2, జూన్ 2011, గురువారం

మా నాన్న డైరీలో ఒక పేజీ

మనం ఎప్పుడు పుట్టామో తెలియాలంటే మనకు ఎవరన్నా చెప్పాల్సిందేకాని, మనకి గుర్తు ఉండే ఆవకాశం లేదు కదా!! ఎప్పుడూ అనుకుంటూ ఉండే వాణ్ని, నేను పుట్టిన రోజున జరిగిన వార్తలు ఏమిటి, మా ఇంట్లో రోజున జరిగిన విశేషాలు ఇలా ఎవరు చెప్తారు. నాకు కుతూహలం ఉన్నా పెద్ద వాళ్లకు ఆసక్తి, జ్ఞాపకం ఉండాలి.

ఇలా అనుకుంటూ పాత కాయితాలు పుస్తకాలు ఓపికగా వెతుకుతూ ఉంటే మా నాయనగారు రోజూ ఖర్చులు వ్రాసుకునే డైరీ నా కంటపడింది. సరే నేను పుట్టినప్పటి (1958) డైరీ దొరుకునా అని ఆసక్తిగా వెతగ్గా వెతగ్గా, నా కృషి ఫలించి పాతబడిపోయి, గోధుమ రంగుకు మారిన చిన్ని డైరీ నా కంటబడింది. ఆత్రుతగా, జూన్ రెండవ తారీకు ఏమేమి ఖర్చులు చేసి ఉంటారా అని వెతికాను.

ఖర్చుల చిట్టా మాట అటుంచి, నాకు పెట్టవలసిన పేరు మా నాయనగారు డైరీలో పేజీ పైనే నేను పుట్టిన టైముతో సహా వ్రాసి ఉంచిన వైనం గమనించాను. ఎంతో ఆశ్చర్యం, ఆనందం చూసినాక. పేరు పెట్టటానికి ఎంతెంత మల్లగుల్లాలు పడతారు! మా నాయన గారు నేను పుట్టిన వెంటనే చులాగ్గా నా పేరు తన డైరీలో వ్రాసుకుని, అదే పేరును నాకు ఇచ్చారు.

కాలం ఎవరికోసం ఆగుతుంది? ఎవ్వరికోసమూ ఆగదు. సాగిపోతూనే ఉంటుంది. నిన్న కాక మొన్నగా అనిపించిన బొంగరాలు , గొళీలు హాయిగా ఆడుకున్న రోజులు, అద్దం ఫోకస్తో సినిమాలు వేస్తూ చేసిన గోల, మా పిల్లలు కూడా దశ దాటి దేశపు ఎల్లలు దాటి ఎక్కడికో జీవనోపాధికి వెళ్ళిపోవటం, అక్కడ నుంచే రోజూ పలకరింపులు, వీడియో చాట్ లు, గుర్తున్నంతవరకూ ఐదు దశాబ్దాల పై కొన్ని సంవత్సరాల జీవితంలో ఎన్నెన్ని జ్ఞాపకాలు!

ఐదు దశాబ్దాల పైన మూడు సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని మార్పులు. పైన మా నాయన గారి డైరీ చూస్తుంటే, అప్పట్లో ఖర్చులు, నాటి ఖర్చులు బేరీజు వేసుకుంటే, కళ్ళు తిరుగుతాయి. ఎంత మార్పు! నేను పుట్టిన రోజున అయిన ఖర్చు మొత్తం కలిపి 44 రూపాయలు. అందులో క్రితం నెల పాల ఖర్చు ఇరవై మూడు రూపాయల నాలుగు అణాలు! ఇప్పుడు ఒక్క రోజుకి కూడా సరిపోవు. డబ్బు విలువ పడిపోయి, ఇప్పుడు వేలకి వేల రూపాయలు జీతం అని చెప్పుకోవటమే కాని, మన జీవన ప్రమాణాలు, తినే తిండిలో నాణ్యం అప్పటికి ఇప్పటికి తేడా ఎంత. మిగిలిన విషయాలు ఏమో కాని, తిండిలో నాణ్యం మటుకు పూర్తిగా పడిపోయి, మృగ్యం అయిపోయింది. మనకు నాణ్యం అనే మాటకు అర్ధం కూడా తెలియకుండా పోయింది. అదే బాధ.

