31, జులై 2011, ఆదివారం

నిన్నటి జట్కా వాలా

మరీ మధ్య రాజకీయాలే వ్రాస్తున్నాను, కొంచెం మారుద్దాం అనిపించింది. వ్రాయటానికి సరుకు కావాలిగా. కలెక్షన్ భాండారాలు వెతుకుతుంటే, శ్రీ శ్రీ వ్రాసి తన స్వంత గళంలో వినిపించిన నిన్నటి జట్కా వాలా దొరికింది.

పాపం ఒక బీద జట్కావాలా (బీద కాక ధనిక జట్కా వాలా ఉంటాడా?!) శ్రీ శ్రీ దగ్గరకు వచ్చి తన కథ చెప్పుకుంటాడు. అతని కథను హాస్య కరుణ రసాలు కలబోసి, ఒక పక్క నవ్విస్తూనే జట్కా వాలా, ఆయన గుర్రం దీన పరిస్థితి, ఎటువంటి విపత్కర పరిస్థితిలోనూ మొక్కపోని జట్కా వాలా ధీరత్వం ఎంతో బాగా చిత్రీకరించారు శ్రీ శ్రీ. వినాలని ఉవ్విళ్లూరుతున్నారు కదూ, కింది ప్లేయర్ ని క్లిక్ చేసి వినండి, విని ఆలోచించండి.










కర్టెసీ శ్రీ శ్యాం
ఇదే పద్దతిన, శ్రీ విశ్వనాథ వారు ఒక దిక్కులేని అభాగ్యుడి కథ వ్రాసారు. కథ వారి కుమారుడు శ్రీ పావని శాస్త్రి చదివి వినిపించారు. అదీ వినండి. ఉత్తర దక్షిణాలుగా పరిగణించబడ్డ ఇద్దరు రచయితల రచనలలో ఉన్న సామ్యం గమనించండి.





















2 కామెంట్‌లు:

  1. శివగారూ!

    మీ "సాహిత్య అభిమానాని"కీ, మీ కృషికీ వొళ్లు పులకించింది.

    విశ్వనాథవారి కథ విన్నాక, కళ్లనీళ్లాగలేదు. ఆలాగని శ్రీశ్రీ తక్కువకాదు. ఇద్దరూ మహాకవులే.

    అందుకోండి నా శుభకామనలు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.