ముల్కీ విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు తరువాత ఏర్పడిన పరిణామాలను విశదపరుస్తూ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో శ్రీ ఊమెన్ వేసిన కార్టూన్లు.
1972 లో ముల్కీ నిబంధనల గురించిన సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనేఆంధ్ర ప్రాంతంలో పెల్లుబికిన అసంతృప్తి, ప్రత్యెక ఆంధ్ర ఉద్యమానికి దారి తీసింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న వేర్పాటు ఉద్యమం దాదా పు పది సంవత్సరాల బట్టి ఒక రాజకీయ పార్టీ ఆధ్వర్యాన జరుగుతుంటే, 1972-73 ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం ప్రజలనుండి వచ్చి మూడునెలలు జరిగి దాదాపు మూడువందల ప్రజలను పోలీసు కాల్పుల్లో బలి తీసుకుని అణగారి పొయ్యింది. ఈ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ తీరు తెన్నులు తెలుసుకోవటానికి అలనాటి పేపర్లను అధ్యయనం చేసిన తరువాత, కొన్ని ముఖ్య సంఘటనలను ఒక వరుసగా వ్రాస్తే చాలు అప్పటి చరిత్ర ఈ తరం వారికి తెలుస్తుంది అని పించింది.
ఇలా ఒక చరిత్రలో భాగం గురించి వ్రాయటానికి అలనాటి ఆంధ్ర దిన పత్రిక పతాక శీర్షికల కంటే ఎక్కువైనది లేదనిపించి, మొదటి భాగంగా, ఈ కింద అప్పటి ఉద్యమ తీరు తెన్నులను ఇవ్వటం జరిగింది
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE TE MicrosoftInternetExplorer4
ఇలా ఒక చరిత్రలో భాగం గురించి వ్రాయటానికి అలనాటి ఆంధ్ర దిన పత్రిక పతాక శీర్షికల కంటే ఎక్కువైనది లేదనిపించి, మొదటి భాగంగా, ఈ కింద అప్పటి ఉద్యమ తీరు తెన్నులను ఇవ్వటం జరిగింది
<!--[if gte mso 9]>
పతాక శీర్షిక/సంఘటన |
25 సెప్టెంబరు,1972 సాంఘిక సమానత సాధనయే భూస్వామ్య సంస్కరణల లక్ష్యం. కార్యక్రమం అమలులో అధికారులు అనధికారులు తోడ్పడాలని గవర్నర్ విజ్ఞప్తి |
4 అక్టోబరు 1972 ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బధ్ధమేనని సుప్రీం కోర్టు తీర్పు |
9 అక్టోబరు 1972 రాష్ట్రాలకు కేద్రం ఆదేశం, 1972 డిసెంబరు 31 లోగా భూ పరిమితి చట్టాలు |
10 అక్టోబరు 1972 సుప్రీం కోర్టు తీర్పు వల్ల రాష్ట్ర సమైక్యతకు ముప్పు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రకటన |
12 అక్టోబరు 1972 సహనం చూపితే ముల్కీ నిబంధనల సమస్య పరిష్కారం సాధ్యమే -మంత్రి మూర్తి రాజు హితవు |
13 అక్టోబరు 1972 ముల్కీ సమస్య::సుప్రీంకోర్టు తీర్పు పై చిక్కులు, వ్యత్యాసాలు ఎమీ లేవు, ముఖ్యమంత్రి శ్రీ పి. వి. ప్రకటన. నెడే మంత్రి వగ సమావేశం::ప్రజ శ్రేయస్సుకు అనువైన నిర్ణయాలు. |
14 అక్టోబరు 1972 1. ముల్కీ నిబంధనల పై కేద్రంతో చర్చలు, రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయం. ముఖ్య మంత్రి ప్రభృతుల ఢిల్లీ ప్రయాణం, 17 న మళ్ళీ మంత్రివర్గ సమావేశం, సాధ్యయమైనంత త్వరలో యుక్తమైన నిర్ణయాలు ప్రభుత్వ తీసుకోగలదని అధికార ప్రతినిధి వెల్లడి 2. సుప్రీం కోర్టు ఫలితంగా, ఆధ్రులకు ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం, ఎన్ జీ వో నాయకుల ప్రకటన 3. తెలంగాణాలో ఖాళీలు ఆంధ్రులతో నింపరాదు, ప్రభుత్వానికి ఎన్ జి వో నాయకుని సూచన |
16 అక్టోబరు 1972 1. ప్రభుత్వ, ప్రవైట్ సమ్ష్తల ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధ్యాన్యం ఇప్పించే చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ కృషిపై ప్రై శ్రమల మంత్రి శ్రీ వెంకళరావు వివరణ 2. ముల్కీ నిబంధనలు వెంటనే రద్ధు చెయ్యాలి, ఆంధ్ర ఎన్ జి వోల సంఘ కార్యవర్గం విజ్ఞప్తి. |