ప్రతి జన్మదినం శలవు పారేసి హాయిగా జరుపుకునే వాణ్ని, ప్రమోషన్ అన్న పేరుతొ ఒక పంజరంలో బంధించి పారేశారు! గత రెండేళ్ళుగా కుదరటం లేదు. సంవత్సరమూ అంతే! హాయిగా హైదరాబాద్ వెళ్లి బాపూ గారి చిత్ర కళా ప్రదర్శన చూస్తూ, ఈ వారమంతా ఎందరెందరో మహానుభావుల్ని చూసి, కలిసి నా పుట్టిన రోజు జరుపుకుందామని ఆశపడ్డాను. ఆశగానే మిగిలింది కుదరలేదు. చూసొచ్చిన వాళ్లైనా వ్రాస్తే చదివి ఆనందిద్దామని ఉన్నది. అంతే ప్రాప్తం మరి!

**********************************************************************
చందమామ వీరాభిమాని, అభిమానులకు అభిమాని, చిన్న పిల్లల సాహిత్యం పెంపోందించటానికి అవిరళ కృషి చేస్తున్న శ్రీ దాసరి వెంకట రమణగారు పంపిన జన్మదిన శుభాకాంక్షలు.
**********************************************************************
శ్రీ ప్రసాద్ గారికి

A.P.J. ABDUL KALAAM

define the

BIRTH DAY

ITS THE ONLY TIME YOUR MOTHER SMILED
..... WHEN YOU CRIED


Great people think big

wish you many many happy returns of the day

హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

--
దాసరి వెంకట రమణ



శ్రీ దాసరి వెంకటరమణ గారు చందమామ సాహిత్యం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పరిశోధన చేస్తున్నారు. పరిశోధన కోసం పట్టు వదలని విక్రమార్కునిలాగా ప్రయత్నించి, అపర భగీరథుని లాగ పట్టుదలతో, 1947 నుండి దాదాపు 2000 సంవత్సరం వరకూ పాత తెలుగు చందమామలను అన్నిటినీ ఎంతో ఖర్చు, ఆపైన శ్రమకు ఓర్చి సేకరించారు. వారి పరిశోధనా వ్యాసం కొరకు చందమామ అభిమానలందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.








15 కామెంట్‌లు:

  1. శివ గారూ !

    పుట్టినరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు!

    మీ పుట్టిన తేది మీ నాన్న డైరీ లో మీ గురించి రాయడం, అది మీరు చూసుకోగలగడం నిజంగా అద్భుతం!!

    రిప్లయితొలగించండి
  3. శివరాం గారూ,
    హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.. మీరిలాగే ఎన్నో పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..

    ఎప్పటిలాగే మీ జ్ఞాపకాలు బాగున్నాయి..

    రిప్లయితొలగించండి
  4. జన్మదిన శుభాకాంక్షలు శివ గారు.

    రిప్లయితొలగించండి
  5. శివ గారూ !
    పుట్టినరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. శివ గారు, పుట్టిన రోజు శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  7. శివరామప్రసాదు గారు
    జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  8. శివ గారూ! మీ నాన్న గారి డైరీలో పేజీ విశేషాలు బాగున్నాయి. పుట్టిన రోజున ఏం ఖర్చులు చేసివుంటారా అని ఆయన డైరీ వెతకటం, ఆ పేజీలో మీ నాన్నగారు మీ పేరు రాయటం, పుట్టిన సమయం నమోదు చేయటం... అది ఇన్నేళ్ళ తర్వాత మీ కంటబడటం- ఎంత థ్రిల్లింగ్ గా ఉండివుంటుందో కదా! అసలా రోజు మీ ఫొటో తీసివున్నాఅది ఈ డైరీ పేజీ అంత ఆత్మీయ భావన కలిగించివుండేది కాదేమో... ఆ గోధుమరంగు కాయితం.. కాస్త వెలిసిపోయిన చేతిరాత నాటి రోజులను ప్రతిఫలిస్తోంది. ఇలాంటి చిరు అనుభూతులే జీవితాన్ని అందంగా మారుస్తాయి.

    రిప్లయితొలగించండి
  9. వేణూగారూ,

    మీ చక్కటి వ్యాఖ్యకు ధన్యవాదాలు. "...ఇలాంటి చిరు అనుభూతులే జీవితాన్ని అందంగా మారుస్తాయి.." అవును మీరన్నది అక్షరాలా నిజం. ఆనందం ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఇస్తూ ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ, బాబు, జ్యోతి, విజయవర్ధన్, కార్తిక్, శ్రీనివాస్, సంకలిని గార్లకు, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. శివరాం ప్రసాద్ గారికి,
    జన్మదిన శుభాకాంక్షలు. చాలా రోజుల తరువాత ఇవాళే బ్లాగులు చూస్తున్నాను.
    లేటుగానైనా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలతో
    - రాధేశ్యాం

    రిప్లయితొలగించండి
  12. రాధేశ్యాం గారూ, తృష్ణ గారూ, మీరు అందించిన, శుభాకాంక్షలకు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.