10, మే 2011, మంగళవారం

శ్రీ విశ్వనాథ వారి అరుదైన చిత్రాలు - పద్య పఠనం

ఎందరో మహామహుల గురించి 1960 దశకంలో వెలువడిన వ్యాస సంకలనం. అందరూ తమ తమ గ్రంధాలయాల్లోతప్పనిసరిగా ఉంచుకోవాల్సిన పుస్తకం
ఎంతో అరుదైన, అపురూపమైన ఫోటోలను తీసిన శ్రీ నీలంరాజు మురళీధర్ గారు. సాహిత్య ఉద్దండులను ఎంతో స్వభావ సిద్ధంగా ఫోటోలు తీసిన మురళీధర్ గారు అభినందనీయులు


విశ్వనాథ వారు కూరలు తరగడం చూశారా!
********************************
రామాయణ కల్పవృక్ష సృష్టికర్త, విష్ణు శర్మకు ఆంగ్లం నేర్పిన గురువుగారు నశ్యం
పీల్చటం!!

*********************************************************

చిత్రంగా లేవూ ఈ విశేషాలు!! అవును చిత్రమే! నేను ఎన్నడూ చూడని ఫోటోలు అవ్వి. ఇటువంటి అద్భుత చిత్రాలను మనకు అందించిన ఫోటో గ్రాఫర్ శ్రీ నీలంరాజు మురళీధర్ గారు .

మనకు
ఎంతో ప్రీతి పాత్రమైన అభిమాన రచయితల గురించి ఎంత తెలుసుకున్నా మరింత తెలుసుకోవాలన్న కుతూహలం బాగా ఉంటుంది. అలాగే వారి ఫోటోలు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ఫోటోలు మనం వెబ్ ప్రపంచంలో అనేకం చూసి ఉంటాము.

కాని నాకు మధ్యనే శ్రీ తిరుమల రామచంద్రగారి రచనలో, శ్రీ నీలంరాజు మురళీధర్ గారి ఛాయా చిత్రాలతో వెలువడిన "మరపురాని మనీషులు" చదివే అదృష్టం కలిగింది (కర్టెసీ విజయ్ వర్ధన్ ). పుస్తకంలో ఉన్న శ్రీ విశ్వనాథ వారి అరుదైన చిత్రాలు మీ కోసం.

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు కత్తిపీట మీద కూచుని కూర తరుగుతున్న దృశ్యం. కింద కూడ అదే దృశ్యం మరొక కోణం నుండి
నశ్యం పీలుస్తున్న కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు
విధమైన భేషజం లేకుండా నీలరాజు మురళీధర్ గారు అడిగిన భంగిమలను ఇచ్చి మనకు తెలియని తన పార్శ్వాన్ని చూడనిచ్చిన విశ్వనాథ వారి మంచితనం ముదావహం.

హైదరాబాదు నివాసి శ్రీ శ్యాంనారాయణ గారు తన దగ్గరున్న అపురూప సంపద నుండి ఒక చక్కటి పద్య పఠనం రికార్డు డిజిటైస్ చేసి పంపారు. పద్య పఠనం చేసినది మరెవరో కాదు, శ్రీ స్థానం నరసింహా రావుగారు. అలనాడు స్త్రీ వేషాలు అద్భుతంగా పోషించి పేరు తెచ్చుకున్న వారు. ఈయన గురించి కూడ "మరపురాని మనీషులు" పుస్తకంలో ఒక వ్యాసం ఫొటోలతో బాటుగా ఉన్నది. ఆయన పఠనం చేసినది శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి నర్తనశాల నాటకంలోని పద్యం, సైరంధ్రి పాడినది. పఠనం మీకోసం కిందనే.



శ్రీ స్థానం నరసింహారావు గారు
మన శ్యాం నారాయణ గారు మరొక చక్కటి లింకు పంపారు. ఆ లింకు ఆచార్య తాడేపల్లి పతంజలి గారి స్వంత వెబ్సైటుకు సంబందించినది . అందులో వారు చేసిన సాహిత్య ప్రసంగాలు కూడ ఉన్నాయి. ఆ సాహిత్య ప్రసంగాలు వరంగల్లులో చేసినవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన రామాయణ కల్పవృక్షం గురించినవి. ఈ కింది లింకు నొక్కి ఆ ప్రసంగాలు వినవచ్చు.

ప్రసంగం చేస్తూ, మధ్యలో తాడేపల్లి వారు శ్రీ విశ్వనాథ గురించిన ఒక విషయం చెప్పారు. అదేమిటో ఆయన మాటల్లోనే వినండి.


అద్భుత చిత్రాలు తీసి మనకు అందించిన శ్రీ నీలంరాజు మురళీధర్ గారికి కృతజ్ఞతలు


2 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.