ప్రత్యేక ఆంధ్ర ఉధ్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు. 1973 జనవరి ఫిబ్రవరి. అనేక చోట్ల పోలీసు కాల్పులు, అనేక మంది మరణం, సి ఆర్ పి దళాల దుశ్చర్యలు, తీవ్ర ఖండనలు, ఆంధ్ర ప్రాంత ఎంపీలు, ఎం ఎల్ ఏల రాజీనామాలు వగైరా వగైరా జరిగిపోతున్నాయి.ఆంధ్ర ప్రాతం మొత్తం అట్టుడికిపోతున్నది బస్సులు లేవు, రైళ్ళు ఆగిపొయినాయి, టెలిఫోన్లు పలకటంలేదు, తపాలా సర్వీస్ బంద్, అనేక నగరాల్లో కర్ఫ్యూ, సి ఆర్ పి దళాలు, కొన్ని చోట్ల సైన్యం పహారా. చివరకు భారీ ధర్నా ఫలితంగా ఆకాశవాణి విజయవాడ కేద్రం కూడ మూగపోయింది. ఈ విషయం మీద ప్రముఖ కార్టూనిస్ట్ ఊమెన్ గారు ఒక కార్టూన్ కూడా వెశారు చూడండి.
సామాన్య ప్రజలందరూ "జై ఆంధ్ర" అని నినదిస్తూ పూర్తిగా మమేకమైపోయి ఆవేశంగా, (అమాయకంగా) తమ పనులు మానుకుని ప్రత్యెక ఆంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు. ఢిల్లికి రమ్మని నాయకులకు పిలుపులు, ప్రత్యేక ఆంధ్ర సూత్ర ప్రాయంగా అంగీకరిస్తేనే వస్తామన్న బూకరింపు మాటలు ఇత్యాదిగా పేపర్లు నిండిపోతున్నాయి.
ఈ సమయంలో, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ పులిచెర్ల గారు ప్రజలను జాగురూకులను చెయ్యటానికి ఒక చక్కటి కార్టూన్ వేశారు. చూడండి ఎంత అర్ధవంతంగా ఉన్నదో!.
అలాగే, ఆంధ్ర సచిత్ర వార పత్రికలో "ముగ్గురు మూర్ఖులు" శీర్షికన "మహేష్" అన్న కలం పేరుతో ఒకాయన వ్రాస్తూ ఉండేవారు. ఆయనే వార ఫలాలు కూడా వ్రాసేవారు. ముగ్గురు మూర్ఖులలో మూడు పాత్రలు-చిదంబరం, చూడామణి, చంచల్రావు. ఈ ముగ్గురూ సమకాలీన విషయాలు మాట్లాడుకుంటున్నట్టుగా వ్రాస్తూ, పాఠకులకు చక్కటి విశ్లేషణ అందించేవారు శ్రీ "మహేష్".
ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, దినపత్రికలో తన ముగ్గురు మూర్ఖులు శీర్షికన, శ్రీ "మహేష్" చాలా చక్కటి వ్యాసం ఒకటి వ్రాశారు. "నాయకులున్నారు జాగ్రత్త" అని మంచి శీర్షిక పెట్టారు ఆ వ్యాసానికి. ఈ కింది బొమ్మను నొక్కి చదువ వచ్చు.
సరిగ్గా ఈ కార్టూన్, పైనున్న వ్యాసంలో ఉన్నట్టుగానే జరిగింది, మార్చ్ 1973 వచ్చేప్పటికి ఉద్యమం అణగారిపోయింది, ప్రత్యేక రాష్ట్రం అంటూ బీరాలు పలికిన పెద్దలందరూ కొత్త మంత్రివర్గంలో మంత్రులు, డిప్యూటీ ముఖ్య మంత్రులూ అయ్యారు. ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం అణచివేయబడింది.
పైన ఉన్న వార్త నిజమయ్యి రెండు ప్రాంత నాయకులూ కలిసి పనిచేసి ఉండి ఉంటే ప్రత్యెక ఆంధ్ర, ప్రత్యెక తెలంగాణా దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే వచ్చి ఉండేది. అప్పుడే ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉంటే, ఆ ప్రాతం ఎంతగానో అభివృద్ది చెంది ఉండేది. ఇప్పుడు అదే ప్రాంతంలో సమైక్య వాదం వినపడటం, దానికో ఉద్యమం రావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ఈ రోజుకీ నాలుగు దశాబ్దాల తరువాత మళ్ళీ అదే పరిస్థితి. రాష్ట్ర విభజన అని ఒక ప్రాంతపు ప్రజల గోడు, దానికి తగ్గట్టుగా రాజినామాలు, ఆ తరువాత అవి తిరస్కరించటం, ఢిల్లీకి వెళ్ళి రావటాలు, అదే నాటకం, పాత్రధారులు మారారు అంతే.
