రావు బాల సరస్వతి గారు పాడి పాటల్లోకెల్లా ఈ పాట అంటే నాకెంతో మక్కువ. "రాజి నా ప్రాణం" అనే సినిమా 1954 లో వచ్చింది. ఆ సినిమాలో "మల్లె పూలు మల్లె పూలు" అనే ఈ పాట చాలా "హాంటింగ్" గా ఉండి అనేక సార్లు వింటూ ఉంటాను. ఈ పాటకు సాహిత్యం దేవులపల్లి వారు, సంగీతం ఎస్ హనుమంతరావు గారు.
ఈ పాట నా దగ్గర ఎప్పటివో పాత కాసేట్లల్లో ఉన్నది అప్పుడప్పుడూ తీసి వింటూ ఉండే వాణ్ని. ఆ మధ్య హైదరాబాడు వెళ్ళినప్పుడు మన శ్యాంనారాయణ(క్లిక్ చెయ్యండి) గారు ఈ పాట అదేదో స్పానిష్ పాటకు కాపీ అని చెప్పి ఆ స్పానిష్ పాట కూడా ఇచ్చారు.
నిజమే! ఆ స్పానిష్ పాట అచ్చు మన తెలుగు పాట ట్యూన్ లోనే ఉన్నది. ఎవరిని ఎవరు కాపీ కొట్టినట్టు! ఏది ఏమైనా, రెండూ బాగానే ఉన్నాయి అని మా తమ్ముడు రాధాకృష్ణ రెండు పాటలూ పంపాను . అతను ఈ రెండూ కలిపి మిక్స్ చేసి పంపాడు.
ఈ కింద రెండు పాటలూ ఇస్తున్నాను, విని చూడండి. నాకైతే మన తెలుగులో బాల సరస్వతి గారు పాడిన పాటే అద్భుతం!

రాజి నా ప్రాణం సినిమాలో బాల సరస్వతి గారు పాడిన పాట
స్పానిష్ పాటతో పాటుగా తెలుగు పాటను మిక్స్ చేసినది వినండి

ayya baboi...
రిప్లయితొలగించండిI met syam garu in hyderabad. I was telling him some songs and later realized that I was talking to a legend and am in nursery school.
He also told about you on that day. Nice meeting u sir through internet.
Cheers,
Bhanu