5, డిసెంబర్ 2011, సోమవారం

చలం గారి కథ చదువుట



చలం గారు వ్రాసిన అనేకానేక కథలు ఉన్నాయి. వాటిల్లో అంతర్లీనంగా చలంగారి హాస్య దృష్టి కనపడుతూ ఉంటుంది. ఆయన వ్రాసిన రొట్టెల పిండి అనే కథ చదివి వినిపిద్దామని చాలా ప్రయత్నించాను కాని చదువుతూ నవ్వటమే ఎక్కువయ్యింది. భమిడిపాటి  వారా, జంధ్యాల వారా ఒక మాట అన్నారు. "హాస్యం ప్రకాశంగా నలుగురికీ చెప్పేప్పుడు, చెప్పేవాడు కూడా నవ్వుతూ చెబితే, అన్నం వడ్డించేవాడు ఒకచేత బొక్కుతూ వడ్డన చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది" అని .

ఈ మాట చదివిన తరువాత కూడా కొన్ని కథలను చదివి రికార్డ్ చేసేప్పుడు ఎంత ఆపుకున్నానవ్వు  ఆగదు, అలా నవ్వుతూ రికార్డ్ చేస్తే పైన చెప్పిన బంగారు మాటలు గొంతుకు అడ్డం పడతాయి. నేను చదివి రికార్డ్ చేసుకున్న  కథల్లో నవ్వటం తక్కువ మోతాదులో పడిన కథ పోడోమాటిక్  లో చాలా కాలం క్రితం ఉంచాను. అది ఇవ్వాళ వెతుకులాటలో దొరికింది. చదవటం అయితే చదివాను కాని, అక్కడక్కడా నవ్వులవల్ల వినే మీరు "డిస్టర్బ్" అయితే క్షంతవ్యుణ్ణి. 


చలం గారు ఈ కథలో భవిష్య దర్సనం చేయబూనారు. ఆయన కాలంలో అప్పటి వాళ్లకు ఉన్న గాంధీయిజం , ఖద్దరు మీద ప్రేమ, గాంధీ గారి భక్తులు గాంధీ గారి మాటలను పూర్తిగా తు చ తప్పకుండా పాటిస్తే ఏమవుతుంది అన్న విషయం మీద చాలా నిశితంగా విమర్శించారు . 


















7 కామెంట్‌లు:

  1. పర్లేదు సార్, మేనల్లుడి జవాబుల దగ్గర మీరు నవ్వలేదు. అది చాలా గొప్ప.

    రిప్లయితొలగించండి
  2. @Chandu గారు

    చదివి/విని కామెంట్ పెట్టినందుకు థాంక్స్. పిల్లలకి చదువు చెప్పటంలో కొంతవరకు ఆ కథలో "మేనల్లుడు' చెప్పిన విషయాలు ఆలోచింప తగ్గవే అందుకనే ఆ విషయం వచ్చినప్పుడు నవ్వలేదు.

    రిప్లయితొలగించండి
  3. మీ గళం చాలా బాగుంది. చలం గారి సాహిత్యం -నవలలు, మూజింక్స్, ఆయన ఉత్తరాలు చదివేను గాని, ఈ కథ చదవలేదు. ఇది చాలా హాస్యభరితంగా వుంది. ఈ కథ 1947 కొత్తలొ వ్రాసివుండాలి. అయితే, ఇప్పటి భరతదేశం ఆయన ఊహించిన (భయపడ్డ) దానికి పూర్తి భిన్నంగా వుంది!!

    రిప్లయితొలగించండి
  4. "బాబు" గారూ, ఈ కథ పి డి ఎప్ మీకు పంపుతాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఈ కథ పేరు 2025 లేక అలాంటిదే ఒక 70-80 సంవత్సరాల తరువాత తన రోజుల్లో అందరూ ఆవేశపడిపోతూ చెప్పుకుంటున్న ఇజాల ఫలితాలు ఎలా ఉంటాయో చలంగారు తన నిశిత విమర్శకు, హాస్యం జోడించి కథా రూపంగా చెప్పారు.

    అవును అదృష్టం బాగుండి అప్పటి రొమాంటిక్ ఐడియాలు ఆచరణ సాధ్యం కాదు కాబట్టి మన రోజుల్లోకి రాలేదు.

    అలాగే ఈ అన్నా హజారే బృందం గోలగోలగా లోక్పాల్ గురించి కలలు కంటున్నారు. నిజంగా వాళ్ళు అనేవి అన్నీ ఆచరించగలిగితే ఏమవుతుంది అని ఎవరన్నా భవిష్య దర్శనం చేసి వ్రాస్తే బాగుండును. నా ఉద్దేశ్యం లో లోక్పాల్ ఒక నియంత అయి కూచుంటాడు.

    రిప్లయితొలగించండి
  5. యాకూబ్ గారూ నా బ్లాగు మొదటి సారి చూసి మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.