దాదాపు నలభై ఏళ్ళు గడిచినాయి, పైనున్న కార్టూన్ మరియు వ్యాసం ఇప్పటి పరిస్థితులకు చక్కగా అన్వయం అవుతున్నాయి. చివరికి ఏమవుతుందొకదా.
"జై ఆంధ్రా" ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నప్పుడు, ఉద్యమానికి సమర్ధిస్తున్నట్టుగా ప్రకటన వేస్తూ తమ సినిమా ప్రచారం చేసుకున్న విధానం:
అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి మద్దతు పలుకుతూ నటీ నటులు విడుదల చేసిన కొన్ని ప్రకటనలు.
అప్పటి రాష్ట్రపతి, వి వి గిరి గారు విడుదల చేసిన ప్రకటన. చిత్రంగా, రాష్ట్రపతి ఒక ఏడ్ గా తన ప్రకటన ఇవ్వటం చూడండి.
పోస్టల్ సర్వీసులు బంద్ అయిపోవటం వల్ల చాలా మంది తమ కుటుంబంలోని పెళ్లి పిలుపులు పేపర్లో ప్రకటనద్వారా తమ బంధువులకు తెలియచేసారు. మచ్చుకి ఒక ప్రకటన
పైన ఉన్న ప్రెస్ కట్టింగులు అన్నీ కూడ ఆంధ్ర పత్రిక దిన పత్రిక నుండి సేకరించినవి. కర్టెసీ ఏ పి ప్రెస్ అకాడమీ
ఇదే విషయం మీద మునుపు వ్రాసిన
(click to read)
జనవరి 21, 1973
ప్రత్యెక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం - సినీ నటుల మద్దతు

అవును, 1972 లోనే విభజన జరగాల్సింది. చెన్నా రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తెలంగాణా వాదం ముగిసింది.అప్పుడు ఓ పధకం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆంధ్ర నుంచి తెలంగాణ, తెలంగాణా నుంచి ఆంధ్రకు బదిలీ చేశారు.
రిప్లయితొలగించండిఓ ఏడాది తర్వాత, తెలంగణా వారు తమ ప్రాంతాలకి తిరిగి వెళ్లారు. ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం తిరుగు బదిలీ తెచ్చుకోలేక అక్కడె వుండిపోయారు. తర్వాత తెలుగు దెశం పరిపాలనలొ అందరం తెలుగు వాళ్లమే అనుకున్నారు.దానితో వున్న వూళ్లో ఉపాధి, ఉద్యోగాలూ లేక ఇళ్లూ వాకిళ్లూ అమ్ముకుని రాజధానికి పరుగులుతీసి దొరికిన ఉపాధితో అక్కడే స్థిరపడ్డారు ఎందరో సామన్యులు. ఇప్పటి రంగ రెడ్డి జిల్లా వలస వాళ్లతోనే నిండిపోయింది. ఛంద్రబాబు పాలనలో రాజధాని సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. భూమి భూలక్ష్మి అయింది. సంపద పెరగటంతో అధికారం కోసం పోటీ ఎక్కువయింది.తర్వాతి కథ పదేళ్ల నుండి జరగకుండా జరుగుతున్న డైలీ సేరియల్ అందరికి తెలిసిందే. రేపు తెలంగాణ వస్తే అక్కడ తిరగడం ఎలా అన్న భయం వేలాది సామాన్య వలసవారి గుండెల్లో గూడుకట్టుకొని వుంది.ఈ భయానికి కారణం రాజకీయాలు రగిల్చి మిగిల్చిన ద్వేషం.ఈ భయాన్ని పోగొట్టడం అంత తేలికయిన విషయంకాదు!
శివ గారు, చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి"బాబు" గారూ మీరు ఒక కొత్త విషయం చెప్పారు. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అటో ఇటూ బదిలీ చేసారని తెలియదు.
రిప్లయితొలగించండివిజయవర్ధన్. నేను ఈ వ్యాసం వ్రాయటం ఉద్దేశ్యం దాదాపు నలభై ఏళ్ళ క్రితం ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం ఎలా భ్రష్టు పట్టిపోయింది, ఎవరి వాళ్ళ జరిగింది చెప్పటానికి. సెప్టెంబరు 1972 నుంచి మార్చ్ 1973 వరకూ ఆంధ్ర పత్రిక దిన పత్రిక మొదటి పేజీలను సేకరించాను . అవన్నీ కలిపి ఒకటే పి డి ఎఫ్ కింద డౌన్లోడ్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఆ పేపర్ కట్టింగుల్లో "ఆంధ్ర" అన్న పద తీసేసి "తెలంగాణ" అన్న పద వ్రాస్తే చాలు వార్తలు గత మూడు నాలుగు నెలల పేపర్లలో వస్తున్నట్టుగానే ఉంటాయి. చరిత్ర పునరావృతం అవుతున్నది, ఈ విషయం తెలిసి ప్రజల జాగురూకులై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది