16, డిసెంబర్ 2011, శుక్రవారం

అపురూప గాయనీ గాయకులు

ఆ పాత రోజులు మళ్ళీ రాకూడదూ  అని నిట్టూరుస్తూనే అప్పటి సంగీతం తలుచుకుని పరవసించే వారికోసం ఒక చిరు కానుక. యు ట్యూబ్ మనకు తెలిసినదే. అందులో అనేక వీడియో పాటలు ఉన్నాయి. మనకు అభిమానం ఉన్న గాయనీ గాయకులూ పాడిన పాటలు ఒక్కసారే వరుసగా చూద్దామంటే వెతుక్కోవాలి. అటువంటి గాలింపు చర్యలకు మనం పాల్పడకుండా మనకోసం పాత పాటల వీడియోలు అన్ని ఒకే చోట చూసే ఏర్పాటు చేసారు.  ఇక మీ ఇంటర్నెట్ కనెక్షన్ శక్తి మీ ఓపిక. 

గాయకుల  ఫోటో కింద గాయనీ గాయకుల పేరు క్లిక్ చేస్తే చాలు పైన చెప్పిన చోటుకు వెళ్ళిపోతారు.


తలత్ మెహమూద్
అద్భుతమైన గళం, ఎప్పటికీ మరువలేని గొప్ప పాటలు. నాకు అందరి కంటే అత్యంత అభిమాన గాయకుడు శ్రీ తలత్ మెహమూద్. ముంబాయిలో ఉన్నప్పుడు, ఆయన సమాధి చూద్దామని ప్రయత్నించాను  కాని కుదరలేదు. తరువాత తెలిసింది, వారి మత సంప్రదాయం ప్రకారం, సమాధి కట్టటం వంటివి ఏమీ చేయలేదని.


నాకు సంగీతం వినటమే కాని, ఆ సంగీతపు విషయాలు తెలియవు.
హేమంత్ కుమార్ 
కాని పాట ఎత్తుగడ  అంటే హేమంత్  కుమార్ తరువాతే మరింకేవరినన్నా   చెప్పుకోవాలి. ఏ స్థాయిలో మొదలుపెడితే అదే స్థాయిలో పాట మొత్తం పాడేసి శ్రోతలను ఎంతో అలరిస్తారు ఈయన.






కిషోర్ కుమార్ 
కిషోర్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటారా! ఎన్నెన్ని పాటలు, ఎన్ని రకాల పాటలు. కొతి పాటలు, అల్లరి పాటలు , సరదా పాటలు  దగ్గరనుంచి  వింటుంటే కళ్ళంబడి నీళ్ళు తిరిగే పాటలు కూడా ఎన్నో పాడారు కిషోర్.
 

మహమ్మద్ రఫీ
మనకున్న ఒకే ఒక్క పట్టు వంటి మెత్తటి గొంతు మన మొహమ్మద్ రపీది. రఫీ పాటలు లేని హిందీ సినీ రంగాన్ని ఊహించలేము. షమ్మీ కపూర్ కి అంత పేరు రావటానికి మొహమ్మద్ రఫీ పాటలే కదా కారణం.



సురైయా 
ఒక విలక్షణమైన గొంతు, చక్కని పాడే తీరు. ఆ పాటలు చాయా గీత లో (వివిధభారతిలో రాత్రి పది గంటలకు ఒకప్పుడు వచ్చేవి) వింటూ  నిద్రపోయిన రోజులెన్నో!



గీతా దత్
పాట వింటూ ఉంటేనే, ఈ పాట గీతా దత్ పాడినది  అని తెలిసిపోయ్యెం త చక్కటి గొంతుక, హాయిగా పాడే పద్ధతి.


మహేంద్ర కపూర్  
దేశ భక్తి గీతాలు పాడాలంటే మహేంద్ర కపూరే పాడాలి. ఇంకెవరు పాడినా ఆ శక్తి రాదు ఆ పాటలో. ఆయన పాడిన పాటలన్నీ ఒక ఎత్తైతే, మహేంద్ర కపూర్ మహా భారత్ టి వి సీరియల్ కు పాడిన టైటిల్ సాంగ్ ఒక్కటే ఒక ఎత్తు. మరింకేవరన్నా  పాడగలరా ఆ పాటను!




రాజ్ కపూర్ కి పాటలు పాడటం రాదు అంటే ప్రేక్షకులు నమ్మలేనంతగా,
 ముఖేష్ 
ఆ నటుడికి సరిపోయిన   అద్భుతమైన గొంతు మన ముఖేష్ ది. ముఖ్యంగా శోకసముద్రంలో మునిగిపోయి పాడే పాటలు, మనసును పిండి పారేస్తూ పాడతారు ఈయన. అందుకనే ఈయన పాడిన పాటలు కొన్ని వినే శక్తి లేదు నాకు.



మన్నాడే
మరొక విలక్షణమైన గొంతు మన మన్నాడే ది . కొంతమంది నటులకు మాత్రమె సరిపొయ్యే గొంతు ఆయనది. ఆయన గొంతు లో ఉండే సొగసు గమనించి, రాజ్ కపూర్, తానూ ఎంతో ప్రేస్టీజియస్ తీసిన సినిమా मेरे नाम जोकर (మేరె నాం జోకర్ ) సినిమాలో తనకు ఎప్పుడూ పాడే ముఖేష్ తో కాకుండా, ఆ సినిమాకు తలమానికమైన ఒక  పాట మన్నాడే చేత పాడించారు.  

 


షంషాద్ బేగం గొంతు కూడా వినంగానే
షంషాద్ బేగం 
గుర్తు పట్టేంతప్రత్యేకమైనది.అలనాటి రోజుల్లో హీరోయిన్లకు తన గళం ద్వారా ఎన్నో మంచి పాటలు అందించిన   గాయని ఈవిడ 







1 కామెంట్‌:

  1. సురయా పాటలు వింటుంటే అరవై ఏళ్ళ నాటి పల్లెటూరు, పూరిల్లూ, గ్రామఫోను రికార్డులూ గుర్తుకు వస్తున్నాయి. థాంక్స్.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.