి సావిత్రి గురించిన అనేక విశేషాలు, ఆడియోలు, వీడియోలు అన్ని కలిపి ఒక్క చోటనే దొరికితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదూ! సరిగ్గా అటువంటి వెబ్ సైటు ఈ రోజు నాకు దర్శనమిచ్చింది. అందులో ఎన్నెన్ని విశేషాలు ఒక్కటా రెండా....

  • సత్తెనపల్లిలోసావిత్రి విగ్రహం
  • సావిత్రి బాల్యం నుండి నిర్యాణం వరకూ ఎన్నెన్నో ఫోటోలు
  • సావిత్రి నిర్వహించిన జనరంజని ఆడియో, ఆవిడతో ఇంటర్వ్యూ ఆడియో
  • మరెన్నో వీడియోలు
  • ఆవిడ గురించి వ్రాసిన పుస్తక వివరాలు
  • ఎప్పుడో పాఠకులకు ఇచ్చిన సమాధానాలు
  • సావిత్రి చేతి వ్రాత
ఇలా ఎన్నో ఉన్నాయి
నిన్ననే ఒక ఆలోచన వచ్చింది సావిత్రి గళంలో ప్రత్యెక జనరంజని వింటూ ఆవిడ ఫోటోలను చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ఆ విధంగా ఒక ప్రత్యెక స్లైడ్ షో చేద్దామనిపించి, ఫోటోల కోసం వెబ్ లో గాలిస్తున్నాను. ఆ గాలింపులో సావిత్రి ఫోటోల బంగారు గని దొరికింది. దొరికిందే కదా అని మన దగ్గరే ఉంచుకుంటే ప్రయోజనం ఏమున్నది! అందరికీ తెలియాలి. అందుకే నా బ్లాగులో వివరాల ప్రచురణ.
అద్భుత వెబ్ సైటు చూడాలని ఉన్నదా. ఆలశ్యం లేకుండా ఈ కింది లంకె నొక్కండి

మహానటి సావిత్రి వెండి తెర సామ్రాజ్ఞి(క్లిక్ హియర్)




.

6 కామెంట్‌లు:

  1. ఉదయాన్నే నాకు విందు భొజనం పెట్టారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. మహానటి సావిత్రి – వెండితెర సామ్రజ్ఞి
    రచన – పల్లవి పుస్తకం చదివారా? లేకుంటే మీకు పంపిస్తాను.

    రిప్లయితొలగించండి
  3. మహానటి సావిత్ర్రి గారి గురించి మంచి విశేషాలను చెప్పినందుకు
    సంతోషమండి. ప్రసిద్ధ రచయిత భమిడిపాటి రామగోపాలం (భరాగో)
    గారిని ఒక సారి వైజాగ్ లో కలసినప్పుడు ఆయన అన్న మాటలు
    ఆ మహానుభావుడు ఈనాడు మన మధ్య లేక పోయినా గుర్తుకు
    వచ్చి మీతో పంచుకుంటున్నాను. ఆయన ఇలా అన్నారు. "ఆనాడు
    సావిత్రిని తెరపై చూసినప్పుడు ప్రేక్షకుడికి ఇలాటి అక్కో, చెల్లో, భార్యో
    ఉంటే బాగుండునని పించేది. మరిప్పుటి తారలని చూస్తే అలాటి తలపు
    వస్తుందా?!" ఆయన మాటలు అక్షర సత్యాలు. అలాటి తారలు ఇప్పుడు
    ఏరి?!

    రిప్లయితొలగించండి
  4. wow, అద్భుతమండీ...చాలా మంచి సైట్ గురించి తెలియజేసారు...మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. 46 ఏళ్ళకే ఆకాశంలొ తార ఐపోయిన సావిత్రిని తలచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. ఆవిడకు పునర్జన్మ లేదనుకోవాలి.వుంటే మరో సావిత్రి ఈపాటికి వచ్చివుండేదికదా!

    రిప్లయితొలగించండి
  6. ఒక అందమైన అద్భుతమైన అప్సర ను బ్రహ్మ దేవుడు దేవలోకము కోసమై సృష్టించి , ఆఖరు క్షణాన ఎందుకో ఇంద్రునిపై కోపించి , ఆమెను భూలోకానికి పంపితే --ఆమె ' సావిత్రి ' అయింది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.