18 అక్టోబరు 1972 ముల్కీ వ్యతిరేకోద్యమం::ఆంధ్రలో నవంబరు 1 న ఎన్ జి వోల ప్రదర్శనలు, రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం |
19 అక్టోబరు 1972 ముల్కీ నిబంధనల అర్ధం, అమలు జరిపే పధ్ధతి కేద్రంతో సంపదించి ఖరారు, నాలుగున్నర గంటల చర్చల తర్వాత మంత్రివర్గ నిర్ణయం, సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా ఏర్పడిన ప్రతిష్టంభన పరిష్కారానికి వీలైనంత త్వరలో సవివరమైన పథకం తయారు. |
20 అక్టోబరు 1972 1. ముల్కీ సమస్య శాశ్వత పరిష్కారానికి సత్వర కృషి, ముఖ్య మంత్రి హామీ.నిబంధనలు రద్దు చేయాలని ఆంధ్ర ఉద్యోగులు, అమలుపర్చాలని తెలంగాణా సిబ్బంది పట్టుదల. 2. ముల్కీ సమస్యను రావణాసురుడి కాష్టం చేయరాదు కేంద్రానికి రాష్ట్ర మాజీ వ్యవసాయమంత్రి తిమ్మారెడ్డి హెచ్చరిక. |
22 అక్టోబరు 1972 ముల్కీ నిబంధనల సమస్యపై ఈ నెల 24న ఏలూరులో విధ్యార్ధి నాయకులతో ముఖ్యమంత్రి చర్చ. |
23 అక్టోబరు 1972 రాష్ట్ర సమైక్యత పరిరక్షిస్తూ, ముల్కీ సమస్య మీద కేంద్రం సత్వర చర్య గైకొనాలి, విజయవాడ విద్యార్ధి సదస్సు హెచ్చరిక. |
23 అక్టోబరు 1972 ముల్కీ నిబంధనలకు వ్యతిరేకత, తెనాలిలో కళాశాల విధ్యార్ధుల సమ్మె |
25 అక్టోబరు 1972 ఆంధ్రులకు ఏ అన్యాయం జరగకుండా ముల్కీ నిబంధనలు అమలు, విద్యార్ధి నాయకులతో చర్చల సందర్భంగా ముఖ్య మంత్రి హామీ. ప్రధాని ఢిల్లీ రాగానే తుది పరిష్కారం కుదిరే సూచన, పది రోజులు ఓపిక పట్టండని విజ్ఞప్తి |
26 అక్టోబరు 1972 1. ముల్కీ నిబంధనల ప్రస్తుత స్వరూపంలో మార్పు::1974 నుంచి నిబంధనల రద్దు, మంత్రివర్గ సమావేశంలో ఆంధ్ర ప్రాంతం మంత్రుల సూచన, తెలంగాణాకు రక్షణలు పొదిగిస్తే, ఆంధ్ర ప్రాంతానికి కూడా రక్షణలు ఉండాలని హెచ్చరిక, సిబ్బంది ప్రంతీయకరణపై ఆంధ్ర, తెలంగాణా మంత్రుల భిన్నాభిప్రాయాలు 2. ముల్కీ రద్దు కోరుతూ పెక్కు చోట్ల విద్యార్ధుల నిరవధిక సమ్మె 3. ముల్కీ రద్దు, లేదా రాజధాని మార్పు, సచివాలయ సిబ్బంది సంఘం విజ్ఞప్తి |
27 అక్టోబరు 1972 1 జంట నగరాలు మినహా తెలంగాణా ప్రాంతానికి పెద్దల ఒప్పందం వర్తింపు, చవాన్ కు ఆంధ్ర మంత్రుల సూచన 2 ముల్కీ వ్యతిరేక ఉద్యమం ఉధృతి, రాష్త్ర విభజనకు పలువురు ప్రముఖుల అభ్యర్ధన, ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ ఊరేగింపు. 28 అక్టోబరు 1972 1. హైదరాబాద్ ను తటస్థ ప్రాంతం చేయాలనడ మూర్ఖత్వం,తెలంగాణా మంత్రులు శ్రీ ఎం మానిక్ రావు, శ్రీ జి రాజారాం, శ్రీ ఎ మదన్ మోహన్ |
వివిధ ప్రాంతాలలో విధ్యార్ధుల సమ్మె, రేపల్లె, తాడేపల్లి గూడెంలో పాఠశాలలకు శలవలు |
29 అక్టోబరు 1972 1. ఢిల్లీ రమ్మని ఇద్దరు తెలంగాణా, ఇద్దరు ఆంధ్ర మంత్రులకు ముఖ్య మంత్రి పిలుపు, ముల్కీ సమస్యపై చర్చలలో తోడ్పడడానికి ఆహ్వానం. 2. ముల్కీ వ్యతిరేక ఉద్యమం, కర్నూలు న్యాయవాదులు కోర్టుకు గైర్ హాజరు, సమైక్యతకు ముల్కీకి పొత్తు కుదరదు. 3. సచివాలయం, డైరక్టరేట్లల్లో ఎక్కువ ఉద్యోగులు తెలంగాణా వారే, ఆధ్ర మంత్రుల వెల్లడి. |
31 అక్టోబరు 1972 1 విద్యార్ధుల అసంతృప్తిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు, రాజకీయవేత్తలకు, పర్టీలకు రాష్ట్రపతి శ్రీ వి వి గిరి విజ్ఞప్తి. 2. ముల్కీ వ్యతిరేక ఉద్యమం, ఆంధ్ర జిల్లలలోవిద్యార్ధుల సమ్మెలు |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.